no need of ycp in ap

ఏపీకి వైసీపీ అవసరం లేదని చాటుతున్న షర్మిల!

ఆంధ్రప్రదేశ్ లో ఇక వైసీపీ అవసరం ఏ మాత్రం లేదంటున్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. వైసీపీ అధినేత, సొంత అన్న అయిన జగన్ కు నోరెత్తే అవకాశం, అవసరం లేకుండా చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలసిందే. వైసీపీ అధికారం కోల్పోయి ఐదు నెలలైంది. అధికారంలో ఉన్నంత కాలం సందర్భం ఉన్నా లేకపోయినా ఇష్టారీతిగా ప్రతిపక్ష నేతలపై బూతులతో విరుచుకుపడడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు ఇప్పడు నోరెత్తడానికి భయపడుతున్నారు. అసలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన దాదాపు అందరూ కూడా ఇప్పుడు పబ్లిక్ లో ముఖం చూపడానికి వెరుస్తున్నారు. ఎన్నికలలో వైసీపీ ఎటూ ప్రతిపక్ష హోదా కోల్పో యింది. కానీ ఒక రాజకీయ పార్టీగా కూడా ఆ పార్టీని జనం గుర్తించడం లేదు. దీంతో ఏపీలో విపక్షం అన్నదే లేకుండా పోయింది. అయితే ఆ లోటును నేను తీరుస్తానంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ఇక ఉనికి మాత్రంగా కూడా ఉండే అవకాశం లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేని కాంగ్రెస్ పార్టీకి ఆ లోటు తెలయకుండా రాష్ట్రమంతా కలియదిరుగుతూ ఏక కాలంలో ఇటు ప్రభుత్వంపై, అటు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉండగా  యథేచ్ఛగా అక్రమాలు, అవినీతి, దాడులతో విరుచుకుపడిన ఆ పార్టీ నేతలందరూ ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగువెలిగిన సజ్జల సహా ఆ పార్టీలో నోరు, పేరు ఉన్న నేతలంతా ఇప్పుడు అరెస్టు భయంతో వణికి పోతున్నారు. పారిపోవడమో, కోర్టుల నుంచి అరెస్టు కాకుండా తెచ్చుకున్న రక్షణతోనే బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. అందుకే ఆ పార్టీ అధినేత జగన్ సహా నాయకులెవరూ రాజకీయంగా క్రియాశీలంగా ఉండేందుకు సుముఖంగా లేరు. జగన్ అయితే బెంగళూరు నుంచి రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు.  ఉచిత ఇసుక విధానం సహా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఆరోపణలు వస్తున్నా.. ఎవరూ వాటిని హైలైట్ చేసి ప్రజలలోకి వచ్చేందుకు రెడీగా లేదు. అయితే ఇక్కడే షర్మిల అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రశ్నలు సంధిస్తూనే.. జగన్ హయాంలోని అరాచకాలను, అక్రమాలను ఎత్తి చూపుతున్నారు.  పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి గట్టిగా కసరత్తు చేస్తున్నారు.   ఇటీవల బెజవాడను వరదలు ముంచెత్తినప్పుడు వరద బాధితులకు అండగా నిలవడంలో వైసీపీ అధినేత కంటే ముందున్నారు. జగన్ కంటే ముందు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ప్రభుత్వ సాయం సత్వరమే అందాలన్న డిమాండ్ చేయడమే కాకుండా, మేన్ మేడ్ ఫ్లడ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పి కొట్టారు. మెల్లిమెల్లిగా రాష్ట్రంలో వైసీపీ ప్లేస్ ను ఆక్రమించడమే లక్ష్యంగా షర్మిల అడుగులు వేస్తున్నారు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఇప్పటి వరకూ యాక్టివ్ గా కనిపించిన షర్మిల ఇప్పుడు బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో పార్టీలోకి చేరికలపై దృష్టి పెట్టారు. వైఎస్ తో సాన్నిహిత్యం ఉన్న నేతలతో టచ్ లోకి వెడుతూ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు.  ఆమె ప్రయత్నాలు ఫలిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలో మూడు భారీ బహిరంగ సభలకు షర్మిల ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ బహిరంగ సభలకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించి, వారి సమక్షంలో వైఎస్ మరణం తరువాత వివిధ కారణా లతో వేరే వేరే పార్టీలలోకి వెళ్లిన సీనియర్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పాలన్న వ్యూహంతో షర్మిల ముందుకు సాగుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఇంత వరకూ ఎన్నడూ కాంగ్రెస్ లో ఈ స్థాయి సందడి కనిపించలేదని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడిప్పుడే ఉత్సాహం కనిపిస్తోందని అంటున్నారు. ఇక రాష్ట్రంలో మూడు భారీ బహిరంగ సభలతో కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడుతుందన్న సందేశాన్ని ఇవ్వడం ద్వారా జగన్ పార్టీ వైపు జనం చూడాల్సిన అవసరం లేకుండా చేయడమే షర్మిల వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

sajjala routu to jail

సజ్జల దారి జైలుకేనా?

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ముంబై విమానాశ్రయంలో సోమవారం ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విదేశాలకు పారిపోకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని భావించాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఆయననున అక్కడే అరెస్టు చేయాల్సి ఉంటుంది. అయితే ఆయన   కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు రక్షణ ఉన్నందున ఆరెస్టు చేయవద్దంటూ గుంటూరు జిల్లా ఎస్పీ సమాచారం పంపడంతో  సజ్జలను అరెస్టు చేయలేదంటున్నారు. ఇంతకీ సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఏ కేసులు జారీ చేశారన్నదానిపై క్లారిటీ లేదు.   మంగళగిరిలోని తెలుగుదేశం  కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో  నిందితుల జాబితాలో సజ్జల పేరు కూడా ఉంది.  ఆ కేసును సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ అధికారుల ఎప్పుడు పిలిస్తే అప్పుడు సజ్జల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.  ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య కోర్టులో లొంగిపోయారు.  సరే అదలా ఉంటే మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో కంటే పెద్ద కేసులోనే ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకోవడంపై స్పందించిన సజ్జల తనపై అసలు కేసులే లేవు.. లుక్ ఔట్ నోటీసు ఎలా జారీ చేస్తారంటూ ప్రశ్నించడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. కేసులే లేనప్పుడు యాంటిసిపేటరీ బెయిలు కోసం సజ్జల కోర్టును ఎందుకు ఆశ్రయించారంటున్నారు.  ఇక ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు మీడియాతో మాట్లాడుతూ సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఉందనీ, ఆయన అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయనీ విస్ఫష్టంగా చెప్పారు.  వాస్తవానికి జగన్ అధికారంలో ఉన్నంత కాలం సజ్జల డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారు. ప్రతి కీలక నిర్ణయం వెనుక ఉన్నదీ సజ్జలేనని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఆయన నంబర్ 2గా వ్యవహరించారు.  వైసీపీ హయాంలో జరిగిన ప్రతి తప్పిదానికీ, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులకూ సజ్జలే మాస్టర్ మైండ్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది.  సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో కూడా స్క్రిప్ట్ మొత్తం ఆయనదేనని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సజ్జలను పోలీసులు అరెస్టు చేసే రోజు ఎంతో దూరంలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఉండగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు బుధవారం (అక్టోబర్16) నోటీసులు ఇచ్చారు. గురువారం(అక్టోబర్ 17) ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొన్నారు.  

alvida saibaba

ఒక వీరునికి కడసారి వీడ్కోలు

2024 అక్టోబర్ 14, హైదరాబాద్. మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్.మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనాలతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవి  ఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొ డవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద... రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషిని చివరిసారి చూడడం కోసం జనం తోసుకుని వస్తున్నారు. జోహార్ కామ్రేడ్ సాయిబాబా అంటూ నినదిస్తున్నారు. అక్కడంతా ఉద్రిక్తంగా వుంది. ఒక ఉద్వేగం, విషాదం అక్కడ కలిసి ప్రవహిస్తున్నాయి. వందలమంది స్త్రీలు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వందలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ఏదో పోగొట్టుకున్న  వాళ్ళలా అక్కడ తిరుగుతున్నారు. గులాబీ పూల రేకులు తీసి, సాయిబాబా వున్న చల్లని గాజుపేటిక మీద వేసి, పిడికిలి బిగిస్తున్నారు కొందరు. నాయకులు, ఉద్యమకారులు, పేద జనం కోసం పని చేస్తున్న వాళ్లు, కళాకారులు, రచయితలు, కవులు, సంపాదకులు, జర్నలిస్టులు, పబ్లిషర్లు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, సాయిబాబా మిత్రులు, మాజీలు, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు... ఎందరెందరో.. ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లో అమలాపురంలో పుట్టి, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసినాయన కోసం, హైదరాబాద్‌లో ఇంత జనం రావడమేమిటి? సాయిబాబా పీజీ చదువుకున్నది ఇక్కడ... పీహెచ్‌డీ చేసింది యిక్కడే, అంతే కాదు, మిత్రులతో, సామాన్యజనంతో కలుపుగోలుగా వుండే మనిషి. నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ పొందిన ఉత్తమ విద్యార్థి. నిరంతరం చదువుతో, మేల్కొలిపే మాటలతో ఎందరిలోనో జ్ఞాన దీపాలు వెలిగించిన వాడు. నాగపూర్ అండా సెల్‌లో మృత్యు నీడల్లో రోజులు వెళ్ళదీస్తున్న కాలంలో కూడా ఆదీవాసీలైన అక్షరం ముక్క రాని అక్కడి ఖైదీలు కొందరికి సాయిబాబా చదువు చెబితే వాళ్లు డిగ్రీ పరీక్షలు పాసయ్యారు.  అక్రమం, అధర్మం నాలుగు పాదాల మీద నడిచే నేల మీద నిర్భీతి, నిజాయితీ, నిబద్ధతలను మూడు చక్రాల మీద ముందుకు నడిపించిన వాడు సాయిబాబా. దుర్మార్గపు వ్యవస్థల్ని తప్పితే వ్యక్తుల్ని ద్వేషించే మనిషి కాదతను!  అతి సామాన్య జనాన్ని అమితంగా ప్రేమించే మనసు. వాళ్ళ హక్కుల కోసం తెగించి పోరాడే సంకల్పం. అందుకే ఈ రోజు సాయిబాబా కోసం అంతమంది జనం దుఃఖించారు.    ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్న ఆ దీపాల్లాంటి కళ్ళని దానం చేశాడు. పోరాడి అలసిపోయిన దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజికి యివ్వమని చెప్పాడు.   ఆదివాసులను తరిమివేసి, లేదా అంతం చేసి ఆ కొండలూ, భూములూ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే దుర్మార్గం పేరే 'ఆపరేషన్ గ్రీన్ హంట్.' దానికి వ్యతిరేకంగా పోరాడినందుకే సాయిబాబాకి జీవిత ఖైదు. మోడీ, అమిత్ షా ప్రభుత్వం యిప్పుడు 'ఆపరేషన్ కగార్' అంటోంది. 2026 కల్లా ఆదివాసులనూ, మావోయిస్టులనూ సమూలంగా హతమార్చి, కార్పొరేట్ ఇండియాగా మార్చే పథకం పేరే కగార్. అంటుబుల్ 'అంతిమ యుద్ధం' అని అర్థం. బలహీనులైన నిస్సహాయులైన ఈ దేశ ప్రజల్ని బలి యిచ్చి, కార్పొరేట్లకు కోట్ల డాలర్లు కట్టబెట్టే ఈ అమానుషాన్ని మనందరం వ్యతిరేకించాలని సాయిబాబా గట్టిగా చెప్పారు. ఆచరించి చూపారు.  కలలు కలలుగానే మిగిలిపోయాయి. 3558 రోజులు, అంటే దాదాపు పది సంవత్సరాలు ఇనప వూచల వెనకాల, గోడల మధ్య ఇరుకు గదిలో ఒంటరిగా మిగిలిపోయిన మనిషికి కన్నీళ్ళు తప్ప కలలేముంటాయి? ఒక్కటే ఒక్క కల. ఎప్పటికైనా ఈ నరకం నుంచి బయటపడాలి. వెలుతురు చూడగలగాలి. లేటుగా అయినా ఆ కోర్కె నెరవేరింది. బైటికి రాగలిగాడు. తన కోసం పోరాడి, తపించి, నిరీక్షించిన వసంతకి భర్తగా ఒకింత ఆనందాన్ని యివ్వాలి. ఎమ్మే లిటరేచర్ చేస్తున్న కూతుర్ని యిష్టంగా, కళ్ళ నిండా చూసుకోవాలి, మృతదేహమై కాకుండా, తమ్ముడు రాందేవ్ ఇంటికి వెళ్లి, వాణ్ణి పలకరించి, టీ తాగి రావాలి, రాసి వున్న కవితలన్నీ ఒక చోట చేర్చి పుస్తకం వేయాలి, ఎన్నేళ్ళయిపొయింది! పాత కామ్రేడ్స్ అందర్నీ కలిసి మాట్లాడి కొత్త కార్యాచరణకి సిద్ధం కావాలి.   సుకవి సాయిబాబా కన్న కలలన్నీ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి మార్చురీ చీకటిలో వూపిరాడక విలవిలలాడి చచ్చిపోయాయి.     కవి వెళ్ళిపోయాడు. కలలు మిగిలిపోయాయి. అదిగో, పాటలు పాడే విమలక్క వచ్చింది. సాయిబాబా మీద అప్పటికప్పుడే కట్టిన పాట అందుకుంది. డప్పులు మొగుతున్నాయి. నలుగురు కోరస్ పాడుతున్నారు. అమరవీరుడి పోరాటాలను గుర్తు చేసుకుంటూ విమల గొంతెత్తి పాడుతున్నారు.    ఒక మంచి ఉపన్యాసకుడు మైక్ అందుకున్నాడు. తెల్లవాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు. నల్లవాడు నిన్ను నక్సలైట్ అన్నాడు... శ్రీశ్రీ గీతం జనానికి వినిపిస్తున్నాడు. వూగరా, వూగరా! నువ్వూగితే శత్రువులకు గాభరా! అన్న శ్రీశ్రీ ఫేమస్ పోయెమ్‌లోని మాటలివి. అంతిమ వీడ్కోలు: అందరూ సిద్ధం అవుతున్నారు. వీరుడా జోహార్లు...! అమరుడా... లాల్ సలామ్! గొంతులు విచ్చుకుం టున్నాయి. నినాదాలు నిప్పు రవ్వలై ఎగురుతున్నాయి.  నిజాయితీని ఆయుధంగా ధరించిన మనిషి ఒకడు అక్కడ దీర్ఘ నిద్రలో వున్నాడు. ప్రేమ పూల జలపాతం ఒకటి అక్కడ విశ్రాంతి తీసుకుంటోంది!   అన్ని దిక్కుల నుంచీ, దిగులు నిండిన అందరి హృదయాల నుంచి ఒక భావోద్వేగం తన్నుకువస్తోంది.  కన్నీటి వాన కురవడానికి ఆకాశంలో నల్లమబ్బులన్నీ సమాయత్తమౌతున్నాయి.    అల్విదా.... సాయిబాబా... అల్విదా!   వీరుడా! మానవుడా... అల్విదా! -తాడి ప్రకాష్

adultretion in prasadams

ప్రసాదాల్లో కల్తీలు.. దేవుడికే పంగనామాలు!

కాదేదీ కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అంటే కొందరు కాంట్రాక్టర్లు మాత్రం కాదేదీ కల్తీకి అనర్హం అంటున్నారు.   ఇప్పటి వరకూ ప్రసాదాల తయారీలో కల్తీ లేదన్న భావన భక్తుల్లో ఉండేది. కానీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలతో ఆ నమ్మకం సైతం ఆవిరైపోయింది. తినే తిండ, పీల్చే గాలీ, తాగే నీరు ఇలా అన్నిటినీ  కల్తీకి ఆనవాళ్లుగా మార్చేశారు. దేవుడి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడానికి గుత్తేదార్లు తెగించేశారు.  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ   విషయం దర్యాప్తులో ఉండగానే  శబరిమల అయ్యప్ప స్వామి  ప్రసాదంలో మోతాదు మించి క్రిమిసంహారకాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. దీంతో  ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచకుండా నిలిపివేశారు.  దాదాపు 6.65లక్షల  డబ్బాలలో అరవణ అనే అయ్యప్ప ప్రసాదంలో కల్తీ జరిగినట్లు గుర్తించారు. దీనిని ఏడాదిగా వాడకుండా ఉంచారు. దీనిని ఎరువుగా మార్చాలని దేవస్థానం నిర్ణయించింది. గత ఏడాది భక్తులు మాల వేసుకునే సమయంలో ఈ ప్రసాదాన్ని తయారుచేసారు. ప్రసాదంలో వాడే యాలకుల్లో కల్తీ జరిగిందని గుర్తించారు.దాంతో భక్తులకు అమ్మకాలు నిలిపివేసారు. శబరిమల వెళ్లిన భక్తులు డబ్బాల్లో ఉండే అరవణ ప్రసాదం తెచ్చి బంధువులకు స్నేహితులకూ పంచుతారు. ప్రసాదం పారవేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతిం టాయని,దాన్ని ఏమి చేయాలనే విషయంపై ట్రావెన్ కోర్ దేవస్థానం మల్లగుల్లాలు పడి చివరకు ఆ కల్తీ ప్రసాదాన్ని ఎరువుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆమేరకు టెండర్లు పిలిచి చర్యలు ప్రారంభించింది. ఇలా దేవుడి ప్రసాదాలను కల్తీ చేయడానికి కొంతమంది పాపపుణ్యాలు మరచి కేవలం ధనార్జనే ధ్యేయంగా  అడ్డగొలుగా, ఇష్టారీతిగా తెగించేస్తున్నారు. దేవుని ప్రసాదం అంటే దేవునితో సమానంగా భక్తులు భావిస్తారు. కాని లాభాల కోసం,కమిషన్లకోసం మంచీ చెడులను కాంట్రాక్టర్లు గాలికి వదిలేస్తున్నారు.  భక్తులు ఆ పాపానికి దేవుడే శిక్షిస్తాడనీ నమస్కారం పెట్టడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.పెత్తనం చేసే పాలక మండళ్లు ప్రభుత్వాల చేతుల్లో ఉండడం వల్ల చేతకానివిగా తయారయ్యారు. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్వతంత్ర సిట్ ను దర్యాప్తునకు ఆదేశించింది.   పాత ప్రభుత్వం ఇది ఆరోపణ మాత్రమేనని, ఇది కూటమి ప్రభుత్వ రాజకీయకుట్ర అని ఆరోపిస్తున్నది. కాని ప్రస్తుత ప్రభుత్వం కల్తీ జరిగిందనేది వాస్తవమని చెబుతు న్నది. భక్తుల నుంచి,సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణల మేరకు ప్రభుత్వ ల్యాబ్ పరిక్షలలో కల్తీ జరిగిందనీ, అదీ జంతు కొవ్వు కలిసిందనే నివేదికే ఇందుకు ఆధారమని అంటున్నారు. ఆమేరకు నిజానిజ నిర్ధారణకు సిట్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు దాన్నే మరింత విసృత పరచింది.ఏది ఏమైనా కల్తీలో అదీ నిషేధ పదార్ధాలు కలవడం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే కనీస విషయం మరచిన బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ED clean chit to chandrababu

‘స్కిల్’ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్..!

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామంతో 2023లో జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసిందని తేటతెల్లమైంది.  ఆంద్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకంలో సీమెన్స్ ప్రాజెక్ట్ నుండి నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు జగన్ ప్రభుత్వం ఆరోపించి చంద్రబాబును అరెస్టు చేసి, 53 రోజులు జైల్లో వుంచింది. ఇప్పుడు ఈడీ చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇవ్వడంతో నిధుల మళ్ళింపుకీ, చంద్రబాబుకు ఎలాంటి ఎలాంటి సంబంధం లేదని తేలింది.

whatsapp accounts banneds

84 లక్షల వాట్సప్ అకౌంట్లు ఫసక్!

 మెటాకు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సప్‌ని మన దేశంలో కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సప్‌ని అడ్డాగా చేసుకుని అనేక మోసాలు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో వాట్సప్ ద్వారా మోసాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఖాతాలను వాట్సప్ డిలీట్ చేసింది. ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపుగా 84 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. తమ సంస్థ నిర్ణయించిన ప్రైవసీ పాలసీకి కట్టుబడనందుకు గాను ఈ చర్యలు తీసుకున్నట్టు వాట్సప్ తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2021 నిబంధనల ప్రకారం ఆగస్టులో  84.58 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సప్ తెలిపింది. వీటిలో దాదాపు 16.61 లక్షల అకౌంట్లను ముందు జాగ్రత్త చర్యగా డిలీట్ చేశామని వాట్సప్ తెలిపింది. మోసానికి ఆస్కారం ఉండే బల్క్ మెసేజ్‌లు, అబ్‌నార్మల్ మెసేజ్‌లను వాట్సప్ తన ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా గుర్తించి ఈ చర్యలు చేపట్టింది. అలాగే, ఆగస్టు నెలలో యూజర్ల నుంచి 10,707 ఫిర్యాదులు అందినట్లు వాట్సప్ వెల్లడించింది.

flying taxi in bangalore

బెంగళూరులో ఫ్లయింగ్ టాక్సీలు!

బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌కి మరోపేరు నరకం. ఆ నరకాన్నుంచి బెంగళూరు నగరాన్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్లయింగ్ టాక్సీల సదుపాయాన్ని ఆస్వాదించడానికి బెంగళూరు నగరం సిద్ధమవుతోంది. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్య ఇబ్బంది లేకుండా హాయిగా, తక్కువ ఎత్తులో ప్రయాణించే సదుపాయాన్ని కల్పించడానికి బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రెడీ అవుతోంది. త్వరలోనే బెంగళూరు నగరానికి ఫ్లయింగ్ టాక్సీలను తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. దీనికోసం సార్లా ఏవియేషన్ సంస్థలో ఒప్పందం కుదుర్చుకున్నట్టు బెంగళూరు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి నగరంలోని వివిధ ప్రదేశాలకు హాయిగా గాలిలో ఎగురుతూ వెళ్ళిపోవచ్చు. ఈ విషయాన్ని సార్ల ఏవియేషన్ ప్రతినిధులు వివరిస్తూ, ‘‘బెంగళూరు విమానాశ్రయం నుంచి నగరంలోని ఇందిరా నగర్‌కి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక గంట 50 నిమిషాలు పడుతోంది. అదే ఫ్లయింగ్ టాక్సీలు వచ్చిన తర్వాత ఆ సమయం 5 నిమిషాలకు తగ్గిపోతుంది. రవాణా వ్యవస్థలో ఇదొక గేమ్ ఛేంజర్. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభ దశలో వుంది. ఈ ఫ్లయింగ్ టాక్సీలు అందుబాటులోకి రావడానికి ఇంకా రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది’’ అన్నారు.

vijaya sai alleges evms tampered in haryana

బోడిగుండుకీ మోకాలికీ ముడేసిన విజయసాయి!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోర పరాజయం పాలై నాలుగు నెలలు గడిచింది. ఇప్పటికీ ఆ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించుకోవడం లేదు. అసలు ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు.  ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు తమ పార్టీ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని చెబుతున్నారు. ఘోర పరాజయం పాలైన నాలుగు నెలల తరువాత కూడా ఈవీఎంలనే నిందిస్తూ కూర్చున్న పార్టీ దేశంలో వైసీపీ తప్ప మరొకటి ఉండదు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని ఎక్స్ వేదికగా ఆరోపించారు. అక్కడితో ఆగకుండా హర్యానా ఎన్నికలలో బీజేపీ విజయానికి కూడా ఈవీఎంల ట్యాంపరింగే కారణమన్నారు. బోడిగుండుకీ మోకాలికీ ముడేసిన చందంగా విజయసాయి అసందర్భంగా  హర్యానా ఎన్నికల ఫలితాలకు, ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ కు ముడి పెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల ద్వారా జగన్ ను చిక్కుల్లోకి నెట్టేసి తాను వైసీపీ పగ్గాలు అందుకోవాలన్నదే విజయసాయి వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హర్యానాలో బీజేపీ వరుసగా మూడో సారి విజయం సాధించడం వెనుక ఉన్నది ఈవీఎం ట్యాంప రింగేనని విజయసాయి ఆరోపణలు కచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం, మరీ ముఖ్యంగా మోడీ, అమిత్ షాలకు ఆగ్రహం కలిగిస్తాయి. అసలు అలా వారికి ఆగ్రహానికి గురి కావాలన్న ఉద్దేశంతోనే విజయసాయి ఈ ఆరోపణలు చేసి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా మోడీ, షాలకు జగన్ పై ఆగ్రహం కలిగేలా చేయడమే విజయసాయి వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. అలా చేస్తే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుంజుకుని జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని, అదే జరిగితే.. వైసీపీని తన గుప్పెట్లో పెట్టుకోవచ్చునన్నది విజయ సాయి వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. అయితే విజయసాయి ఇక్కడో విషయాన్ని మరచిపోతున్నారంటున్నారు.  జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుంటే.. జగన్ తో పాటు ఆ కేసులో ఏ2గా ఉన్న ఆయన కూడా చిక్కుల్లో పడతారనీ, జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే విజయసాయి కూడా కటకటాలు లెక్కించడానికి రెడీ అవ్వాల్సిందేననీ గుర్తు చేస్తున్నారు. 

a bullet train to andhrapradesh also

ఆంధ్రప్రదేశ్ కూ బుల్లెట్ రైలు!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో ఏయే రంగాల్లో అభివృద్ఢికి అవకాశాలు ఉన్నాయో ఆయా రంగాలలో అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటూ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలపాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు బుల్లెట్ రైలు తీసుకురావడంపై దృష్టి పెట్టింది. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ముంబై అహ్మదాబాద్ ల మధ్యా రానుంది. కేంద్రం దేశంలో ఏడు మార్గాలలో  బుల్లెట్ రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీటిలో తొలి రైలు ముంబై ఆహ్మదాబాద్ ల మధ్య నడవనుంది. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి కూడా. ఒక అంచనా ప్రకారం ముంబై అహ్మదాబాద్ ల మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రయాణం 2026కల్లా సాకారం అవుతుంది. ఇక మిగిలిన ఆరు బుల్లెట్ రైళ్లలో రెండు దక్షిణాదికి కేటాయించారు. అవి చెన్నై బెంగళూరు, ముంబై హైదరాబాద్ మార్గంలో నడుస్తాయి. కేంద్రం ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ రైలు మార్గాల్లో ఏ ఒక్కటీ కూడా ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లదు. అయితే ఇప్పుడు కేంద్రం బుల్లెట్ రైలు మార్గంలో ఆంధ్రప్రదేశ్ కు కూడా చోటు కల్పించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలియజేశారు. చైన్నె బెంగళూరు బుల్లెట్ రైలు మార్గాన్ని అమరావతి, హైదరాబాద్ వరకూ విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని అశ్విని వైష్ణవ్ తో భేటీ అనంతరం చంద్రబాబు స్వయంగా తెలుగుదేశం కూటమికి చెందిన కేంద్ర మంత్రులకు చెప్పారు.   ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడ నుంది.

flood expenditure andhra pradesh

వరద ఖర్చులు ఇవిగో ఫేక్ జగన్..!

వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం చేసిన ఖర్చు విషయంలో వైసీపీ నాయకులు నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారన్న అభిప్రాయాలను తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ ద్వారా ఒక మెసేజ్ విడుదల చేశారు. ‘‘వరద బాధితులకు ఇస్తామన్న కోటి రూపాయలలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్.. వరద బాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంపిణీ చేయని ఫేక్ జగన్ వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నాడు. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు అంటూ  ఫేక్ ప్రచారం చేయిస్తున్నాడు. వీటికి ఖర్చు 23 లక్షలు కూడా కాలేదు. జగన్ చీకటి పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి.. ఇవిగో ఖర్చుల లెక్కలు.. అన్నీ పారదర్శకంగా ఉన్నాయి.. చదువు వస్తే చదువుకో.. కళ్ళుంటే చూడు.. తాడేపల్లి ప్యాలెస్ కలుగులో దాక్కుని ప్రజాధనం కోట్లు పందికొక్కులా ఎగ్‌ పఫ్‌లు మెక్కి, నిమ్మకాయ నీళ్లులా తాగేసిన ఫేక్ జగన్ ఇకనైనా నీ ఫేక్ ప్రచారాలు ఆపు.. ...నారా లోకేష్, విద్య, ఐటి శాఖల మంత్రి’’ అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. దానితోపాటు వరద ఖర్చుల జాబితాను కూడా విడుదల చేశారు.

tata group to invest in ap

ఆంధ్రప్రదేశ్ లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు!

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మరో సారి పారిశ్రామిక స్వర్ణయుగం రాబోతోందా అంటే బిజినెస్ ఎక్స్ పర్ట్స్ ఔననే అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది.  ప్రపంచ దేశాలలోని అగ్రశ్రేణి పరిశ్రమలన్నీ తమ పరిశ్రమల విస్తరణకు ఏపీవైపే చూసే వారు. కియా సహా పలు అగ్రశ్రేణి సంస్ధలు రాష్ట్రంలో  పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.  కియా అయితే కార్యకలాపాలు ప్రారంభించేసింది. మరెన్నో సంస్థలు ఎంవోయూలు చేసుకున్నాయి. అయితే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.  జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్  ఐదేళ్ల  హయాంను రాష్ట్ర పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా చెప్పవచ్చు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం కుక్కలు చింపిన విస్తరిలా తయా రైంది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి తరలిపోయాయి. అంతకు ముందు అంటే 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఎంవోయూలు చేసుకున్న సంస్థలు  మొహం చాటేశాయి.  ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఇందు కోసం చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు. రాష్టరానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా కొత్త పారిశ్రామిక వధానాన్ని రూపొందించారు.  2014-19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిన అప్పటి పరిస్థితులు మళ్లీ  తీసుకురావడం, వృద్ధి రేటు 15 శాతానికి తగ్గకుండా చూడటం లక్ష్యాలుగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.  ఆయన కృషి ఫలిస్తోందనడానికి స్పష్టమైన తార్కాణంగా  జగన్ హయాంలో ఆయన విధానాలతో విసిగిపోయి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేది లేదంటూ వెళ్లిపోయిన   లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మళ్లీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడాన్ని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ కొలువు దీరిన తరువాత రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారు తున్నది. తాజాగా  టాటా గ్రూప్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమెబైల్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది.   టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో గత నెలలో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాలలో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలకు కొనసాగింపుగా అన్నట్లు రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముంబై వెళ్లి నటరాజన్ చంద్రశేఖరన్ తో మంగళవారం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం లోకేష్ చేసిన ఓ ట్వీట్ రాష్ట్రంలో టాటా పెట్టు బడులు ఖాయమని తేల్చేసింది. నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అద్భుతంగా జరిగింది. బుధవారం(అక్టోబర్ 9)న రాష్ట్రంలో టాటా పెట్టుబడులకు సంబంధించి ఓ ప్రకటన వెలువడుతుందని లోకేష్ చేసిన ట్వీట్ రాష్ట్రంలో టాటా గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుందన్న హింట్ ఇచ్చింది. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు అనంతపురంలో టీసీఎష్ క్యాంపస్, రాయలసీమలో సెమికండక్టర్ ప్లాంట్, అనంతపురం సమీపంలో విమానాల తయారీ సంస్థల ఏర్పాటుకు టాటా గ్రూపు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి గొప్ప ఊతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ప్రగతి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఏపీలో తిరుగు ఉండదు.  

congress self goal in haryana

హర్యానాలో కాంగ్రెస్ కొంప ముంచిన ఆప్!

హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్సే కాదు.. స్వయంగా బీజేపీ సైతం రాష్ట్రంలో ఓటమి ఖాయమన్న అంచనాకు వచ్చేసింది. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉండటం, అలాగే ప్రధాని మోడీవి రైతాంగ వ్యతిరేక విధానాలంటూ రైతులలో వెల్లువెత్తిన తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో పరిశీలకులు సైతం హర్యానాలో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద బండినడకే నంటూ విశ్లేషణలు చేశారు. ఇక బీజేపీ అనుకూల  మీడియాగా అంతా భావించే మీడియా సంస్థలు కూడా హర్యానాలో మూడో సారి కమల వికాసం అనుమానమే అంటూ వార్తా కథనాలు ప్రచురించాయి. అయితే మంగళవారం (అక్టోబర్ 9) వెలువడిన ఫలితాలు మాత్రం అందరి అంచనాలనూ తల్లకిందులు చేసేశాయి. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత ఆరంభంలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచినా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత తగ్గి బీజేపీ విజయం దిశగా దూసుకు వెళ్లింది. చివరికి మ్యాజిక్ ఫిగర్ దాటేసి విజయాన్ని అందుకుంది.  ఇక ఫలితాల తరువాత విశ్లేషణలు చూస్తే హర్యానాలో కాంగ్రెస్ పరాజయానికి ప్రధాన కారణం ఆప్ అని తేలింది. చాలా నియోజకరవర్గాలలో ఆప్ కు వచ్చిన ఓట్లే కాంగ్రెస్ పరాజయానికి కారణంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. హర్యానాలో బీజేపీ విజయం ఆ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న అభిమానం కాదనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆప్ మధ్య భారీగా చీలిపోవడమే కారణమని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ స్వయంకృ తాపరాధమేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విజయంపై అతి ధీమాయే కాంగ్రెస్ ఓటమికి కారణంగా చెబుతున్నారు. అతి విశ్వాసంతో కాంగ్రెస్ చేతికి అందేలా వచ్చిన విజయాన్ని చేజార్చుకుందని విశ్లేషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీయే అయినా హర్యానాలో మాత్రం కాంగ్రెస్ ఆ పార్టీతో సీట్ల సర్దుబాటుకు ససేమిరా అంది. ఏక పక్ష విజయంపై ఉన్న అతి ధీమాతో ఆప్ తో కలిసి ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని చేజేతులా వదులు కుంది.  ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చూస్తే కాంగ్రెస్ విజయానికి అడ్డంగా నిలిచినవి ఆప్ కు పడిన ఓట్లేనని తేలిపోవడంతో ఇప్పుడు అంటూ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేని పరిస్థితిలో హస్తం పార్టీ పడింది. హర్యానా ఎన్నికలలో ఓట్ల పరంగా బీజేపీతో సమానంగా ఓట్లు సాధించిన కాంగ్రెస్.. సీట్ల విషయంలో మాత్రం భారీగా నష్టపోయింది. అందుకు కారణం ఆప్ కు వచ్చిన ఓట్లే. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ కు రెండు శాతం ఓట్లు వచ్చాయి. ఆప్ తో పొత్తు పెట్టుకుని ఉంటే ఆ రెండు శాతం ఓట్లే కాంగ్రెస్ కు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టేవి. అయితే కాంగ్రెస్ ఆప్ తో పోత్తుకు వెనుకాడటంతో హర్యానాను ‘చే’ జార్చుకుంది.   కేవలం సర్వేలను నమ్ముకునే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోవడానికి విముఖత చూపింది. అదే సమయంలో బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ ను తక్కువగా అంచనా వేసింది. ఫలితం అనుభవిస్తోంది. 

volunteers are jagan employees

అప్పుడూ ఇప్పుడూ వలంటీర్లు జగన్ ఉద్యోగులే!

వలంటీర్ల వ్యవస్థ ఎందుకు పుట్టుకొచ్చిందో... వారు ఎవరి కోసం పని చేశారో తేలిపోయింది. ఇప్పటి వరకూ వలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అన్నది ఆరోపణల స్థాయిలోనే ఉంది. అయితే జగన్ సర్కార్ పతనమైన నాలుగు నెలల తరువాత ఆ వ్యవస్థ ఎందుకు పని చేసింది? ఎవరి కోసం పని చేసింది అన్న విషయాలను స్వయంగా వైసీపీ అధినేత జగన్ చెప్పేశారు. వలంటీర్లంతా వైసీపీ ఉద్యోగులేననీ, వారికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదనీ ప్రకటించేశారు. అలా ప్రకటించి ఊరుకోకుండా.. వలంటీర్లందరికీ ఇక నుంచి వైసీపీయే వేతనాలు చెల్లిస్తుందని ప్రకటించేశారు. వరద సాయం కోటి రూపాయలులా ఆయన ప్రకటన మిగిలిపోతుందో? నిజంగానే వారికి ప్రతినెలా ఠంచనుగా జీతాలు ఇస్తారో చూడాల్సిందే కానీ.. జగన్ మానసపుత్రిక వాలంటీర్ వ్యవస్థ ఆవిర్బావ రహసం మాత్రం తేటతెల్లమైపొయింది. ఆ వ్యవస్థను జగన్ తన కొరకు తన చేత తానే ఏర్పాటు చేశారని ఆయనే స్వయంగా అంగీకరించేశారు.  ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోవడం లేదనీ, అందు చేత వారిని వైసీపీ ఉద్యోగులుగా గుర్తించి నెలనెలా వారికి ఒక్కొక్కరికీ ఐదేవేల చొప్పున  గౌరవ వేతనం చెల్లిస్తాననీ చెప్పారు. వైసీపీ సర్కార్ 2019లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వాలంటీర్లను నియమించింది. వారందరినీ ప్రభుత్వోద్యోగులుగా ప్రకటించింది. ప్రతి 50 మంది జనాభాకు ఒకరు చొప్పున ఆ వాలంటీర్లను నియమించి ప్రభుత్వ పథకాల అమలు వారి ద్వారా జరిగేలా మార్గదర్శకాలు రూపొందించింది. తద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతరంగా వాలంటీర్ల వ్యవస్థ తయారైంది. జనం అధికారులపై కాకుండా వాలంటీర్లపై ఆధారపడేలా పరిస్థితుల ఏర్పడేలా చేసింది. అంతే కాకుండా వారికే ఎన్నికల విధులు అప్పగించి ఎన్నికలలో లబ్ధి పొందాలని జగన్ భావించారు. అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించడాన్ని ఈసీ అంగీకరించకపోవడంతో జగన్ వ్యూహం దెబ్బతింది. దీంతో వాలంటీర్లు రాజీనామా చేసి  పార్టీ కోసం పని చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎన్నికలలో గెలిచి మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందనీ, అప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లనందరినీ తిరిగి నియమిస్తాననీ అప్పట్లో జగన్ పేర్కొన్నారు. జగన్ పిలుపును నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అయితే అలా చేయని వారు లక్షన్నర మందికి పైగా ఉంటారు. ఇప్పుడు వారి విషయంలోనే జగన్ ఈ ప్రకటన చేశారు.  వాలంటీర్లంతా వైసీపీ ఉద్యోగులేనని ప్రకటించారు. గతంలో వారు వైసీపీ కోసం పని చేశారనీ, ఇప్పుడు కూడా అదే చేయాలనీ, వైసీపీయే వారికి నెల నెలా వేతనం చెల్లిస్తుందనీ అన్నారు. తద్వారా వాలంటీర్ వ్యవస్థ ఎవరి కోసం ఎందుకు ఏర్పాటయ్యిందో శషబిషలకు తావు లేకుండా చెప్పేశారు.  

prashamt kishore promise lift liquor ban

మద్య నిషేధం ఎత్తివేత.. ప్రశాంత్ కిశోర్ హామీ మందుబాబుల ఓట్ల కోసమేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోన్ సొంత కుంపటి జన్ సురాజ్ ను ప్రారంభించేశారు. ఇప్పుడు ఆయన పార్టీకి ఆయనే అధినేత, ఎన్నికల వ్యూహకర్త కూడా. ఆయన వ్యూహాల పదును పార్టీని ప్రారంభించిన మొదటి రోజే చూపారు. బీహార్ లో అత్యంత కీలకంగా మారిన మద్య నిషేధంపై ఆయన చేసిన ప్రకటన రాజకీయ పండితులను  సైతం విస్మయపరిచింది. బీహార్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో తన పార్టీ జన్ సురాజ్ విజయం సాధించి అధికారం చేపడితే.. వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు.  సాధారణంగా ఏ పార్టీ అయినా సరే మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటిస్తారు. కానీ నలుగురూ నడిచే దారిలో నేనసలు నడవను అనే ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని తాను అధికారంలోకి రాగానే ఎత్తి వేస్తానని ప్రకటించారు.  మహిళల ఓట్ల కోసం రాజకీయ పార్టీలూ తరచూ ఎత్తుకునే మద్యపాన నిషేధం నినాదాన్ని కాదని ఆయన ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించడం రాజకీయంగా సాహసమనే చెప్పవచ్చు. మందుబాబుల ఓట్ల కోసమే ప్రశాంత్ కిశోర్ ఈ ప్రకటన చేశారా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని తాను  చేసిన ప్రకటన పూర్తిగా ఆర్థిక కారణాలతోనేనని ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు.  మద్యపాననిషేధం ఎత్తి వేయడం ద్వారా రూ.20వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అవుతుందన్నారు.వాటిని విద్యావ్యవస్థ పటిష్టం చేయడానికి ఖర్చు చేస్తామన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచస్థాయిలో విద్యావ్యవస్థ అభివృద్ధి చేయడానికి ఐదులక్షల కోట్లు వ్యయం చేస్తానని చెప్పారు. జన సురాజ్ మార్టీకి మాజీ ఐఏఎస్ అధికారిణి ని కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించిన ప్రశాంత్ కిషోర్..  విద్యా,ఉపాధి రంగాలు అభివృద్ధే తన ఎన్నికల ఎజెండాగా చెప్పారు. ఆయన రాజకీయ ఎజెండా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే మద్య నిషేధం ఎత్తివేత ప్రకటన ద్వారా ఆయన మందుబాబుల అభిమానానికి పాత్రుడయ్యారనడంలో ఎంత మాత్రం సందేహం లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.   ఇక జనసురాజ్ విషయానికి వస్తే.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 (బుధవారం ) ఆయన తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను బీజేపీతో కలిసి పయనించే అవకాశం ఇసుమంతైనా లేదన్నారు. సొంతంగా, స్వతంత్రంగా జనసురాజ్ ఎదుగుతుందనీ, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత కాలం వేరే పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేసి వాటికి అధికారాన్ని కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ తన పార్టీ జన సురాజ్ కోసం ఎటువంటి వ్యూహాలు రచిస్తారన్న ఆసక్తి బీహర్ కే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ ద్వారా ఏ మేరకు సక్సెస్ అవుతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

konda surekha crossed limits in criticism

మంత్రి కొండా సురేఖ మర్యాద గీత దాటేశారు!

తెలంగాణలో రాజకీయ రచ్చ రోత పుట్టిస్తోంది. బూతుల సంస్కృతి ప్రబలిపోతున్నది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో కనీస మర్యాద కూడా పాటించని పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గతంలో అంటే జగన్ హయాంలో  వైసీపీ నేతలు, కొందరు మంత్రులు కూడా ప్రత్యర్థులపై బూతు పురాణాలతో విరుచుకుపడేవారు. ఆ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రాజకీయాలలో ఒక రకమైన హుందా తనం గోచరిస్తోంది. అక్కడ వైసీపీ నేతలు నోరు జారినా, అధికార పార్టీ నేతలు మాత్రం సంయమనం పాటిస్తున్నారు. మర్యాదకు, విలువలకు పెద్ద పీట వేస్తున్నారు. అయితే అటువంటి సంయమనం తెలంగాణ రాజకీయాలలో ఇటు అధికార కాంగ్రెస్ లోనూ, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ లోనూ కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.   తాజాగా కొండా సురేఖ మర్యాద సరిహద్దులను దాటేశారు. అధికార కాంగ్రెస్ ప్రతిష్ఠను నిలువెత్తు గొయ్యి తీసి కప్పెట్టేశారు. నిజమే కొండా సురేఖపై సామాజిక మాధ్యమంలో ట్రోల్స్ ఎ మాత్రం సమర్ధనీయం కాదు. అందులో సందేహం లేదు. కానీ అందుకు ప్రతిగా ఆమె చేసిన విమర్శలు కూడా ఎంత మాత్రం సమర్ధనీయం కాదు.  ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో  ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకు మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతోపాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫోటో ఉండటంతో  సురేఖపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానించింది. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అక్కడి వరకూ ఓకే.. కానీ కొండా సురేఖ తన విమర్శలతో మర్యాద హద్దులను దాటేశారు. ఆమె బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసి ఊరుకోకుండా బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను కూడా ఈ వివాదంలోకి లాగారు. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే నటి రకుల్ ప్రీత్ సింగ్, మరి కొందరు హీరోయిన్ల పేర్లనూ లాగారు. కొందరు హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేసి వారిని వైధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు చేశారు. హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు.  ఈ విమర్శలతో అప్పటి వరకూ కొండా సురేఖపై ప్రజలలో వ్యక్తం అవుతున్న సానుభూతి మొత్తం ఆవిరైపోయింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. ఆమెకే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చుట్టుకున్నాయి. సినీ పరిశ్రమ మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తోంది. కాంగ్రెస్ నేతలు సైతం సురేఖనే తప్పుపడుతున్నారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి డిస్మిస్ చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది.  కొండా వ్యాఖ్యలపై  రేవంత్ స్పందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. తన మాటలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సమంతను ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. తాను సమంత మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదనీ, స్వయం శక్తితో ఎదిగిన సమంత తనకు ఆదర్శం అనీ, ఆమె పట్ల తనకు ఎంతో గౌరవం ఉందనీ పేర్కొన్నారు. సమంత మనస్తాపానికి గురైతే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే అప్పటికే పరిస్థితి ‘చేయి’ దాటిపోయింది.  సినీ పరిశ్రమకు చెందిన పలువురు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ అవసరాలు, విమర్శల కోసం సినీ రంగానికి చెందిన మహిళలను లాగడం సరికాదని పేర్కొన్నారు. నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు. 

సోము వీర్రాజు కంటే ఊసరవెల్లి నయం!

సోము వీర్రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లూ జగన్ భజన చేసి తరించారు. జగన్ అడ్డగోలు నిర్ణయాలను, విధానాలనూ రాజును మించిన రాజభక్తి అన్న స్థాయిలో మద్దతు తెలిపి పునీతులయ్యారు. ఒక సమయంలో ఆయన బీజేపీ అధిష్ఠానానికి రాసిన లేఖలో అప్పట్లో రాష్ట్రంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కారణంగా ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారైందని పేర్కొన్నారు. ఆయన ఆ లేఖ రాసిన సమయంలో   తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు.. అధికారంలో ఉన్న వైసీపీతో సోము వీర్రాజు అంటకాగుతున్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఆ హోదాలో ఉన్న ఆయన  రాష్ట్ర పార్టీ బలహీనం కావడానికి విపక్ష నేత కారణం అంటూ  అధిష్ఠానానికి లేఖ రాయడాన్ని బీజేపీ శ్రేణులే తప్పుపట్టాయి. అదొక్కటే కాదు.. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఆయన టార్గెట్ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నట్లుగా విమర్శలతో చెలరేగిపోయారు. జగన్ కు వంత పాడటం కోసం ఆయన ఒంటెత్తు పోకడలకు పోయారు. అప్పట్లో ఆయన తీరును సొంత పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులే జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీని కనీసం ఉనికి మాత్రంగా కూడా లేకుండా చేయడమే లక్ష్యమా అన్నట్లుగా అప్పట్లో సోము వీర్రాజు తీరు ఉండేది.  సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం నుంచి ఒక ప్రతినిథి వర్గం హస్తినకు వెళ్లి మరీ సోము వీర్రాజుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది. దానిపై సీరియస్ గా స్పందించిన   బీజేపీ హైకమాండ్ వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్ చార్జ్, అప్పటి కేంద్ర మంత్రి మురళీధరన్ ను రాష్ట్రానికి పంపింది. ఆయన నేరుగా రాజమహేంద్ర వరం వచ్చి పార్టీ నేతలతో బేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా సోము వీర్రాజుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  అప్పట్లో ఏపీలో జగన్ ప్రభుత్వ అవినీతిపై  చార్జిషీట్ దాఖలు చేయాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినా సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర శాఖ ఆ పని చేయలేదు.  ఇదంతా ఎందుకుంటే సోము వీర్రాజు ఎంతగా జగన్ భజనలో తరించారో చెప్పడానికే.  అటువంటి సోము వీర్రాజు ఇప్పుడు స్వరం మార్చేశారు. చంద్రబాబు భజనకు రెడీ అయిపోయారు.  తిరుమలలో స్వచ్ఛమైన లడ్డు తయారు చేసి భక్తులకు అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. అందుకు చంద్రబాబు తరఫున తానూ పూచీ అని వాకృచ్చారు.  తిరుమల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి హేయం అని విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలో ఉండగా మంచి చెడూ మరిచి ఆయనతో అంటకాగిని సోము వీర్రాజును ఇప్పుడు బీజేపీలో పట్టించుకునే నాథుడే లేరు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే. ఏదో ఒక నామినేటెడ్ పోస్టు, కనీసం ఎమ్మెల్సీ అంటూ సోము వీర్రాజు వెంపర్లాడుతున్నా బీజేపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. దీంతో మళ్లీ పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికే సోము వీర్రాజు స్వరం మార్చారని బీజేపీ  శ్రేణులే అంటున్నాయి. ఇక తెలుగుదేశం వర్గాలైతే సోము వీర్రాజును వీర లెవెల్లో ట్రోల్ చేస్తున్నాయి. 

ఇక అమరావతి పనులు 24X7!

ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇక వేగం పుంజుకోనుంది. అమరావతి నిర్మాణ పనులు నిరంతరాయంగా సాగనున్నాయి. అమరావతి నిర్మాణానికి కేంద్రం అందించే సహాయం నేడో రేపో అందనుంది. ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్రం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిధులనను వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇక అమరావతి పనులను ఎలాంటి అవాంతరాలు, అవరోధాలు లేకుండా నిరంతరాయంగా సాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ లో నిధులు అందుతాయి కనుక ఆ మరుసటి నెల అంటే డిసెంబర్ నుంచి పనులను శరవేగంగా అంటే 24X7  కొనసాగించాలని నిర్ణయించింది. జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా వ్యవహరించిన తీరు కారణంగా.. రాష్ట్రరాజధాని ప్రాంతం ఓ అడవిలా తయారైంది. 80శాతానికి పైగా పూర్తయిన భవనాలు కళ తప్పాయి. రోడ్లు అధ్వానంగా మారాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరం ప్రాజెక్టు తరువాతి ప్రాధాన్యత అమరావతికే ఇచ్చారు. చంద్రబాబు సీఎంగా పగ్టాలు చేపట్టగానే అమరాతిలో జంగిల్ క్లయరెన్స్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జగన్ నిర్వాకం కారణంగా 80 శాతంపైగా పూర్తయిన నిర్మాణాలు కూడా పాడుబడ్డాయి. అటువంటి భవనాల సామర్ధ్యాన్ని, వాటిని కొనసాగించడానికి గల అవకాశాలను నిపుణులు పరీక్షించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు సాగనున్నారు.   ఇక అమరావతి పనులకు ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ఆరంభించే యోచనలో ప్రభుత్వం ఉంది.  

రేవంత్ స్పీడ్ కు అధిష్ఠానం బ్రేకులు!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయంతో పార్టీలో, పార్టీ క్యాడర్ లో కనిపించిన ఉత్సాహం నీరుగారిపోతోంది.  ఏ ముహూర్తాన హైడ్రా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూల్చివేతల పర్వానికి శ్రీకారం చుట్టారో కానీ, ఆ హైడ్రాయే ఇప్పుడు రేవంత్ సర్కార్ మెడకు చుట్టుకుంది. అప్పటి వరకూ రేవంత్ కు ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో తిరుగులేని ఆమోదం కనిపించింది. ఎప్పుడైతే హైడ్రా అంటూ రేవంత్ దూకుడు పెంచారో అప్పుడే పార్టీలో, ప్రభుత్వంలో ఆయనపై వ్యతిరేకతకు అంకురార్పణ అయ్యింది.  ఇక హైడ్రా కూల్చివేతలపై పార్టీ హైకమాండ్ కూడా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని మరీ అక్షింతలు వేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక పార్టీలో సీనియర్ నాయకుడు, హైకమాండ్ కు సన్నిహితుడు అయిన మధుయాష్కీ తాజాగా కూల్చివేతలపై చేసిన వ్యాఖ్యలు, అవసరమైతే బాధితుల తరఫున పార్టీలో, కోర్టులో కూడా పోరాడుతానంటూ ఇచ్చిన హామీ చూస్తుంటే..రేవంత్ స్పీడ్ కు హైకమాండ్ బ్రేకులు వేసిందన్నది స్పష్టమౌతోంది.  నటుడు నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో  ముఖ్యమంత్రి రేవంత్ గ్రాఫ్, కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఆయన మూసీ  పక్కనే ఇళ్ళు నిర్మించుకొని దశాబ్ధాలుగా ఉంటున్న సామాన్య, మద్య తరగతి ప్రజల నివాసాలపై దృష్టి సారించారో అప్పుడే ప్రజా వ్యతిరేకత మొదలైంది.  మూసీవాసులకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.  హైకోర్టులో   20 పిటిషన్ల వరకూ దాఖలయ్యాయి.  ఈ ప్రాంతంలో ఇళ్ళ వ్యవహారం హైకోర్టులో ఉందంటూ ప్రతీ ఇంటి గోడపై ఫ్లెక్సీ బ్యానర్లు కనిపిస్తున్నాయి.    ఇక హైడ్రా కమషనర్ రంగనాథ్ కు హైకోర్టు అక్షింతలు వేసింది.  శనిఆదివారాలలో ఇళ్ల కూల్చివేతలపై నిలదీసింది.  హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ శని, ఆదివారాలలో కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని సూటిగా ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, మరోసారి ఇలా చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణించి   చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.   హైడ్రా కూల్చివేతలతో ఒక్క హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఎన్నికల హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైనా, పాలనలో ప్రజల అంచనాలను అందుకోలేకపోయినా ఇంత వరకూ ప్రభుత్వంపై పెద్ద వ్యతిరేకత కనిపించలేదు. కొంత సమయం ఇద్దామన్నట్లుగానే ప్రజలు ఉన్నట్లు కనిపించింది. అయితే ఎప్పుడైతే హైడ్రా సామాన్యుల నివాసాలపై దృష్టి పెట్టిందో అప్పుడే ప్రజాగ్రహం భగ్గుమంది. పార్టీలో, కేబినెట్ లో సైతం హైడ్రా తీరుపై, రేవంత్ దూకుడుపై ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ నుంచి రేవంత్ కు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

సిద్ధరామయ్యపై బిగుస్తున్న ‘ముడా’ ఉచ్చు!

ముడా కుంభకోణంలో కర్నాటక సీఎం సిద్దరామయ్యకు ఉచ్చు బిగుస్తోంది.  కర్ణాటకలోకి సీబీఐ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ముడా వివాదంలో సిద్ధరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.  కాగా, ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య, మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసు నమోదు చేశారు. సీఎం సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య పార్వతిని ఏ2గా చేర్చారు. తాజాగా సిద్దరామయ్య భార్య మైసూరు అప్‌మార్కెట్ ప్రాంతంలో తనకు కేటాయించిన 14 ప్రత్యామ్నాయ స్థలాలను ప్రభుత్వానికి తిరిగి అప్పగించినట్టు మంగళవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు తన కుటుంబాన్ని వివాదాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.