Read more!

జర్మనీలో ఎమ్మెల్యే... టికెట్ కోసం భిక్షాటన!

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే జర్మనీలో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జర్మనీకి వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు. దీంతో ఎమ్మెల్యే తిరిగి రావాలంటూ ఆయన నియోజకవర్గంలో నిరసనలు జరుగుతున్నాయి. టికెట్ కొనడానికి డబ్బులు లేక ఎమ్మెల్యే అక్కడే ఉండిపోయారో ఏమో అంటూ కొందరు భిక్షాటన చేశారు. భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులు పంపిస్తున్నామని.. టికెట్ కొనుక్కొని వెంటనే తిరిగి రావాలని వాళ్లు కోరుతున్నారు. అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం భిక్షాటన చేసింది ఎమ్మెల్యే మనుషులు కాదు. ఆయన ప్రత్యర్తి పార్టీ కార్యకర్తలు.

 

సిరిసిల్ల జిల్లా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు గత 8 నెలలుగా జర్మనీలో ఉన్నారు. కరోనాకు ముందు జర్మనీకి వెళ్లిన రమేశ్ బాబు.. ఇప్పటికి అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే 8 నెలలైనా తిరిగిరాకపోవడంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గానికి ఎమ్మెల్యే రమేశ్ బాబు దూరమయ్యారంటూ భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు విపక్ష పార్టీల కార్యకర్తలు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు. వేములవాడ రాజన్న ఆలయం వద్ద భిక్షాటన చేశారు. ఎమ్మెల్యే స్వదేశానికి వచ్చేందుకు విమాన టిక్కెట్ల చార్జీలకు గాను డబ్బులు సేకరించామని భిక్షాటన చేసిన నిరసనకారులు తెలిపారు.

 

స్వదేశానికి వచ్చి ప్రజాసేవ చేస్తారా? లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అంటూ వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేశ్‌బాబును ప్రశ్నించారు నిరసనకారులు. వేములవాడ నియోజకవర్గ ప్రజలు కరోనా కారణంగా కష్టాలు పడుతున్నా ఎమ్మెల్యే మాత్రం 8నెలలుగా జర్మనీలో కాలక్షేపం చేస్తున్నారని వారు మండిపడ్డారు. లాక్‌డౌన్‌ అన్‌లాక్‌ మొదలైన తర్వాత ఎన్నో దేశాల నుంచి విమానాల రాకపోకలు నడుస్తున్నా.. రమేశ్‌కు మాత్రం విమానం దొరకడం లేదా అని ప్రశ్నించారు. ‘జర్మనీ బాబు ఇదేనా నీ జాబు’ ‘గత 8 నెలల జీతం నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించాలి’ అంటూ
నినాదాలు చేశారు.