ఊదల ఇండియానా

 

 

 

కావలసిన పదార్ధాలు:

ఊదలు - 1 కప్పు

తరిగిన పచ్చి మిర్చి - 5

నెయ్యి - టేబుల్‌ స్పూన్లు

కరివేపాకు పొడి - టీ స్పూన్లు

ఉప్పు - తగినంత

కూరగాయ ముక్కలు - ఒక కప్పు (క్యారట్, బీన్స్, క్యాలీఫ్లవర్, పచ్చి బఠాణీ అన్నీ కలిపి)

జీలకర్ర - ఒక టీ స్పూను

నీళ్లు - అర కప్పు

ఇంగువ - పావు టీ స్పూను

కొత్తిమీర - తగినంత

 

తయారుచేసే విధానం:

ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి. స్టౌ మీద కుక్కర్ లో నెయ్యి వేసి పూర్తిగా కరిగిన తరువాత జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. కూరగాయ ముక్కలు, తరిగిన పచ్చి మిర్చి జత చేసి మరోమారు కలియబెట్టాలి. కరివేపాకు పొడి వేసి బాగా కలపాలి. ఊదలలో నీటిని ఒంపేయాలి. మరుగుతున్న నీళ్లలో ఊదలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి. రెండు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి. మూత తీశాక కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేసి వేడివేడిగా వడ్డించాలి.