LATEST NEWS
అదేంటో ఏపీ ప్రస్తావన లేకుండా తెలంగాణ ఎన్నికలు పూర్తి కావడం లేదు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఏపీ ప్రస్తావన వచ్చినా.. అప్పుడు మరో రకంగా ప్రభావం కనిపించేది. ఆంధ్రా పాలకుల పేరిట తెలంగాణ పార్టీలు సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసేవారు. కానీ, ఈసారి రాష్ట్రంలో అసమర్దులకు పట్టం కడితే ఎలా ఉంటుందో  చెప్పడానికి తెలంగాణ పాలకులు ఏపీని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒకటీ రెండుసార్లు బీఆర్ఎస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఎన్నికల సమయం వచ్చాక  ఇటువంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ఏపీలో రోడ్ల పరిస్థితిని వివరిస్తూ సీఎం కేసీఆర్ డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ.. సింగిల్ రోడ్డయితే ఆంధ్రా, ఏపీ రోడ్లెక్కితే మంచాన పడుడే, తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చనే వ్యాఖ్యలు చేశారు. అలాగే వెలుగులు ఉంటే తెలంగాణ.. అంధకారం కనిపిస్తే ఆంధ్ర అని కూడా ఏపీలో విద్యుత్ కోతలను ఎగతాళి చేశారు.  పాలన చేతకాదన్న వాళ్ళే ఇప్పుడు దివాళా తీశారని.. తెలంగాణ విడిపోతే చీకటైతది అంటే ఇప్పుడు ఏపీనే అంధకారమైందని, ఆంధ్రా వాళ్లే ఇప్పుడు తెలంగాణ వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారని కేసీఆర్ పలుమార్లు సెటైర్లు వేశారు.  ఇక మంత్రి కేటీఆర్ అయితే.. ఆంధ్రా వాళ్ళు పరిశ్రమలను పొమ్మంటే మేము వారిని ఆహ్వానించామని, పండగకో, శుభకార్యానికో ఏపీకి వెళ్లినా ఉండలేని పరిస్థితి ఉందని మాట్లాడారు. మరో మంత్రి హరీష్ రావు అయితే ఏపీలో పనితనం లేదు కానీ పగతనం ఉందని మనకి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రజలను కోరారు. కాగా, భర్తకు తగ్గ భార్యగా మంత్రి హరీష్ రావు సతీమణి కూడా ఇప్పుడు ఏపీపై సెటైర్లు వేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం అంటూ ఏపీ ప్రజలపై సానుభూతి చూపిస్తూనే జగన్ మోహన్ రెడ్డి పాలనపై సెటైర్లు వేశారు. ఏపీలో పరిస్థితిని పోలుస్తూ తెలంగాణలో అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత గొప్పగా పాలించిందో చెప్పేందుకు ఏపీలో వైసీపీ పాలనను వేలెత్తి చూపించారు.  కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అనే స్థాయికి ఎదిగితే , జగన్ మోహన్ రెడ్డి పాలనతో ఏపీలో పరిస్థితి దిగాజారిపోయిందని హరీష్ సతీమణి శ్రీనిత వ్యాఖ్యానించారు.  తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారం(నవంబర్ 28)తో  ముగిసింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి తరపున ఇంటిల్లిపాది అందరూ ప్రజల మధ్యకి వచ్చి ఇంటింటికి తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత కూడా భర్త తరపున ప్రచారం నిర్వహించారు. సిద్ధిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీనిత.. ఏపీకి కనీసం రాజధాని కూడా లేదని.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని.. వాళ్లకు కావాల్సినన్ని వనరులు ఉన్నా అక్కడ అభివృద్ది జరగలేదని పేర్కొన్నారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న పంటను.. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న పంటను  బేరీజు వేసుకొని చూడాలని ప్రజలను కోరారు. అన్నీ ఉన్నా అక్కడ అభివృద్ధి లేదంటే.. మనం గొప్పనా? వాళ్లు గొప్పనా? మీరే నిర్ణయించుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందనే దానికి ఏపీలో పరిస్థితులే నిదర్శనమనేలా ఆమె మాట్లాడారు. దీంతో సహజంగానే మరోసారి రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏపీలో శ్రీనిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీపై ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, బీఆర్ఎస్ నేతలు ఎంతగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా   వైసీపీ నేతలలో చలనం ఉండడం లేదు. దాన్నే అలుసుగా తీసుకుని జగన్ వైఫల్యాన్ని బీఆర్ఎస్ నేతలు తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్క మాట మాట్లాడినా కట్టకట్టుకుని ఎదురుదాడికి దిగే వైసీపీ నేతలు.. పొరుగు రాష్ట్రం నేతలు ఇలా ప్రతిసారి ఎగతాళిగా మాట్లాడినా నోరు మెదపడం లేదు. ఏపీ ప్రజలకు ఇది మరింత ఆగ్రహం తెప్పిస్తున్నది. సీఎం జగన్ ను నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా వారిపై విరుచుకుపడే నేతలు.. పరాయి రాష్ట్రంలో జగన్ పాలనపై హేళన చేస్తున్నా కుక్కిన పెనులాగా కిక్కిరుమనకుండా ఉన్నారంటే వారి వైఫల్యాన్ని వారే  అంగీకరించినట్లు భావించాల్సి వస్తున్నదని   పరిశీలకులు విశ్లేషిసున్నారు.
ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ వివాహం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం (నవంబర్ 27) వివాహం చేసుకున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాత అనే మహిళను ఆయన వివాహం చేసుకున్నారు. కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వీరి వివాహం  నిరాడంబరంగా జరిగింది. అయితే  ఈ వివాహం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  దీనికి కారణం ఆయనకు ఇది మూడవ వివాహం కావడం.. ముందు ఇద్దరు భార్యలకు ముగ్గురు పిల్లలు ఉండడం. అంతేకాదు, ఎమ్మెల్సీ చేసుకున్న ఈ మూడవ వివాహానికి రెండో భార్య, కుమారుడు సాక్షులుగా సంతకాలు చేయడం మరో విశేషం. ఇన్ని ట్విస్టులు ఉండడం వలనే ఈ పెళ్లిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.  జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశంలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005లో కైకలూరు జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో తెలుగుదేశం నుండి కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచిన జయమంగళ వెంకటరమణ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. దీంతో ఆ ఎన్నికల అనంతరం  వైసీపీ గూటికి చేరిపోయారు. వైసీపీ ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది.  దీంతో ఆయన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో   వైసీపీ నుండి ఆయనే కైకలూరు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎమ్మెల్సీ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా.. వారికి ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత సునీత అనే మహిళను వెంకటరమణ వివాహం చేసుకోగా.. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటరమణ కైకలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రెండో భార్యతో మనస్పర్థలు రాగా.. కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. దీంతో రెండో భార్య సునీత అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణపై కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో 2019లో మచిలీపట్నం కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. కాగా ఇప్పుడు ఎమ్మెల్సీగా వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు కాగా. వెంకట రమణ రెండో భార్య సునీత, ఆమె కుమారుడి సమక్షంలోనే ఈ వివాహం జరిగింది. రెండో భార్య సునీత ఈ వివాహానికి సాక్షి సంతకం పెట్టడం గమనార్హం. ఇక, వధువు సుజాతకు ఇది రెండో వివాహం కాగా ఆమెకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్త నుండి విడిపోగా ఇప్పుడు ఎమ్మెల్సీని వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించనున్నారు. కాగా, వీరి పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ వెంకటరమణ మూడవ పెళ్లిపై ఇంతగా చర్చకు కారణం సొంత పార్టీ నేతలే కావడం గమనార్హం. గతంలో వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేసే సమయంలో ఆయన మూడు వివాహాల అంశాన్ని సందర్భం ఉన్నా లేకున్నా లేవనెత్తేవారు. మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ, చివరాఖరికి ముఖ్యమంత్రి తో సహా అందరూ ఇదే అంశంపై దారుణంమైన  విమర్శలు చేశారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి అయితే అమ్మ ఒడి నిధులు విడుదల చేస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అభం శుభం తెలియని చిన్నారుల ముందే పవన్ కళ్యాణ్ వివాహాలపై మాట్లాడారు. ఈ అంశంపై అప్పట్లోనే రాజకీయ వర్గాలు విస్తుపోయాయి. అప్పటి నుండి సీఎం జగన్ సందర్భం వచ్చినా, రాకున్నా ప్రతిసారీ పవన్ పై ఇవే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక మంత్రులు అంబటి లాంటి వాళ్ళైతే సోషల్ మీడియాలో కూడా దారుణ వ్యాఖ్యలు చేశారు.  కాగా ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ మూడవ పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు వైసీపీ నేతలను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతల విమర్శలే ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకటరమణ పాలిట శాపంగా మారాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఎలుగుబంటి దాడిలో విశాఖ జూపార్క్ కీపర్ బానవరపు నగేశ్ (23) మృతి చెందడం కలకలం రేపింది. పార్క్ పరిసరాల్లో శుభ్రం చేస్తున్న యువకుడిపై నిన్న ఉదయం ఎలుగుబంటి ఒక్కసారిగా దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన నగేశ్‌ను జూ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడిచేస్తుండడాన్ని చూసి సందర్శకులు హడలిపోయారు. ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన నగేశ్‌ది విజయనగరం జిల్లాలోని గజపతినగరం. విశాఖ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రెండేళ్లుగా విశాఖ జూలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నగేశ్ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించినట్టు జూ క్యురేటర్ నందిని సలేరియా తెలిపారు. నగేశ్‌పై దాడిచేసిన ఎలుగుబంటి ‘జిహ్వాన్’ను మిజోరం నుంచి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. బోనులో ఉండాల్సిన ఎలుగుబంటి బయటకు ఎలా వచ్చిందన్నది అంతుబట్టడం లేదు. బోను తలుపులు ఎవరైనా తీశారా? లేదంటే, సరిగా వేయకపోవడంతో వాటంతట అవే తెరుచుకున్నాయా? అన్నదానిపై జూ అధికారులు  ఆరా తీస్తున్నారు.ఎప్పటిలాగే పార్కు పరిసరాలు శుభ్రం చేసేందుకు ఎలుగు బంటి ఉంచిన ప్రదేశానికి నగేష్     వెళ్లాడు. ఆ తర్వాత అతను ఎవరికీ కనిపించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి వెతికే సరికి తీవ్ర గాయాలై కనిపించాడు. తలమీద, ఎడమ చెయ్యిపైన బలమైన గాయాలయ్యాయి.  ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు క్యూరేటర్ చెప్పారు. ఎలుగు బోనులో ఉందనుకుని తన పని తాను చేసుకుంటుండగా ఒక్కసారిగా అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. జూ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఎలుగు బంటిని బోనులో బంధించారు.సమాచారం అందుకున్న అరిలోవ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (నవంబర్ 30)న జరగనుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3న  నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ, డిసెంబర్ 30న ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత రంగంలో  2,290 అభ్యర్థులు  మిగిలారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కోసం ఎన్నికల సంఘం  36,655 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఒక ఓటర్ల విషయానికి వస్తే 1,58,71,493 పురుషులు 1,58,43,339 స్త్రీలు మరియు 2,557 ట్రాన్స్ జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.   రాష్ట్రం లోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను, 18 నియోజకవర్గాలు ఎస్సీ   9 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడు ఉన్నాయి.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మొత్తం 119 నియోజకవర్గాలలో తన అభ్యర్థులను బరిలో నిలపగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నారు. అలాగే విపక్ష కాంగ్రెస్  రాష్ట్రంలోని 118నియోజకవర్గాలలో  అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్ నుంచి కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో నిలిచారు.  కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న సీపీఐ ఒక స్థానం నుంచి బరిలో నిలిచింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితే  జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. బీజేపీ, జనసేన కూటమి మొత్తం 119 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక మరో జాతీయ పార్టీ బహాజన సమాజ్ పార్టీ 106 మంది అభ్యర్థులను, సీపీఎం 19 మంది అభ్యర్థులనుఎంఐఎం 9 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి.  ఈ ఎన్నికలలో ధన ప్రవాహాన్ని, ప్రభావాన్ని నిలువరించేందుకు జరిపిన తనిఖీలు, దాడులలో ఎన్నికల సంఘం  659.20 కోట్ల  నగదు  జప్తు చేసింది.  2023 శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లను ప్రకటించగా,  బీజేపీ  సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది.   బిసి వ్యక్తిని   ముఖ్యమంత్రిని చేస్తామని వాగ్దానం చేసింది.  మరో వైపు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  తొమ్మిదేళ్ల పనితీరునే నమ్ముకుంది.  మూడు ప్రధాన పార్టీలూ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సర్వేలు, అంచనాలను పక్కన పెడితే.. తెలంగాణ తీర్పు ఎవరివైపు అన్న ఉత్కంఠ మాత్రం వచ్చే నెల 3 వరకూ కొనసాగుతుంది.  
తెలుగు రాష్ట్రాల్లో  నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని... ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వెల్లడించింది. బుధవారం నుంచి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా బలపడుతుందని తెలిపింది. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరింది. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు గాలి 25 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని పేర్కొంది. డిసెంబర్ 1న గాలి వేగం 60 నుంచి 80 కిలోమీటర్లుగా ఉంటుందని వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గతకొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతపవనాలు, తూర్పుగాలుల ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయి. తాజాగా.. రాష్ట్రంలో వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జనగాం, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని చెప్పింది.
ALSO ON TELUGUONE N E W S
రజనీకాంత్  జైలర్ సినిమా విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు. ఆ సినిమా సాధించిన విజయం తాలూకు జ్ఞాపకాలన్నీ ఇంకా ఎవరి మైండ్ లో నుంచి వెళ్లిపోలేదు. జైలర్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో జ్ఞానవేల్ రాజాతో ఒక చిత్రం చేస్తున్న రజనీ ఆ తర్వాత  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు. ఆ మూవీ అనౌన్స్ మెంట్  చేసినప్పుడే రజనీ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోను లోకేష్ రజనీ కాంబో  సరికొత్త  రికార్డులు  సృష్టిచబోతుందనే విషయం అందరికి అర్ధం అయ్యింది. అలాగే తాజాగా ఈ మూవీకి సంబంధించి వస్తున్న ఒక న్యూస్ రజనీ లోకేష్ ల సినిమా తాలూకు స్థాయిని  చెప్తుంది.   రజనీ, లోకేష్ ల కాంబినేషన్ లో వస్తున్న తలైవర్ 171  లో లేటెస్ట్ యువ కధానాయకుడు శివ కార్తికేయన్ నటించబోతున్నాడనే వార్తలు తమిళనాట మొత్తం చక్కర్లు కొడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే రజని అభిమానులకి అలాగే శివ కార్తికేయన్ అభిమానులకి అలాగే అన్నిటికంటే ముఖ్యంగా సినిమా ప్రేక్షకులకి ఒక పండగే అని చెప్పవచ్చు. చిత్ర బృందం కార్తికేయన్ విషయం అధికారకంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ వార్తలు విన్న ఇరువురి అభిమానులు మాత్రం సినిమాలో శివ కార్తికేయన్  క్యారక్టర్   ఏ విధంగా వుండబోతుందనే  ఆలోచనలో ఇరువురి అభిమానులు ఉన్నారు. తమిళ చిత్ర సీమలో శివ కార్తికేయన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.ఎన్నో అధ్బుతమైన చిత్రాల్లో నటించి తన కంటూ ప్రత్యేక అభిమానగణాన్ని సంపాదించాడు. అలాగే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కి మంచి పేరు ఉంది. తలైవర్ 171 ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  
త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన ఘటనలు అందరికీ తెలిసినవే. చివరికి త్రిషకు క్షమాపణ చెప్పాడు మన్సూర్‌. అంతటితో ఆగకుండా తనను దుర్భాషలాడిన త్రిష, ఖుష్‌బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా వేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.  దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశాడు మన్సూర్‌. ఈ వీడియోలో చిరంజీవిని విమర్శిస్తూ మాట్లాడాడు మన్సూర్‌. అసలు ఆ వీడియోలో మన్సూర్‌ ఏం మాట్లాడాడో చూద్దాం.... ‘‘చిరంజీవి ప్రతి సంవత్సరం ఓల్డ్‌ హీరోయిన్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటారు. నేను చిరంజీవి సినిమాల్లో నటించాను. కానీ, నన్ను మాత్రం ఆహ్వానించలేదు. మీరు ఎవరితో పార్టీ చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ, ఒక ఇష్యూ జరిగినపుడు కనీసం చిరంజీవిగారు నాకు ఫోన్‌ చేసి జరిగింది ఏమిటి అనేది తెలుసుకోకుండా నాది వక్రబుద్ధి అంటూ మాట్లాడారు. ఎవరిది వక్రబుద్ధి? ఆయన పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించారు. పెద్ద పెద్ద పార్టీల నుంచి డబ్బు వస్తుంది. ఆయన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీ పెట్టారు. నేనెప్పుడూ ఆయన్ని చూడలేదు. వాళ్ళందర్నీ సంపాదించుకోమనండి. కానీ, వాళ్ళు సంపాదించింది పేదవారికి పంచరు. వారి అవసరానికే వాడుకుంటారు. నన్ను దూషిస్తూ మాట్లాడిన చిరంజీవి, త్రిష, కుష్‌బులపై పరువు నష్టం దావా వేస్తాను. త్రిషపై రూ.10 కోట్లు, కుష్‌బూపై రూ.10 కోట్లు, అలాగే చిరంజీవిపై రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేయబోతున్నాను. వచ్చిన డబ్బును తమిళనాడులో కల్తీ మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు అందజేస్తాను. నాకు ఒక్క పైసా కూడా అక్కర్లేదు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదు. నేను వెల్‌ సెటిల్డ్‌.  ఐ యామ్‌ హ్యాపీ విత్‌ మై వరల్డ్‌. నాకు ఉన్న పేరును ఎవ్వరూ చెడగొట్టలేరు. ఆ ముగ్గురి మీద పరువు నష్టం దావా వేసి వచ్చిన డబ్బును పేదవారికి పంచుతాను. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా’’ అన్నారు.   
ఈమధ్య సినిమాని అధికారికంగా ప్రకటించకుండా సైలెంట్ గా షూట్ చేయడం ట్రెండ్ గా మారింది. సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో పీపుల్ మీడియా బ్యానర్ లో రూపొందుతోన్న మూవీ అలాగే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకుండా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే బాటలో మరో సినిమా పయనిస్తోంది. అది కూడా పీపుల్ మీడియా బ్యానర్ లోనే రూపొందుతుండటం విశేషం. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'ఈగల్' చిత్రం 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే ఇదే కాంబినేషన్ లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది పీపుల్ మీడియా. పైగా ఇది మల్టీస్టారర్ కావడం విశేషం. రవితేజతో పాటు మంచు మనోజ్, తేజ సజ్జా ఇందులో నటిస్తున్నారు. ఇందులో మనోజ్ ది విలన్ రోల్ అని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా సైలెంట్ గా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. మామూలుగా సినిమా హిట్ అయితే దర్శకుడికి మరో అవకాశం ఇవ్వడం సహజం. అలాంటిది సినిమా విడుదల కాకముందే అవకాశం ఇవ్వడమే కాకుండా, సైలెంట్ గా షూటింగ్ కూడా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. పవన్  గత చిత్రాలైన భీమ్లా నాయక్ ,బ్రో ల కంటే ముందే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ ఆ రెండు చిత్రాలు  విడుదల అయ్యాయి గాని హరి హర మాత్రం లేటు అవుతు వస్తుంది. ఎప్పటినుంచో ఈ మూవీ నుంచి తాజా అప్ డేట్ రావటంలేదనే బాధలో ఉన్న పవన్  అభిమానులకి  తాజాగా ఒక హీరో చెప్పిన ఒక  డైలాగ్ తో మంచి జోష్ వచ్చింది. బాలీవుడ్  వర్సటైల్ యాక్టర్ బాబిడియోల్  పవన్ కళ్యాణ్ నయా మూవీ హరిహర వీరమల్లులో కూడా  ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే యానిమల్ లో కూడా విలన్ గా నటిస్తున్నాడు. నిన్న జరిగిన యానిమల్  ప్రీ రిలీజ్ ఫంక్క్షన్ కి హాజరయ్యిన బాబీడియోల్  హరి హర వీర మల్లు సినిమాలోని తన క్యారక్టర్ కి  సంబంధించిన ఒక డైలాగ్ ని చెప్పాడు.  బాద్షా బేగం మీరు  మా ప్రాణం..మా ప్రాణాలు కాపాడారు..మీకేం కావాలో కోరుకోండి..ఆ కోరిక నెరవేరడానికి ఆదేశాలు జారీ చేస్తున్నాను అని  చెప్పాడు. ఇప్పుడు బాబీ డియోల్ చెప్పిన ఈ  డైలాగ్ పవన్ ఫాన్స్ లో జోష్ తెచ్చింది. అలాగే ఆ  డైలాగ్   మరోసారి అందరు హరి హర వీర మల్లు గురించి మాట్లాడుకునేలా చేసింది. హరి హర వీర మల్లు  రెండు సంవత్సరాల క్రితమే షూటింగ్ ని ప్రారంభించుకుంది. మొదట కొన్ని షెడ్యూలని పూర్తి చేసుకున్న ఈ సినిమా  కొన్ని అనుకోని కారణవల్ల వాయిదా పడుతు వస్తుంది. 17 వ శతాబ్దం నాడు మొఘల్ లు హైదరాబాద్ ని పరిపాలించినప్పుడు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా  హరి హర వీర మల్లు తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జట్ తో  రూపుదిద్దుకుంటున్న హరి హర వీరమల్లు  షూటింగ్ ని త్వరగా పూర్తి చేసుకోవాలని పవన్ ఫాన్స్ కోరుకుంటున్నారు.    
ఈమధ్యకాలంలో ఎక్కువ బిజీగా ఉన్న హీరోయిన్‌గా శ్రీలీలకు మంచి పేరుంది. పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీలీల ఆ తర్వాత చేసిన ధమాకా సూపర్‌హిట్‌ కావడంతో ఆమెకు ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ వచ్చేసింది. అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేని హీరోయిన్‌ అయిపోయింది. ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాలు ఇప్పుడు వరసగా రిలీజ్‌ అవుతున్నాయి. అయితే మొదటి రెండు సినిమాల్లో వచ్చినంత పేరు ఇప్పుడు రిలీజ్‌ అవుతున్న సినిమాలకు రావడం లేదన్నది వాస్తవం. మొదటి దెబ్బ స్కందతో తగిలింది. ఈ సినిమా రామ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన భారీ సినిమా అనే పేరే తప్ప శ్రీలీలకు ఏమాత్రం ఇంపార్టెన్స్‌ ఉండదు. ఒక కమర్షియల్‌ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే వారికి ఎలాంటి ఇంపార్టెన్స్‌ ఉంటుందో ఇందులోనూ అంతే ఉంది. రెండు సూపర్‌హిట్‌ సినిమాల తర్వాత వచ్చిన స్కంద శ్రీలీలకు తగిలిన మొదటి షాక్‌. ఆ తర్వాత వచ్చిన భగవంత్‌ కేసరి కమర్షియల్‌ సినిమా అయినప్పటికి అందులో హీరోయిన్‌గా కాకుండా తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కూతురి పాత్ర కావడంతో శ్రీలీలకు అంత హైప్‌ రాలేదు. ఆ సినిమాలో బాలకృష్ణదే హవా కావడంతో శ్రీలీలకు ప్రత్యేకమైన గుర్తింపు రాలేదు. అయితే క్లైమాక్స్‌లో ఆమె చేసిన రిస్కీ ఫైట్స్‌ మాత్రం అందర్నీ థ్రిల్‌ చేశాయి. తాజాగా విడుదలైన ఆదికేశవ ఆమెకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశించింది. అయితే ఈ సినిమా కూడా పరాజయాన్ని చవిచూడడంతో వచ్చేనెల 8న రిలీజ్‌ అవుతున్న నితిన్‌ కొత్త సినిమా ‘ఎక్స్‌ట్రా’ పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో తన టాలెంట్‌ని పూర్తిగా చూపించే స్కోప్‌ ఉండడంతో తనకు తప్పకుండా ప్లస్‌ అవుతుందని భావించింది. ఈ సినిమాలో తను వేసిన స్టెప్పులకు మంచి పేరు వస్తుందన్న నమ్మకంతో ఉంది.  ‘ఎక్స్‌ట్రా’పై అన్ని ఆశలు పెట్టుకున్న శ్రీలీలకు మరో షాక్‌ తగిలింది. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్‌ ఒక్కసారిగా ఆమె గాలి తీసేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలోని అన్ని క్యారెక్టర్ల గురించి చెబుతూ శ్రీలీల క్యారెక్టర్‌ గురించి అడిగినపుడు.. ఆమెది చాలా రొటీన్‌ క్యారెక్టర్‌ అనీ, ఒక కమర్షియల్‌ సినిమాలో హీరోయిన్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ ఉంటుందో ఈ సినిమాలోనూ అంతే  ఉంటుందని చెప్పడంతో రాబోయే సినిమాలో శ్రీలీల క్యారెక్టర్‌ ఏమిటి అనేది అందరికీ అర్థమైపోయింది. అంటే నెక్స్‌ట్‌ రాబోయే సినిమా శ్రీలీల కెరీర్‌కి ఎంతమాత్రం ఉపయోగపడదని నితిన్‌ చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తోంది. మొదటి రెండు సినిమాలు సూపర్‌హిట్‌ అవడం, దాంతో లెక్కకు మించిన అవకాశాలు రావడంతో మరో రెండు మూడు సినిమాలతో హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌కి వెళ్లిపోతుందని భావించిన వారందరూ రిలీజ్‌ అవుతున్న సినిమాలను చూసి ఇలా అయితే కష్టమే అనుకుంటున్నారు. 
ఒక్క కథతోనే స్టార్‌ డైరెక్టర్‌ ఇమేజ్‌ తెచ్చుకోవడం అనేది అసాధ్యం. అయితే ఆ ఆసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఆ ఒక్క కథతోనే తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ చేశాడు, హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ చేశాడు. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ విజయం సాధించి టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో చేరిపోయాడు. ఆ రెండు సినిమాలు సాధించిన ఘనవిజయాలతోనే సందీప్‌రెడ్డి చేసిన తాజా చిత్రం ‘యానిమల్‌’కు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అందులోనూ ట్రైలర్‌ రిలీజ్‌ అయిన తర్వాత సినిమాపై హైప్‌ మరింత పెరిగింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశాడు సందీప్‌.  ‘యానిమల్‌’ సినిమాను ఒక కథగా చెబితే ఏ హీరో అయినా చాలా ఈజీగా రిజెక్ట్‌ చేసెయ్యొచ్చు. ఈ కథలో లాజిక్కులు ఎక్కడు ఉన్నాయి? డ్రామా ఇలా ఉందేంటి? ఇలాంటి కారణాలతో కథనుఎంతో ఈజీగా రిజెక్ట్‌ చేసెయ్యొచ్చు. కానీ, రణబీర్‌ అలా చేయలేదు. కథను నమ్మాడు, ఆ తర్వాత నన్ను ఎక్కువ నమ్మాడు. సినిమా పూర్తయ్యేవరకు నాతోనే ట్రావెల్‌ చేశాడు. ఇది నా సినిమా కాదు. మీ సినిమా. మళ్లీ చెప్తున్నా లెంగ్త్‌ గురించి అసలు టెన్షన్‌ వద్దు. అలాగే సినిమా ఫస్ట్‌లో వచ్చే సీన్స్‌ అసలు మిస్‌ కావద్దు. ముగింపు కూడా చాలా ఇంపార్టెంట్‌ మిస్‌ అవ్వొద్దు. సినిమా మొత్తం చూడాలని ఇలా చెప్పడం లేదు. సినిమా మీద ఎంతో నమ్మకంతో ఉన్నాను. సినిమా చూసిన తర్వాత మీకు మంచి ఫీల్‌ వస్తుంది’’ అన్నారు సందీప్‌రెడ్డి. 
సోషల్‌ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఏ విషయం అయినా క్షణాల్లో ప్రపంచంలోని ఎవ్వరికైనా చేరిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీలపై రకరకాల కామెంట్స్‌ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల అలాంటి కామెంట్స్‌ క్షణాల్లో వైరల్‌గా మారిపోతున్నాయి. ఈమధ్యకాలంలోనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు నెటిజన్లు. ముఖ్యంగా హీరోయిన్లను టార్గెట్‌ చేస్తూ పెడుతున్న కామెంట్స్‌ అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నాయి.  తాజాగా హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌ఫుత్‌ గురించి ఒక నెటిజన్‌ పెట్టిన కామెంట్‌ అందరికీ చిరాకు కలిగిస్తోంది. అయితే ఆ కామెంట్‌కి ధీటుగా పాయల్‌ సమాధానం ఇవ్వడంతో అందరూ ఆమెను శభాష్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన పాయల్‌ ఆ సినిమాలో తన అందచందాలతో యూత్‌ని విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. మళ్ళీ పాయల్‌తోనే అజయ్‌ భూపతి చేసిన ‘మంగళవారం’ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్‌ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఓ నెటిజన్‌ ‘మంగళవారం’ సినిమాలోని ఓ సీన్‌ క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేసాడు. అంతే కాదు.. ఆమె లో దుస్తుల గురించి ఈ పోస్ట్‌ పెట్టాడు. దీనికి రియాక్ట్‌ అయిన పాయల్‌ ఆ సీన్‌లో తాను వేసుకున్న లో దుస్తులు నావి కావని, ప్రొడక్షన్‌ వాళ్లు ఇచ్చినవని సమాధానం ఇచ్చింది. ఎంతో డేరింగ్‌గా ఆ నెటిజన్‌కి సమాధానమిచ్చిన పాయల్‌ను అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఆ నెటిజన్‌ పోస్టును తప్పుబడుతూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.   
అనౌన్స్ మెంట్ తోనే సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగించింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్'. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'చి.ల.సౌ'తో దర్శకుడిగా మారి ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను దర్శకుడు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, డైరెక్టర్ మారుతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బేబీ ఫేమ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కనున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. గత నెలలో 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
దండు పాళ్యం సినిమాతో ప్రేక్షకుల అందర్నీ అలరించిన నటి పూజా గాంధీ. వాస్తవానికి 2001 లోనే చిత్ర రంగ ప్రవేశం చేసిన పూజ దండుపాళ్యం సిరీస్ తో బాగా పాపులర్ అయ్యింది. మూడు సిరీస్ లుగా వచ్చి ఘన విజయం సాధించిన దండుపాళ్యంలో  పూజ బోల్డ్ గా నటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు తాజాగా  పూజ  పర్సనల్ లైఫ్ కి సంబంధించిన  ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది. పూజ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. లాజిస్టిక్స్ కంపెనీ యజమాని అయిన  విజయ్ అనే వ్యక్తితో  పూజ పెళ్లి నవంబర్ 29 న ఘనంగా జరగనుంది. అతి కొద్దీ మంది అతిధుల సమక్షంలో  బెంగుళూర్ లో వారిరువురి వివాహం జరగనుంది.  వాస్తవానికి 2012 లోనే పూజకి ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి పెళ్లి పీటలు ఎక్కకుండానే విడిపోయారు. ఆ తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ తో పూజ పెళ్లి జరిగినట్టు రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ అబద్హాలని పూజా చెప్పింది. కాగా ప్రస్తుతం పూజా వయసు  40  సంవత్సరాలు. సోషల్ మీడియా ద్వారా ఆమె పెళ్లి విషయం తెలుసుకున్న  అభిమానులు ,సన్నిహితులు అందరు ఆమెకి పెళ్లి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఇక నైనా  పూజ లైఫ్ లో సెటిల్ అవ్వాలని  తన నూతన దాంపత్యం కలకాలం నిలవాలని కోరుకుంటున్నారు.   
మహానుభావుల మాటలు అర్థంకావు అన్నట్టుగా తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడిన మాటలు పొగిడాడో తిట్టాడో అర్థంకానట్టుగా ఉన్నాయి. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరగగా మహేష్ బాబు, రాజమౌళి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ సందీప్ ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పోల్చాడు. "కొత్త కొత్త డైరెక్ట‌ర్లు వ‌స్తారు. సూపర్ హిట్ సినిమాలు తీసి బాగా పేరు సంపాదిస్తారు. కానీ ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే సినిమా అంటే ఇలాగే తీయాలి అనే ఫార్ములాను షేక్ చేసే ద‌ర్శ‌కులు వ‌స్తారు. మన త‌రంలో నాకు తెలిసి అలాంటి ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ. దాని త‌ర్వాత సందీప్ రెడ్డినే. నార్మ్స్ ని, ఫార్ములాల‌ను ప‌క్క‌న పెట్టి నేను ఇలాగే సినిమా తీస్తా అని చాటిన ద‌ర్శ‌కుడు సందీప్." అంటూ సందీప్ పై ప్రశంసలు కురిపించే ప్రయత్నం చేశాడు దర్శకధీరుడు. అయితే సందీప్ గురించి రాజమౌళి మాట్లాడిన మాటలు నిజంగా ప్రశంసేనా అనే అనుమానం కలిగిస్తున్నాయి. బహుశా సందీప్ కూడా అదే సందిగ్ధంలో ఉండుంటాడు. ఒకప్పుడు ఆర్జీవీ గొప్ప దర్శకుడే కానీ కొన్నేళ్లుగా ఆయన తీస్తున్న సినిమాలు మరీ నాసిరకంగా ఉంటున్నాయి. 'శివ'తో దర్శకుడిగా పరిచయమై టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన వర్మ.. ఆ తర్వాత తెలుగు, హిందీలో పలు హిట్ సినిమాలను తీశాడు. అయితే తర్వాత 'నేను ఇలాగే సినిమా తీస్తా' అనేది ముదిరి 'నా ఇష్టం'గా మారి ఏవేవో సినిమాలు తీస్తూ తన విలువని పోగొట్టుకున్నాడు. ఒకప్పటి ఆర్జీవీతో పోలిస్తే దానిని ప్రశంసగానే భావించాలి కానీ, ఇప్పటి ఆర్జీవీతో పోలిస్తే మాత్రం దానిని ప్రశంసగా భావించలేము.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
ప్రతిమనిషి జీవితంలో బంధాలు, అనుబంధాలతో పాటు కెరీర్ గురించి కూడా శ్రద్ద పెడతాడు. నిజానికి బంధాలు అనుబంధాలు అనేవి కాలంతో పాటూ కొత్తగా కూడా పుడతాయి. కానీ కెరీర్ అనేది చాలా ముఖ్యం. ఏ వయసులో చెయ్యాల్సిన పని ఆ వయసులో చెయ్యకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. చదువు..  ఉద్యోగం.. ఈ రెండూ జీవితంలో ఎంత బాగా బ్రతకగలం అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. ఇవి రెండూ బాగుండాలన్నా ఆ తరువాత జీవితం సజావుగా సాగాలన్నా జీవితంలో నమ్మకమైన మనుషులతో స్నేహం అవసరం. ఎందుకంటే జీవితంలో అన్ని విషయాలను స్నేహితులతో పంచుకుంటారు. ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో ఆచార్య చాణక్యుడు  నొక్కి చెప్పాడు. చాణక్యనీతిలో ఎవరిని నమ్మకూడదని చెప్పాడంటే.. ఆయుధాలు ఉపయోగించే వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. కత్తులు, పిస్టల్, ఇతర ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నవారు ఎక్కువ కోపం స్వభావం కలిగినవారై ఉంటారు. వీరికి కోపం వస్తే కొన్నిసార్లు ముందు వెనుక ఆలోచించకుండా ప్రమాదం తలపెడతారు. అందుకే ఆయుధాలు ఉన్నవారితో దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. బలవంతులతో స్నేహం ఎప్పటికైనా ముప్పేనని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే బలవంతులు తమ స్వార్థం కోసం మనుషుల్ని ఉపయోగించుకుంటారు. అది పెద్ద తప్పేం కాదనే వాదనలో ఉంటారు. వారి కారణంగా జీవితంలో ముఖ్యమైన కాలాన్ని నాశనం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. బలవంతులు అంటే డబ్బు మదం కలిగినవారు. చెడు అలవాట్లున్న ఆడవారిని నమ్మడం కూడా ఇబ్బందులలో అడుగేసినట్టేనట. తమ సంతోషం కోసం, సుఖాల కోసం, అవసరాల కోసం భర్తను, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలేసే మహిళలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనిషిలో ఎలాంటి ఆలోచనలున్నాయో, వారు ఎప్పుడేం చేస్తారో తెలియనప్పుడు వారితో ఉండటం అస్సలు మంచిది కాదు. ఇలాంటి ఆడవాళ్లు బాగా నాటకీయంగా ఉంటారు. హింస ప్రవృత్తి కలిగిన వారికి దూరంగా ఉంటే చాలా మంచిది. హింసను చూసి ఆనందపడేవారు చివరికి మిమ్మల్ని కూడా హింసిస్తూ పైశాచికానందం పొందే అవకాశం లేకపోలేదు. ఇతరుల మీద అసూయను, ఇతరుల ఎదుగుదలను చూసి ఎప్పుడూ కుళ్లుకునేవారితో స్నేహం కూడా మంచిది కాదు. అలాంటి వారు ఇతరులు ఎదిగితే చూడలేరు. స్నేహమనే పేరున్నా సరే.. మీరు ఎదిగినా కూడా ఓర్చుకోలేరు.                                          *నిశ్శబ్ద.
కొందరు సమస్యలకు అంతగా టెన్షన్ పడరు. తేలికగా తీసుకుని పరిష్కరించుకుంటారు. కొందరైతే భయాందోళనకు గురవుతారు. ప్రతివ్యక్తి జీవితంలో ఏదొక సమయంలో కష్టాలను ఎదుర్కొవల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో ప్రతి వ్యక్తి కూడా తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధమవుతాడు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా భావిస్తుంటారు. అలాంటివారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి: ఏవ్యక్తినైనా సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు..అతను పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఎందుకంటే మీరు సంక్షోభం నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్న వ్యూహాన్ని కలిగి ఉన్నట్లయితే..ఆ సమస్య నుంచి తేలికగా బయటపడతారు. ముందుగానే సిద్ధంగా ఉండాలి: ఆచార్య చాణక్యుడు తెలిపిన ప్రకారం..ఒక వ్యక్తికి కష్టాలు వచ్చినప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు చుట్టిముట్టినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తుందని ముందే ఊహించాలి. అందుకు తగ్గట్లుగానే సిద్ధపడాలి. సమస్య నుంచి పారిపోవడం కంటేనూ దానిని ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఓపిక పట్టాలి: చాణక్య విధానం ప్రకారం...ఒక వ్యక్తి తన ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ సహనంకోల్పోకూడదు. ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. మరీ ముఖ్యంగా పరిస్థితి ఏమైనప్పటికీ ఆ సమయంలో సహనం కోల్పోకూడదు. మీకు మంచి రోజులు వచ్చేంత వరకు ప్రశాంతంగా వేచి ఉండాలి. కుటుంబ సభ్యులతో బాధ్యతగా: చాణక్య నీతి ప్రకారం, సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కూడా వ్యక్తి మొదటి కర్తవ్యం. కుటుంబ సభ్యులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకోవాలి. డబ్బు ఆదా చేయాలి: ఎప్పుడూ డబ్బు ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.  
మానవ జీవితానికి సంబంధించి చాణక్యుడు,  మనకు అనేక విషయాలను బోధించాడు ఇవన్నీ కూడా కౌటిల్యుని శాస్త్రంలో పొందుపరిచారు.  మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు చాణక్యనీతి మార్గం చూపిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త, అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన విధానాలు ప్రజల మనోధైర్యాన్ని పెంచేలా పనిచేస్తాయి. చంద్రగుప్త మౌర్యుని గురువుగా ఉన్న చాణక్యుడు కూడా ప్రేమ గురించి చాలా విషయాలు చెప్పారు. అందుకు సంబంధించిన నాలుగు విషయాలు తెలుసుకుందాం. భాగస్వామి పట్ల గౌరవం: తన ప్రేయసిని లేదా భార్యను గౌరవంగా చూసే వ్యక్తి తన సంబంధాన్ని ఎప్పటికీ విడగొట్టుకోలేడని చాణక్యుడు తన విధానంలో చెప్పాడు. అలాంటి వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. ప్రేమలో నిజాయితీ: తన ప్రేమను పూర్తి నిజాయితీతో నెరవేర్చుకునే వ్యక్తి అంటే మరొక స్త్రీ వైపు చూడని వ్యక్తి, అతని సంబంధం ఎప్పుడూ విచ్ఛిన్నం కాదు. దీనికి విరుద్ధంగా, ఒక వ్యక్తి తన భాగస్వామి కాకుండా మరే ఇతర స్త్రీ గురించి తన మనస్సులో తప్పుగా భావించినా అతని ప్రేమ విజయవంతం కాదు. ఆనందం: చాణక్య నీతి ప్రకారం, తన జీవిత భాగస్వామికి  మానసిక ఆనందాన్ని అందించే వ్యక్తియే శారీరక సంతృప్తిని కూడా అందిస్తాడు. అలాంటి వారికి వైవాహిక జీవితంలో ఎప్పుడూ అడ్డంకులు లేవు. భాగస్వామికి భద్రత:  తన భార్యను సురక్షితంగా ఉంచే వ్యక్తితో అతడి ప్రేమ జీవితం కూడా చక్కగా సాగుతుంది. ఒక స్త్రీ తన భర్తలో తన తండ్రి రూపాన్ని చూసుకుంటుంది.  అలాగే స్త్రీ  తన భాగస్వామి  ఒక తండ్రి లాగా రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది.  అంతే కాదు తాను ఎక్కడికి వెళ్లినా తనకు ఎలాంటి పరిస్థితి వచ్చిన తన భర్త తోడు ఉండాలని ఆమె ఆశిస్తుంది.
వాతావరణం ఒక సీజన్ నుంచి మరో సీజన్ కు మారుతున్న సమయంలో మన శరీరం ఒక రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. క్రమంగా వాతావరణానికి అలవాటు పడుతుంది. అయితే ఈ సమయంలోనే కొన్ని రకాల సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో చాలా మంది జలుబు, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా వంటి వ్యాధుల బారిన పడుతుంటారు. పెద్దవాళ్లు ఈ సమస్యల నుంచి సులభంగా కొలుకున్నప్పటికీ పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈమధ్య చైనాలో పెద్ద సంఖ్యలో పిల్లలు న్యుమోనియాతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇది సాధారణ సీజనల్ ఇన్ఫెక్షన్ అని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడైనా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున పిల్లల్లో న్యుమోనియా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. చలికి వాయు కాలుష్యం కూడా తోడవ్వడంతో పిల్లలు ఊపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే పిల్లల్లో న్యుమోనియా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం అందించాలి. దగ్గు, వేగంగా శ్వాసతీసుకోవడం, జ్వరం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. అలాగే న్యుమోనియాతో పోరాడే శక్తిని పొందేందుకు ఊపిరిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే... జలుబు: సాధారణ జలుబు లక్షణాలే న్యుమోనియా లక్షణాలుగా ఉంటాయి. జలుబు క్రమంగా న్యుమోనియాకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. అందుకే జలుబు చేసినప్పుడు, మరింత తీవ్రమైన న్యుమోనియాగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే చికిత్స తీసుకుని మందులు వాడాలి. పరిశుభ్రత: న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్ లు , శిలీంధ్రాలు వంటి అనేక రకాల సూక్ష్మజీవులతో వస్తుంది. సాధారణంగా న్యుమోనియా అంటువ్యాధి కాదు..కానీ వేగంగా వ్యాప్తిచెందుతే అంటువ్యాధిగానే గుర్తించాలి. అందుకే బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి. ఇంట్లోకి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వ్యాధి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు ముక్కు, నోరును ఎక్కువగా తాకకూడదు. దగ్గు: దగ్గు న్యుమోనియా సాధారణ లక్షణంగా చెబుతారు. బాధితులు దగ్గినప్పుడు రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాధి కారకాలు వ్యాపించే మార్గం ఇది. అందుకే దగ్గు వచ్చినప్పుడు నోటికి గుడ్డ అడ్డుగా పెట్టుకోవాలి. దీంతో ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. వ్యాక్సిన్: న్యుమోనియాకు కారణమయ్యే సాధారణ బ్యాక్టీరియా, వైరస్ లను నిరోధించేందుకు వ్యాక్సిన్ తీసుకుంటే సమస్య ప్రభావం ఎక్కువగా ఉండదు. ఆసుపత్రిలో చేరేంత తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని వ్యాక్సిన్ తగ్గించేస్తుంది. ఇమ్యునిటీ లేనివారు న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. లైఫ్ స్టైల్: సీజనల్ ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి శరీరానికి ఉండాలంటే ఇమ్యునిటీ బలంగా ఉండాలి. దీనికి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాయాయం చేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లను మానేయాలి.   
ప్రతి ఆడపిల్లకూ నెలసరి తప్పనిసరి. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పోషకాహారలోపం వంటి కారణాలతో అధిక రక్తస్రావం, కడుపునొప్పి, తీవ్ర భావోద్వేగాలు వంటికి కనిపిస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దామా. ఆకు కూరలు: ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని ఈ సమయంలో తింటే నొప్పులు తగ్గుతాయి. రక్తహీనత సమస్య అదుపులో ఉంటుంది. ఇందులోని మెగ్నీషియం మెదడుకి ఉపశమనం కలిగిస్తుంది. అరటిపండ్లు: ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులోని పొటాషియం ఒంట్లోని నీటిని నిల్వల్ను కోల్పోకుండా చేయడంతో డీహైడ్రేషన్ సమస్య ఎదురుకాదు. అంతేకాదు అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ సెరటోనిన్ విడుదల చేస్తుంది. ఇది మెదడుకు ఉపశమనం అందిస్తుంది. డార్క్ చాక్లెట్ : నెలసరి సమయంలో ఒంట్లోని ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగ్గడంతో ఈస్ట్రోజన్ పెరుగుతుంది. దీంతో ఒంట్లో చక్కెర స్థాయిలు తగ్గి నీరసం పెరుగుతుంది. దీంతో తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఇలాంటి సమయంలో డార్క్ చాక్లెట్ తినండి. పెరుగు: చాలామంది నెలసరి సమయంలో పెరుగు తినకూడదని చెబుతుంటారు. కానీ ఇది ఆ సమయంలో మంచి ఆహారమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే కాల్షియం, పొత్తికడుపు నొప్పిని తగ్గించి, మూడ్ స్వింగ్స్ కి దూరంగా ఉంచుతుంది.
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. గుండె పనితీరు సజావుగా సాగితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఎదురయ్యే కొన్ని సంకేతాలు గుండెకు సంబంధించి ఏదో సమస్య ఉందని ముందే చెబుతాయి. ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. నేపథ్యంలో ముందే గుండె పోటును ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. గుండెపోటు ఎందుకు వస్తుందో మనం గమనిస్తే, గుండె కండరాలకు ఆక్సిజన్ అందని సమయంలో గుండె పోటు వస్తుంది. ప్రధానంగా మనం తినే కొవ్వు పదార్థాల ప్రభావం వల్ల రక్తనాళాలు కొలెస్ట్రాల్ రూపంలో మూసుకుపోతాయి. దీని వల్ల గుండెకు రక్తం, ఆక్సిజన్ అందడం లేదు. ఇలా అరగంటలోనే గుండె పనిచేయడం ఆగిపోతుంది. లక్షణాలు ఇవే… శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది: రాత్రిపూట ఊపిరి ఆడకపోవడం కూడా గుండె సమస్యలను సూచిస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడమే దీనికి మూలకారణమని చెబుతున్నారు. దీంతో గుండెకు కూడా సమస్యలు వస్తాయి. రాత్రి చెమటలు: కొందరికి రాత్రి నిద్రిస్తున్నప్పుడు అకస్మాత్తుగా చెమటలు పట్టడం మొదలవుతుంది. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. ఇలా పదే పదే జరిగితే, అది క్రమంగా గుండె పోటుగా గమనించవచ్చు. విపరీతమైన దగ్గు: దగ్గు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా దగ్గు రావడం కూడా గుండె సమస్యలను సూచిస్తుంది. ఎందుకంటే శ్వాస నాళంలో నీరు నిండి దగ్గు చికాకు కలిగించే అవకాశం ఉంది. విపరీతమైన గురక: కొంతమంది రాత్రి నిద్రలో ఎక్కువగా గురక పెడుతుంటారు. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.అంతే కాదు గురకకు ప్రధాన కారణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. గుండె లోపల ఏదైనా సమస్య వచ్చినా, గాయమైనా ఇలా గురక పెడతారని నిపుణులు అంటున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. - గుండెపోటుకు సంబంధించినంతవరకు, దానిని నివారించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులను అనుసరించడం అవసరం. - ధూమపానం, మద్యపానం మానేయాలి -  ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.   - మీ వైద్యునిచే మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. ఎలా నియంత్రించాలి? -శరీరానికి రోజువారీ వ్యాయామం అందించడం - డాక్టర్ సలహా మేరకు రక్తనాళాలు అడ్డుపడే అవకాశం ఉండకుండా ఉండేందుకు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మాత్రలు తీసుకోవడం. - మెనోపాజ్‌కు చేరుకునే స్త్రీలు ఈస్ట్రోజెన్ రీప్లేస్‌మెంట్ థెరపీ గురించి వారి వైద్యుని నుండి సమాచారాన్ని పొందాలి.