Read more!

సజ్జల ‘బురదగుంటలో పొర్లాడే పంది’?

వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే దురదగుంట ఆకుతో తయారుచేసిన తాంబూలం వేసుకుంటూ వుంటారని అనిపిస్తోంది. ఎందుకంటే, ఆయన ఏ మాట మాట్లాడినా ‘నోటి దూల’తో మాట్లాడినట్టు వుంటుంది. ఐదేళ్ళ క్రితం వైసీపీ అధికారంలోకి రాకముందు కావచ్చు.. ఐదేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ దురదృష్టకర క్షణాలు దాపురించిప్పటి నుంచి కావచ్చు... ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా నోటి దురదతో ఇష్టమొచ్చిన స్టేట్‌మెంట్లు ఇవ్వడం తప్ప, పద్ధతిగా మాట్లాడిన దాఖాలాలు లేవు. ఐదేళ్ళ వైసీపీ పాపం బాగా పండి, పరిపక్వ దశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సజ్జల తన సహజ ప్రకోపంతో నోరు జారుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పేరుతో అనివార్యమైన ఒక చారిత్రక పరిణామం జరిగింది. ఈ కూటమి వైసీపీకి ఓటమిగా మారుతుందన్న అభిప్రాయం జాతీయ స్థాయిలో కూడా ఏర్పడింది. ఈ పరిస్థితిని చూసి కడుపుమంటని ఆపుకోలేకపోతున్న వైసీపీ నాయకులు కూటమి విషయంలో, కూటమికి మద్దతు ఇస్తున్న వారి విషయంలో నోటికొచ్చినట్టు వాగుతూ తమ సంస్కార హీనతను బయటపెట్టుకుంటున్నారు. అలాంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి మిస్టర్ సజ్జల.
ఆంధ్రప్రదేశ్ కూటమికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల కూటమికి మద్దతు ప్రకటించారు. జనసేనకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఇది చూసిన సజ్జలకి ఎసిడిటీ, అల్సర్ బాగా పెరిగిపోయింది. దాంతో మీడియా సమావేశంలో తన కడుపుమంటను బయటపెట్టారు. ‘కూటమికి చిరంజీవి మద్దతు ప్రకటించిన విషయంలో మేమేమీ ఆశ్చర్యపోవడం లేదు. చిరంజీవే కాదు.. ఇంకెవరు వచ్చి మద్దతు ఇచ్చినా మాకు నష్టం లేదు. ఎంతమంది కలసి వచ్చినా వైసీపీని ఓడించడం సాధ్యం కాదు’ అని బీరాలు పలికారు. ఆయన అక్కడతో ఆగితే ఎలా? ఉదయాన్నే తినే దురదగుంట ఆకు తాంబూలం తన ప్రభావం చూపిస్తుంది కదా.. ఆ ప్రభావంతోనే ఆయన ‘‘ఏపీ ఎన్నికల ముఖచిత్రం విషయంలో ఇప్పుడొక స్పష్టత వచ్చింది. ఇటువైపు జగన్ ఒక్కరే వున్నారు.. అటువైపు గుంటనక్కలు, తోడేళ్ళు, ముళ్ళపందులు’ వున్నాయని నోరుపారేసుకున్నారు.
నోరు పారేసుకోవడం తన ఒక్కడి జన్మహక్కు అని సజ్జల భావిస్తూ వుండొచ్చు. నోరు పారేసుకోవడం కంటే.. నోరుని జాగ్రత్తగా కాపాడుకోవడమే గొప్ప విషయం. సజ్జల తరహాలోనే కూటమి వర్గాలు కూడా నోరు పారేసుకుంటే బాగుంటుందా? సజ్జలను ‘బురదగుంటలో పొర్లాడే పంది’ అని ఎవరైనా అంటే పద్ధతిగా వుంటుందా? ‘వైసీపీ అనే బురద గుంటలో పొర్లాడుతున్న పంది లాంటి సజ్జల, తన ఒంటికి అంటిన బురదని అందరి మీద వెదజల్లుతున్నారు’ అని ఎవరైనా అంటే సంస్కారం అనిపించుకుంటుందా? సజ్జలని అలా ఎవరూ అనరనే ఆశిద్దాం.