జగన్ పార్టీ దురాగతం.. పులివర్తి నానిపై దాడి

చంద్రగిరి వైసిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెంచి పోషిస్తున్న రౌడీలు చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై బీర్ బాటిళ్ళు, సమ్మెటలు, రాళ్లతో దాడి చేశారు.  సమ్మెట దెబ్బతో గాయపడ్డ పులివర్తి నాని చికిత్స నిమిత్తం స్విమ్స్ లో అడ్మిట్  అయ్యారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో వున్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్ళి తిరిగి వస్తున్న పులివర్తి నాని మీద చెవిరెడ్డి రౌడీలు దాడి చేశారు. ఈ దాడిలో పులివర్తి నానికి, ఆయన భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. దాంతో తెలుగుదేశం నాయకులు యూనివర్సిటీ ప్రధాన రహదారి మీద బైఠాయించి నిరసన తెలిపారు. పులివర్తి నాని మీద 150 మందికి పైగా రౌడీలు రాడ్లు, కత్తులు, ఇతర మారణాయుధాలతో వచ్చి దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పులివర్తి నాని మీద దాడి సమాచారం తెలుసుకున్న అనంతరం భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు యూనివర్సిటీకి వచ్చారు. అక్కడ ఒక కారులో వున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డికి సంబంధించిన కారులో వున్న వైసీపీ  జెండాలు, మద్యం బాటిళ్ళను ధ్వంసం చేశారు. కారులో వున్న మారణాయుధాలను పోలీసులకు చూపించారు. పద్మావతి యూనివర్సిటీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Publish Date: May 14, 2024 6:18PM

జగన్ కొంప ముంచిన కొమ్మినేని!

రాష్ట్రవ్యాప్తంగా వున్న వైసీపీ అభిమాన వర్గాలు ‘‘ఓరి నాయనో.. ఈ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మా జగనన్న కొంప ముంచాడు నాయనో’’ అని లబోదిబో అంటున్నారు. జగన్ మీడియాలో కీలక స్థానంలో, జగన్ ప్రభుత్వంలో ఒక సలహాదారుడు పదవి కూడా వెలగబెడుతున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు చాలామందికి తెలిసిన వ్యక్తే. ఈయన జగన్ గురించి సాక్షి మీడియాలో ఇచ్చే బిల్డప్పులు వింటే చెవుల వెంట రక్తం కూడా కారే అవకాశాలు వుంటాయి. జగన్ విషయంలో పదిపైసలంత మేటర్ వుంటే, అది కొమ్మినేని నోట్లోంచి పది వేల రూపాయలంత రేంజ్‌లో బయటకి వస్తుంది. కొమ్మినేని పేరుకే జర్నలిస్టుగానీ, ‘జగన్ భజంత్రీల సంఘం’ వ్యవస్థాపక అధ్యక్షుడు అని గిట్టనివారు అంటూ వుంటారు.  సరే, ఈయన మంగళవారం నాడు సాక్షి టీవీ కెమెరా ముందుకు వచ్చారు. సాధారణంగా అయితే జగన్ నినాదం అయిన ‘వైనాట్ 175’ అనే నినాదానికి అనుకూలంగా వైసీపీ అదరహో, కూటమి బెదరహో, అధికారం జగన్‌దేనహో అని నానా హడావిడి చేయాలి. కానీ ఆయన ఎలాంటి హడావిడి లేకుండా, చూద్దామన్నా నెత్తుటి చుక్క కూడా కనిపించని ముఖంతో ‘ఈసారి కూడా జగన్ విజయం సాధిస్తారు.. అని సర్వేలు కూడా చెబుతున్నాయి. నేను కూడా కొందరు సర్వేవాళ్ళతో మాట్లాడాను. వాళ్ళలో చాలామంది జగనే గెలుస్తారని చెప్పారు’ అని చాలా చప్పచప్పగా ఎక్స్.ప్రెషన్ ఇస్తూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే పెద్ద అబద్ధం ఆడలేను అన్నట్టుగా తేల్చేశారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లకి అన్నీ అబద్ధాలు చెప్పారట, అలాగే పోలింగ్ సందర్భంగా భారీగా హింసకు దిగారట... అని కొమ్మినేని శ్రీనివాసరావు దిగాలుగా ముఖం పెట్టి చెబుతుంటే, పాయే.. వైసీపీ పని అయిపాయే అని ఎవరికైనా అనిపించడం ఖాయం.. పోనీ, కొమ్మినేని గారు అక్కడితో ఆగలేదు.. జగన్ బ్రెయిన్ ఛైల్డ్ అయిన ‘వైనాట్ 175’ సిద్ధాంతానికే గండి కొట్టేశారు. రాయలసీమలో గత ఎన్నికలలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి 35 నుంచి 40 సీట్లు వస్తాయి అని డిక్లేర్ చేశారు.. అద్గదిగో.. ఇక్కడ వైసీపీ వర్గాల గుండెల్లో పెద్ద బండరాయి పడింది.. ఎవరైనా గతంలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి ఇంకా నాలుగైదు సీట్లు పెరుగుతాయి అని చెబుతారుగానీ, ఈయనేంటయ్యా బాబు.. దాదాపు పద్నాలుగు సీట్లు నిర్దాక్షిణ్యంగా కోసేశారు అని లబోదిబో అంటున్నారు. మన మీడియాలోనే మనం ఈరకంగా కోసేసుకుంటే, రియల్‌గా ఓటర్లు ఇంకెంత కోసేశారో అని కెవ్వుమంటున్నారు. కొమ్మినేని వైసీపీ వర్గాల మీద బాంబులు వేస్తూ మరికొంత విశ్లేషణ చేశారు. ఉత్తరాంధ్రలో వున్న 34 సీట్లలో 20 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు. అదేంటన్నా.. మన జగనన్న వైజాగ్ రాజధాని అని పోరాటం చేస్తుంటే, ఉత్తరాంధ్రలో సీట్లన్నీ మనకి వస్తున్నాయని చెప్పాలిగానీ, 14 సీట్లు కట్ చేశారేంటన్నా.. ఇదెక్కడి న్యాయం కొమ్మినేని సారూ అని వైసీపీ వర్గాలు మొత్తుకుంటున్నాయి.  జగన్ మొదటి నుంచి వైనాట్ 175 అంటే, కొమ్మినేని వారు మాత్రం 100 నుంచి 110 సీట్లు వస్తాయని ఫైనల్ చేశారు. ఈయన తీర్పు విని వైసీపీ వర్గాలు గొల్లుమంటున్నాయి. 175 వస్తాయి అని బిల్డప్పు ఇవ్వాలిగానీ, ఈరకంగా 110 బోర్డర్ పెట్టేశావేంటి దేవుడా అని బావురుమంటున్నాయి. సాక్షి మీడియా కాంపౌండ్లోనే పరిస్థితి ఇంత నీరసంగా వుందంటే, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Publish Date: May 14, 2024 6:01PM

ఆ పాల‌న మాకొద్ద‌న్న ఏపీ ఓట‌ర్‌! అధికారం టీడీపీ కూట‌మిదే!

ఏపీలో జ‌రిగిన‌ పోలింగ్ పై రాజ‌కీయ పార్టీల్లో ఉత్కంఠ‌త పెరిగిపోతోంది.  2019లో  79.64 శాతం పోలింగ్ నమోదైంది. 2014వ సంవత్సరంతో పోల్చితే, 2019లో ఓటింగ్ 1.23 శాతం పెరిగింది. ఫ‌లితం ప్ర‌తిప‌క్ష పార్టీకి 151 సీట్లు వ‌చ్చాయి. అధికార పార్టీ 23 సీట్ల‌తో స‌ర్దు కోవాల్సి వ‌చ్చింది. ఇక 2019తో 2024 పోలింగ్ ను పోల్చితే 2 శాతం తేడా క‌నిపిస్తోంది. 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో 78.41, రెండోసారి 2019లో 79.64 శాతం న‌మోదయితే ఈసారి 2024 లో పోలింగ్  81 శాతాన్ని దాటిపోయేలా వుంది. దీన్ని బ‌ట్టి ఫ‌లితం ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. తెలుగుదేశం కూటమికి 155 నుండి 160 సీట్లు, వైఎస్సార్సీకి 15 నుండి 21 అసెంబ్లీ సీట్లు, 2 లేదా 3 పార్లమెంటు సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపికి కనీసం ప్రతిపక్షహోదా కూడా రాకుండా ఓట్లతో అమోఘమైన ప్రజాస్వామిక తీర్పు ఇచ్చారనే టాక్ అయితే న‌డుస్తోంది. పోలింగ్ జ‌రిగిన తీరు చూస్తే.... ఉప్పెనలా పోలింగ్ బూతులకు జనాలు తరలి వచ్చారు. ముఖ్యంగా  మహిళ ఓటర్లు, వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే అధికారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఓటర్లు ఎక్కువ. 154 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరే గెలుపోటములను నిర్ణయిస్తారు. ఇక్క‌డ ఓ విష‌యం మాట్లాడుకోవాలి. 2019 ఎన్నిక‌ల్లో మహిళలు పెద్దయెత్తున తరలి రావడంతో తమకు అనువుగా మారుతుందని అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది. అందుకు కార‌ణం ఏమిటంటే, పసుపు కుంకుమ పేరిట పది వేల రూపాయలు నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేయడంతో ఆ ఓట్లన్నీ తమకేనని అప్పట్లో టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఫ‌లితం మ‌నం చూశాం. టీడీపీ 23 స్థానాల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. సీన్ క‌ట్ చేస్తే 2024 ఎన్నిక‌ల్లోనూ భారీ స్థాయిలో మ‌హిళా ఓట‌ర్లు ఓటు వేశారు. అంటే... ప్రభుత్వంపై వ్యతిరేకత మహిళల్లో ఉంది.  1. అభివృద్ధి లేకపోవడంతో పాటు  2. మద్యనిషేధం చేయకపోవడం 3. శాంతిభద్రతల సమస్య‌లు 4. కూట‌మి  మ్యానిఫేస్టోలో పెట్టిన అంశాలు  5. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,  6. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం,  7. తల్లికి వందనం పేరిట ఎంత మంది కుటుంబంలో ఉన్నా వారందరికీ ఇస్తామని ప్రకటించడం  8. 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 1,500 ఇస్తామని చెప్పడం టీడీపీ కూట‌మికి క‌ల‌సి వ‌చ్చే అంశాలు. అందుకే మ‌హిళ‌లు భారీ ఎత్తున ఓటు వేశారు. ఏపీలో కుల రాజకీయాలకు ఎన్నికలు పరాకాష్ఠ. వారి కులం వారికే ఓటర్లు తమ ఓటును వేస్తారనేది కాదనలేని వాస్తవం. ఆ కులానికి చెందిన వ్య‌క్తి మంచి చేస్తున్నాడా చేయ‌డం లేదా అనేది ఎవ్వ‌రికీ అవ‌స‌రం లేదు. ఆ నేత తమ కులం వాడు,  అత‌నికే తమ ఓటు అనే ఆలోచనా ధోర‌ణి ఏపీలో చాలా మంది ఓటర్ల‌కు ఉంది. ఉద్యోగులు, కార్మికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కాపు, కమ్మ కులాల ఓటర్లు సాలిడ్ గా టీడీపీ కూటమికి ఓటేసినట్లు ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి ఓటర్లు, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెబుతోంది.   59 నెలలుగా దాదాపు 2 ల‌క్ష‌ల 75 వేల కోట్ల రూపాయలు 65 లక్షల కుటుంబాలకు అనేక పధకాల ద్వారా చేరాయని జగన్ పదే పదే చెప్పడం, ' మీ కుటుంబానికి మంచి జరిగితే మీరు వోట్ వేయండి.. మీరే ఇతరులకు చెప్పండి !' అని  అన్ని చోట్లా జగనే  చెబుతూ ప్ర‌చారం చేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక  ఓటు చీలకూడదు అన్న లక్ష్యంతో చంద్ర‌బాబునాయుడు కూటమి ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ్డారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, రాష్ట్రానికి రాజధాని లేదని,  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజా వ్యతిరేక చట్టం గా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లారు.  వైఎస్ షర్మిల జగన్ చెల్లెలు గా జగన్ ని బాగా ఇరకాటంలో పడేసింది అని చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు ను పట్టుకొని ఆయన కుమార్తె Dr సునీత కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం చేయటం, చివరి రోజు వైఎస్ విజయమ్మ కూడా 'షర్మిల ను గెలిపించండి ' అని మేసేజ్ వదలటం వైఎస్సార్ పార్టీ కి నష్టం కలిగించే అంశాలు.  ETV, TV5, ABN AndhraJyothi TV ఛానళ్ళు కూటమి వైపు, TV9, NTV, Sakshi TV ఛానళ్ళు వైయస్సార్ పార్టీ కి అనుకూలంగా కధనాలు ప్రసారం చేశాయి. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: May 14, 2024 5:38PM

విశాఖ ఓటర్లు.. జగన్‌కి మొట్టికాయలు!

మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన జగన్నాటకం అట్టర్ ఫ్లాపైంది. నా వైజాగో.. నా వైజాగో అని జగన్ లబలబ నెత్తీనోరూ కొట్టుకున్నాడు. ఆరు నూరైనా వైజాగే శాసన రాజధాని అన్నాడు. ఈసారి ప్రమాణ స్వీకారం వైజాగ్‌లోనే చే్స్తాన్నాడు.. డామ్ అన్నాడు.. డుష్ అన్నాడు.. చివరికి తుస్ అన్నాడు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే జగన్ పిల్ల చేష్టలకి, మూడు రాజధానుల కుప్పిగంతులను వైజాగ్ ఓటర్లు మొట్టికాయలతో చక్కదిద్దారు. విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు వున్నాయి. వీటిలో ఎనిమిది స్థానాలు వైజాగ్ పరిసరాల్లోనే వున్నాయి. ఈసారి జరిగిన ఓటింగ్‌ని బట్టి చూస్తే, విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్లో కూటమి గెలవబోతోందని, మిగతా మూడు స్థానాలతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది.  భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, చోడవరం, అనకాపల్లె, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం స్థానాల్లో కూటమి గెలుస్తున్నట్టు సమాచారం. మాడుగుల, అరకు లోయ, పాడేరు స్థానాలు మాత్రం వైసీపీ అకౌంట్లో పడనున్నాయని తెలుస్తోంది. మొత్తమ్మీద విశాఖలోగాని, విశాఖ పరిసరాల్లోగానీ వైసీపీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. జగన్ మూడు రాజధానుల విధానాన్ని వైజాగ్ ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారనేదానికి ఈ ఒక్క ఉదహరణ చాలు. ఈ ఐదేళ్ళలో జగన్ వైజాగ్‌ని విధ్వంసం చేసేశారు. జగన్‌కి సంబంధించిన పులివెందుల బ్యాచ్‌లు వైజాగ్‌ని భయాందోళనలకి గురిచేశాయి. రాజధాని వద్దు.. ఏమీ వద్దు.. ఈ జగన్ పీడ వదిలిపోతే చాలురా నాయనా అని వైజాగ్ ఓటర్లు భావించారని పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమైపోతోంది. టేక్ రెస్ట్ ఇన్ పులివెందుల జగన్.
Publish Date: May 14, 2024 4:35PM