Read more!

వీర్రాజుకు ఉద్వాసన.. అందుకేనా ప్రేలాపనలు ?

ఆంధ్ర ప్రదేశ్’లో రాజకీయాల్లో బీజేపీ పరిస్థితి ఏంటో, ఎన్నికల్లో  ఆపార్టీ స్టేక్’ ఏంటో, ఓటింగ్ షేర్ ఏంటో వేరే చెప్పనక్కర్లేదు. లేటెస్ట్’గా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ లోనూ బీజేపీకి ‘జీరో’ సీట్లే వచ్చాయి. ఓటింగ్  షేర్ కూడా జీరోకు దగ్గరగానే వుంది. అయినా, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడడం వలన చేత, రాష్ట్రంలో ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఇంకా అంతో ఇంతో  రాజకీయ గౌరవం దక్కుతోంది.
అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ కాసింత గౌరవం, గుర్తింపును కూడా ఖర్చు రాసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారని, సోషల్ మీడియాలో కమల దళం అభిమానులే సెటైర్’లు వేస్తున్నారు. రాజకీయాలలో నోరు, రెండు వైపులా పదునున్న కత్తి. మాటలతో మాయ చేసి రాజకీయ పరమపదసోపాన పటంలో, పై మెట్టుకు చేరినవవారున్నారు. అలాగే, నోరు జారి కింది మెట్టుకు చేరిన వారూ ఉన్నారు. ఆనాలోచిత,అసందర్భ ప్రేలపనాలు చేసి ..కథ కంచికి మనం ఇంటికి.. అన్నట్లుగా రాజకీయ జీతానికి స్వయంగా చుక్క పెట్టుకున్న పెద్దలూ ఉన్నారు.
అదలా ఉంచి, విషయంలోకి వస్తే, సోము వీర్రాజు ఇటీవలి కాలంలో పొరపాటునే నోరు జరుతున్నారో, పెద్ద నోరు నానీలను ఆదర్శంగా తీసుకుంటున్నారో ఏమో కానీ, వరస పెట్టి వివాదస్పద వ్యాఖ్యలు  చేస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఇమేజ్’ని పెంచుతున్నాయో, తగ్గిస్తున్నాయో కానీ, పార్టీకి తలవపులు తెస్తున్నాయని, పార్టీ ఇమేజిని దెబ్బతీస్తున్నాయని  పార్టీలోనే ఒక వర్గంలో చర్చ జరుగుతోంది.
కొద్ది కాలం కాలం క్రితం ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ యాభై రూపాయలకే ఇస్తామని చేసిన ప్రకటన రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రకంపనలు సృష్టించింది. చివరకు, తెలంగాణ మంత్రులు, తెరాస నాయకులు కూడా, అక్కడ బీజేపీని  ఆట పట్టించేందుకు వీర్రాజు ప్రకటనను వాడుకున్నారు. వీర్రాజు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానూ బీజేపీకి మచ్చను తెచ్చి పెట్టాయి.

అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, కడప జిల్లా రక్తపాతానికి, హత్యలకు నిలయం అన్న అర్థం వచ్చేలా, కడప జిల్లాలో ఎయిర్‌పోర్టు ఎందుకు వాళ్లకి ప్రాణం తీయడమే వచ్చు అంటూ వీర్రాజు వేసిన సెటైర్, చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున సోము వీర్రాజుపై విరుచుకుపడుతున్నారు. సోము వీర్రాజు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ఏమో కానీ, మళ్ళీ మరోమారు పార్టీ సంజాయిషీ ఇచ్చుకోవలసిన  పరిస్థితి ఏర్పడింది. ఓ వంక రాయల సీమ జిల్లాల్లో పార్టీని బలోపెతంచేసేందుకు,టీడీపీ నుంచి బీజ్పీలో చేరిన సుజనా చౌదరి,సీఎం రమేష్, ఇతర నాయకులు ప్రయత్నిస్తున్న సమయంలో  వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీ డిఫెన్సులో పడిందని అంటున్నారు.

నిజానికి, సోము వీర్రాజుకు పాత ‘కాపు’, మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి అనే నమ్మకంతోనే పార్టీ ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అయితే, గడచిన రెండు సంవత్సరాలలో ఆయన ఫెయిల్ అయ్యారు. పార్టీని ఫైల్ చేశారు. వాట్ నెక్స్ట్ ... ఉద్వాసనేనా ..అంటే .. అవుననే అంటున్నారు. నిజానికి, ఉద్వాసన తప్పదనే సంకేతాలు చేరడం వల్లనే సోమూజీ, ఫ్రస్ట్రేషన్’లో కి జారుకుని  ... నోరు జరుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఎవరు వచ్చినా బీజేపీని లేపడం అయ్యే పనికాదని, రాష్ట్రంలో టీడీపీ, వైసేపీ తప్ప మూడో పార్టీకి సమీప భవిష్యత్’ లో భవిష్యత్ లేదని రాజకీయ పండితులు జోస్యం చెపుతున్నారు.