ఫ్లాష్ న్యూస్... డిప్రెషన్లో జగన్.. సైకో థెరఫీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగంలో ఎన్టీయే కూటమి పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మూడు రోజుల్లో ప్రచార గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో కూటమి పార్టీలన్నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ ప్రచారంలో దుమ్ము దులిపేస్తూ, జగనన్న మీద దుమ్మెత్తి పోస్తున్నారు. 

ప్రతిపక్షాలు ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేస్తుంటే, అధికార పార్టీ నాయకుడు, అంగబలం, అర్థబలం వున్న నాయకుడు జగన్ మాత్రం తాడేపల్లి కోటను దాటికి బయటకి రావడం లేదు. చాలామంది అనుకుంటున్నది ఏమిటంటే, ఓటమి చెందబోతున్నానని అర్థం చేసుకున్న జగన్ ఇక ప్రచారం చేయడం ఎందుకులే అని చేతులెత్తేశాడని, ఎన్నికలు ముగిసిన తర్వాత లండన్ వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని... అయితే తాడేపల్లి కోటకు సంబంధించిన వర్గాలు చెబుతున్నది వేరేలాగా వుంది.

జగన్ ఇప్పుడు పూర్తిస్థాయి డిప్రెషన్లో కూరుకుపోయి వున్నారట. ఓటమి తప్పదని తెలిసిన తర్వాత ఆ డిప్రెషన్ మరింతగా పెరిగిపోయిందట. మొన్న మచిలీపట్నం సభలో గొంతు వణికేలా ప్రసంగించిన జగన్, కేవలం ఫిజికల్‌గా ఏడవలేదంతే, దాదాపు ఏడ్చినంత పనిచేశారు. ఆ మీటింగ్ తర్వాత జగన్ మానసిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందట. తాను ఇన్ని బటన్లు నొక్కినా, జనం ఎన్నికలలో తన ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కడానికి ఇష్టపడటం లేదని అర్థం చేసుకున్న ఆయన భారీ స్థాయిలో హర్టయ్యారట. ఐదేళ్ళ నుంచి తాను వేసిన ప్లాన్ ఇలా అట్లర్ ఫ్లాప్ కావడం, ఓటమి తర్వాత తాను జైలుకు వెళ్ళడం తప్ప మరొక మార్గం లేకపోవడంతో జగన్ భారీ స్థాయిలో డిప్రెషన్లో కూరుకుపోయాడని తెలుస్తోంది.

గత ఎన్నికలలో ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల, ఇంకోవైపు విజయమ్మ, మరోవైపు అంతర్లీనంగా బ్రదర్ అనిల్ కుమార్... ఇలా చాలామంది జగన్‌కి మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు తాను పూర్తిగా ఒంటరి అయిపోవడం, పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా మారడం, జనం మూడ్ పూర్తిగా అవతగం కావడంతో జగన్ డిప్రెషన్ లోయలోకి పడిపోయారని తెలుస్తోంది. ఆయన్ని డిప్రెషన్ నుంచి బయటకి తీసుకురావడానికి ప్రస్తుతం ఆయనకు సైకాలజిస్టుల చేత సైకో థెరఫీ జరుగుతోందని చెబుతున్నారు. డిప్రెషన్ తగ్గడానికి పవర్ ఫుల్ మందులు కూడా వాడుతున్నారని సమాచారం. ఆ ‘సైకో’ థెరపీ, డిప్రెషన్ మందుల సహకారంతో ప్రస్తుతం జగన్ బండి నడుస్తున్నట్టు తెలుస్తోంది.