బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్

 

 

కావలసిన పదార్థాలు:

పాలు - 1 లీటర్

మిల్క్ పౌడర్ - 80 గ్రా

పంచదార - 180 గ్రా

క్రీం -1 కప్పు

బటర్ - సరిపడ

 


తయారుచేయు విధానం:

ఒక మందపాటి గిన్నెలో పాలు, మిల్క్ పౌడర్, పంచదార, క్రీం వేసి సన్నని మంట మీద గరిటతో కలుపుతూ ఉడికించాలి.

ఈ మిశ్రమం చిక్కగా అయిన తరువాత పొయ్యి మీద నుంచి దించి ఆరనిచ్చి ఫ్రిజ్ లో పెట్టి చల్లార్చాలి.

ఒక గిన్నెలో 150 గ్రా పంచదారని వేసి కొంచెం నీరు పోసి పొయ్యి మీద పెట్టి సన్నమంట మీద ఉడికించాలి.

పాకం వచ్చి ఉండ కడుతున్నప్పుడు దానిలో బటర్ వేసి బాగా కలపాలి.

తరువాత ఫ్రిజ్ లో పెట్టిన పాల మిశ్రమాన్ని పోసి ఒక ఉడుకు రానిచ్చి, కిందకు దించి ఆరనిచ్చి ఫ్రీజర్ లో పెట్టాలి.

గంట తరువాత బయటకు తీసి బీట్ చేసి మళ్ళీ ఫ్రీజర్ లో పెట్టాలి.

గట్టి పడిన తరువాత స్పూన్ తో తీసి కూల్ గా సర్వ్ చెయ్యాలి.