ఆ నాలుగు నెలల ట్వీట్స్ ఎక్కడ పవన్ కల్యాణ్ ?

ప్రశ్నిస్తాను అంటూ ట్విట్టర్ ను వజ్రాయుధంలా వాడుకుంటూ వాడీవేడీ ట్వీట్లతో ప్రత్యర్థి రాజకీయపక్షాలకు పవన్ కల్యాణ్ వేడి పుట్టించారు. ముఖ్యంగా సాధారణ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ ట్వీట్లతో తెలుగుదేశం, వైసీపీల పై యుద్ధం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఆయన ట్వీట్లు అప్పట్లో సంచలనంగా మారాయి. ఏ అంశంపై ఎప్పుడూ ఎలాంటి ట్వీట్ తో దాడి చేస్తారా అని రాజకీయ పక్షాలూ బెదురుతూ ఎదురుచూసేవి, ఆ ట్వీట్ లకు కౌంటర్ ఇచ్చేందు కు సిద్ధమయ్యేవి.కాకపోతే ఈ సారి ఎక్కువగా అధికారంలో ఉన్న వైసీపీనే ఆయన టార్గెట్ చేశారు. ఇది ఇలా ఉండగా, ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఎకౌంట్ లో చేసిన ట్వీట్లు కనిపించడం లేదు అంటు జనాలు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఈ విషయం సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతూ సడన్ గా ఆయన ట్వీట్లన్నీ ఏమై పోయాయనే చర్చ మొదలైంది.4 నెలల కాలంలో అసలు పవన్ ట్వీట్లే చెయ్యలేదా ఏంటి ?... మరి సడన్గా 4 నెలలపాటు ఆయన ట్విట్ లేవీ కనిపించకపోవటంతో..... అసలు ఏం జరిగిందా అని వైసీపీతో పాటు ఆయనను ఫాలో అవుతున్నవారు ఆలోచనలో పడ్డారు. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు.

ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ కొంతవరకు టిడిపికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ బాగా నడుస్తోంది. అలాగే ఆయన బీజేపీతో కూడా సన్నిహితంగా మెలుగుతున్నారని గుస గుసలు విన్పిస్తున్నాయి. వచ్చే నెలలో తెలుగుదేశం పార్టీతో కలిసి వైసీపీ సర్కారుపై పోరాడాలని నిర్ణయించుకున్నారని.... ఏపీ మొత్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఆయన గత 4 నెలల ట్వీట్లను డిలీట్ చేశారేమో అని కూడా జనాలు అనుకుంటున్నారు.తెలుగుదేశంతో జత కలిసేటప్పుడు... ఇబ్బంది లేకుండా ఉండాలంటే గతంలో చేసిన ట్వీట్లను తొలగించేస్తే బెటర్ అనుకోని, పవన్ కళ్యాణ్ ఇలా చేసి ఉంటారు అని అంటున్నారు. భవిష్యత్ లో టిడిపి నుంచి... ఎందుకు గతంలో అలా ట్వీట్ చేశావని పవన్ ని ప్రశ్నిస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందనే కారణంగానే డిలీట్ చేసేశారని అనుకుంటున్నారు. మరో పక్క ఆ సమయంలో ఎన్నికల హడావుడిలో ఉన్నందున అసలు ట్వీట్లు ఏమీ చెయ్యలేదని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి.ట్వీట్లను తొలగించాల్సిన అవసరం లేదని... పవర్ స్టార్ కు అలాంటి భయాలు ఏమి లేవని చెబుతున్నాయి. ఏదైనా నిర్భయంగా మాట్లాడ్డమే తమ అధినేత నైజమని చెప్పుకొంటున్నాయి. ఆ కాలంలో పార్టీ ఐడీ నుంచి తప్ప పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అకౌంట్ నుంచి ట్వీట్ లేవీ చెయ్యలేదని వాదిస్తున్నాయి. కానీ ఆంధ్రలోని జనాలు మాత్రం దీని వెనుక ఏదో మతలబు ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. ఏకంగా 4 నెలల పాటు ఒక్క ట్విట్ కూడ చేయకుండా పవన్ ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఈ విషయంపై పవన్ మరియు కార్యకర్తలకు మాత్రమే తెలియాలని ముక్తాయిస్తున్నారు.