Read more!

పనిచేయనప్పుడు వ్యాక్సిన్ ఎందుకు? ప్రజల్లో చర్చ..!

కరోనా టీకా వేయించుకుంటే యాంటీ బాడీలు పెరిగి వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. ఈ భూమ్మీద పుట్టిన ఏ శాస్త్రవేత్త అయినా చెబుతున్నది ఇదే.. వ్యాక్సినేషన్ చేయించుకున్నా దీర్ఘకాలం రక్షణ లభించే అవకాశం ఉండకపోవచ్చట. వ్యాక్సిన్ కరోనాకు బ్రహ్మాస్త్రం కాదట. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకదని గ్యారంటీ అసలే లేదు. వ్యాక్సిన్ రెండు డోసులూ వేయించుకున్న పలువురికి కూడా కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు ఒమిక్రాన్, అంతకు ముందు డెల్టా వేరియంట్ కూడా సోకాయి. కరోనా టీకాలు వేసుకున్న తర్వాత కూడా కొందరి ప్రాణాలను మహమ్మారి హరించేసింది. అయినప్పటికీ ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాలి. అవసరం, అవకాశం ఉన్న వారు ప్రికాషన్ డోసు కూడా వేయించుకోవాలి. ఇది ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట. టీకాలు వేయించుకున్నప్పటికీ మాస్క్ లు తప్పనిసరి. సామాజిక దూరం పాటించడమూ, తరచూ శానిటైజర్ వినియోగించడమూ తప్పదట. అయినప్పటికీ కరోనా సోకదనే గ్యారంటీ మాత్రం లేదు!

కరోనా టీకా టీసుకున్న వారిలో ఆరు నెలలకే యాంటీబాడీలు తగ్గుతున్నాయని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) అధ్యయనంలో వెల్లడైంది. ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ తో కలసి ఏఐజీ ఈ అధ్యయనం నిర్వహించింది. మొత్తం ఒక వెయ్యి 636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఏఐజీ అధ్యయనం నిర్వహించింది. టీకా వేయించుకున్న ఆరు నెలల్లోనే 30 శాతం మందిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్లు గుర్తించింది. టీకా తీసుకున్న వారిలో కూడా ఐజీజీ-ఎస్ 1, ఐజీజీ-ఎస్ 2 యాంటీబాడీలల్లో తగ్గుదల కనిపించినట్లు ఏఐజీ స్టడీ వెల్లడిస్తోంది. అంటే టీకా వేసుకున్నా కరోనా ముప్పు పొంచి ఉండొచ్చట. ముఖ్యంగా 40 ఏళ్ల వయస్సు పైబడి, బీపీ, చక్కెర వ్యాధి ఉన్న వారిలో టీకాలు వేసుకున్నా యాంటీబాడీలు తగ్గుతున్నట్లు అధ్యయనంలో తేలిందని ఏఐజీ స్టడీ పేర్కొంది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ఐరోపా దేశాలు వణికిపోతుండడం గమనార్హం. ఎందుకంటే ఆ దేశాల్లో చాలా మందికి రెండు డోసుల టీకా వేయించుకున్నవారికి, చివరికి బూస్టర్ డోసు వేయించుకున్న వారిలో కూడా చాలా మందిని ఒమిక్రాన్ వదిలిపెట్టడం లేదు.

వ్యాధి సోకకుండా నివారించే ఔషధాన్ని వ్యాక్సిన్ అంటారు. ఎప్పటికీ కరోనా సోకకుండా నివారించే శక్తి లేని దాన్ని వ్యాక్సిన్ అని ఎందుకు అనాలో అర్థం కావడం లేదనేది కొందరి క్వశ్చన్ మార్క్.. మసూచి, కోరింత దగ్గు, పోలియో లాంటి వ్యాధులు రాకుండా నివారించేందుకు వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ లు వేయించుకున్నవారిని ఆయా జబ్బులు దరి చేరవనేది ఇప్పటివరకు మనం నమ్ముతున్న నిజం. ఇప్పుడు కరోనా వైరస్, ఒమిక్రాన్ విషయంలో వస్తున్న వార్తలు, వైద్యులు చేస్తున్న చికిత్సలు, వేస్తున్న వ్యాక్సిన్ లో ఏది నిజం? ఏది అబద్ధమో తెలియకుండా ఉందని పలువురిలో కలుగుతున్న అనుమానం. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులు, కాలేయంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో 90 శాంత మంది శ్వాస అందకపోవడంతో మరణించినవారే ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. కరోనా అసలే సోకకుండా.. ఒకవేళ సోకినా వైరస్ ను నాశనం చేసేలా మందులను ఔషధ కంపెనీలు కనిపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. నిజానికి కరోనా కన్నా ఇతర ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్నవారి సంఖ్యే అధికం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఇతర వ్యాధుల విషయంలో జరగని హడావుడి కరోనా విషయంలో ఎందుకు జరుగుతోందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా ప్రమాదకరం అని జరుగుతున్న ప్రచారం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు పోతున్నాయనేది కొందరి ఆరోపణ.

ఇవన్నీ వింటుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? పూర్తిగా రక్షణ కల్పించలేని టీకా తీసుకుని ఫలితం ఏమిటని అనిపించవచ్చు కదా? టీకా వేసుకున్నా కరోనా నుంచి ముప్పు గండం పొంచి ఉంటుందనుకున్నప్పుడు దాని కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? అనే సందేహం కూడా పలువురిలో కలగవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వస్తుందని చెబుతున్నప్పుడు టీకా ఎందుకు వేసుకోవాలి అనే ప్రశ్న వస్తోంది. ఉపయోగపడని వ్యాక్సిన్ ఎవరి ప్రయోజనం కోసం వేస్తున్నారనే విమర్శలు రావడం సహజమే కదా?!