నేషనల్ మీడియా ముందు చేతులెత్తేసిన జగన్!

ఏపీలో జగన్ ఖేల్ ఖతమ్ అయిపోయింది. ఇక తట్టా బుట్టా సర్దుకుని జైలుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవడమే. ఈ విషయం ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సాక్షాత్తూ జగన్ ముఖం చూస్తే చాలు. ఆయన ముఖంలో ఓటమి కళ అరచేతి మందంలో కనిపిస్తోంది. జగన్ మాటల్లో ఈ వాస్తవం డీటీఎస్‌లో వినిపిస్తోంది. ఈ విషయంలో ఇంకా ఎవరికైనా డౌట్స్ వుంటే, శుక్రవారం నాడు నేషనల్ మీడియా టైమ్స్ నౌలో సీనియర్ లేడీ జర్నలిస్టు నవికా కుమార్‌కి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూడవచ్చు. ఈ ఇంటర్వ్యూలో జగన్ ఆద్యంతం ఏడుపు ముఖంలో, ఓటమి కన్ఫమ్ అయిపోయిన ఎక్స్.ప్రెషన్‌తో కనిపించారు. 

ఇంటర్వ్యూలో జర్నలిస్టు నివకా కుమార్ ఒక్కో ప్రశ్న సంధిస్తుంటే జగన్ తెల్లముఖం వేసుకుని, సమాధానాలు చెప్పడానికి నానా తంటాలూ పడ్డారు. ఒక సందర్భంలో జగన్ ఆమె ప్రశ్నకు సమాధానంగా- ‘‘మీరు నా స్థానంలో వుంటే అర్థమవుతుంది’’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దానికి నవికా కుమార్ చురుగ్గా స్పందిస్తూ, ‘‘దేవుడి దయవల్ల నేను మీ స్థానంలో లేను’’ అన్నారు. దాంతో షాకైపోవడం జగన్ వంతు అయింది.

జగన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనను జైల్లో వేయడం దగ్గర నుంచి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి తనకు వ్యతిరేకంగా పని చేస్తూ వుండటం వరకు... తాను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ చంద్రబాబే కారణం అని చెబుతుంటే నవికా కుమార్ జగన్‌ని ఇదేంట్రా బాబూ అన్నట్టు చూస్తూ, మీరు ప్రతీదానికీ చంద్రబాబే కారణం అంటున్నారు అని వెటకారంగా అన్నారు. దానికి మన జగన్ సార్ ఒక వెర్రి నవ్వుతో ప్రతిస్పందించారు.

రాహుల్ గాంధీ గురించి జగన్‌ని నవికా కుమార్ ప్రశ్నించినప్పుడు జగన్ దిక్కులు చూస్తూ, వెర్రినవ్వులు నవ్వుతూ వుండటంతో ఆమె ‘‘నవ్వడం కాదు.. సమాధానం చెప్పండి’’ అన్నారు. జగన్ ఓ సందర్భంలో నేషనల్ పాలిటిక్స్ గురించి తనకు అంతగా అవగాహన లేదు అన్నారు. అప్పుడు నవికా కుమార్ జగన్‌ని శుద్ధ మొద్దుని చూసినట్టు చూసి, ‘‘ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వున్న మీరు నేషనల్ పాలిటిక్స్ గురించి పట్టనట్టు వుండటం కరెక్టుగా లేదు’’ అంటూ కామెంట్ చేశారు. అయినా మనసార్ ఒక వయ్యారపు నవ్వు విసిరారు.

ఇంటర్వ్యూ ప్రారంభంలోనే ఈ ఎన్నికలలో మీకు ఎన్ని సీట్లు వస్తాయి అని నవికా కుమార్ అడిగితే, జగన్ జీవం లేని నవ్వు నవ్వుతూ ‘స్వీప్ చేస్తాం’ అన్నారు. నవీ కుమార్ మరోసారి రెట్టించి అడిగితే, ‘స్వీప్ చేస్తాం’ అని మరోసారి అన్నారు. ఆ ‘స్వీప్’ గెలుపు స్వీప్‌లా అనిపించలేదు.. చీపురు పట్టుకుని చేసే స్వీప్‌లా అనిపించింది.

జగన్ మాటమాటకీ, షర్మిల నా కుటుంబం పరువు తీస్తోంది అని అన్నప్పుడు, అది మీ కుటుంబం మాత్రమే కాదు.. షర్మిల కుటుంబం కూడా అని నవికా కుమార్ చురక వేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఆయన వారసత్వం కావచ్చు.. అది మీకు మాత్రమే కాదు.. షర్మిలకు కూడా సమానంగా దక్కుతాయి అని నవికా కుమార్ అన్నప్పుడు జగన్ ముఖం చూడాలి. అబ్బో... ఆ ఎక్స్.ప్రెషన్ ఇవ్వడం ఆయనకి తప్ప మరొకరికి రాదు.

మీరు ఐదేళ్ళుగా అధికారంలో వుండి మీ బాబాయి హత్య కేసులో ఎలాంటి పురోగతి ఎందుకు సాధించలేదు అంటే, ఏదేదో సంబంధం లేని సమాధానం చెప్పి దాటవేశారు. మొత్తమ్మీద నవికా కుమార్ అడిగిన ప్రశ్నలకు జగన్ చెప్పిన సమాధానాలు తక్కువ.. సాగదీసింది ఎక్కువ. వెంట వెంటనే సమాధానాలు చెబితే, ఇంకో ప్రశ్న దూసుకొస్తుందన్న భయంతో జగన్ లాగీ లాగీ సమాధానం చెప్పారు. అలా టైమ్ కిల్ చేయగలిగారు.

పాపం జగన్‌కి ఇంకో దరిద్రం ఏమిటంటే, ఇంటర్వ్యూ నడిచినంతసేపూ బ్యాక్ గ్రౌండ్లో చంద్రబాబు విజయోత్సాహంతో ప్రచారం చేస్తున్న క్లిప్పింగ్స్, మోడీ ప్రచారం చేస్తున్న దృశ్యాలు, షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న దృశ్యాలు, షర్మిల ప్రచారం చేస్తున్న చూపించారు. జగన్ ప్రచారం చేస్తున్న విజువల్స్ కొద్ది క్షణాలు మాత్రమే చూపించారు. 

మొత్తమ్మీద నీర్సంగా, అన్యమనస్కంగా, జిడ్డుకారుతున్న ముఖంతో, జీవం లేని నవ్వుతో, బిత్తర చూపులతో, క్లారిటీ లేని సమాధానాలతో సాగిన ఈ ఇంటర్వ్యూ ఇక జగన్ ఓటమి పక్కా అని కన్ఫమ్ చేసింది.