డిబేట్ లకు వెళ్ళకండి.. సబ్జెక్టు లేకుండా టీవీ ఛానెల్లో కూర్చునే వాళ్లపై కేసీఆర్ ఫైర్

 

టీవీ ఛానళ్ళు నిర్వహించే డిబేట్ లకు వెళ్లద్దని దాదాపు ఆరు నెలల క్రితమే పార్టీ నేతలపై ఆంక్షలు పెట్టారు టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. అధికార స్పోక్స్ పర్సన్ ను త్వరలోనే ప్రకటిస్తామని ఆ సమయంలోనే చెప్పారు. ఎంపీలు , ఎమ్మెల్యేలతో పాటు ఇది పార్టీలో అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఏకంగా పార్టీ అధ్యక్షుడే షరతు పెట్టడంతో నేతలంతా స్టూడియోలకు వెళ్ళడం మానేశారు. అవగాహన లేకుండా కొందరు ఛానెళ్లలో మాట్లాడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ప్రెస్ మీట్లు.. అది కూడా అనుమతి తీసుకొని పెడుతున్నారు. పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్.. అటు శాసనసభాపక్షం ఆఫీసులోనైనా పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టడానికి వీళ్లేదని సీఎం హెచ్చరించారు.ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై.. పార్టీపై.. విమర్శలొచ్చిన రెండు సంఘటనలున్నాయి. ఒకటి ఆర్టీసీ సమ్మె కాగా రెండోది దిశ హత్య ఘటన. ఈ రెండు విషయాల్లో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు కేసీఆర్. పార్టీ నుండి వాయిస్ లేకుండా పోతోందని కొందరు సలహా ఇచ్చిన లెక్కచేయలేదు. కేవలం కేటిఆర్ సానుభూతిపరులో లేక పార్టీలో అధికారికంగా సభ్యత్వం లేని వారో న్యూస్ చానళ్ల ప్రత్యేక చర్చలకు వెళ్లారు తప్ప మిగిలిన వాళ్లు మాత్రం పాల్గొనలేదు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ముఖ్య నేతలు  టీవీ ఛనళ్ల చర్చలకు ఎవరు వెళ్లాలి అన్న ప్యానల్ మాత్రం రెడీ చేశారు. ఈ జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ కూడా పంపారు. ప్రస్తుతానికి అవసరం లేదనే ధోరణిలో ముఖ్యమంత్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. పార్టీ రెండో సారి అధికారంలోకి ఏడాది మాత్రమే అయింది. ఇంకా దాదాపు నాలుగేళ్లు సమయముంది. అందుకే ప్రస్తుతం ప్రతి విషయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది కేసీఆర్ ఆలోచన అని కొందరు భావిస్తున్నారు. అందుకే ఈ విషయంలో ఎవరూ మాట్లాడటం లేదు. టీవీ ఛానళ్ళకు వెళ్లే కొందరు సరిగా మాట్లాడటం లేదన్న అభిప్రాయంతో ఉన్నారు. నేతలను ఫిల్టర్ చెయడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే టిఆర్ఎస్ నేతలు ఇక శాశ్వతంగా టీవీ స్టుడియోలో కనిపించే పరిస్థితి లేనట్లే ఉంది. మరోవైపు ముఖ్యంగా ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ తన వాణిని వాదాన్ని బలంగా వినిపించింది. మీడియా మాధ్యమాలను బాగా ఉపయోగించుకున్న పార్టీలో టిఆర్ఎస్ ఒకటి. టిడిపి లాంటి పార్టీలు ఏ ఛానల్ కి ఎవరు వెళ్లాలి.. వెళ్ళేవాళ్ళకు సబ్జెక్టు సమకూర్చుతూ లాంటి అంశాలు కూడా ఉన్నాయి. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఛానళ్ళకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టడంతో అసలు కారణం ఏంటని ఆ పార్టీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.  

Teluguone gnews banner