ఏంటి సార్..మీరు మరీ బ్రహ్మానందం లాగా...

నాగబాబు కు దురద గుంటాకు పూసుకోవటమంటే మహా సరదా మల్లే ఉంది. పొద్దున్న పొద్దునే తన ట్విట్టర్ లో కరోనా వైరస్ మీద జోకుదామనుకుంటే, అది కాస్తా బూమరాంగ్ అయింది. " కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే కరోన వైరస్ ని వాళ్ళ దేవుడే ఈ భూమి మీద కి పంపించాడు అని అంటున్నారు. అయినా ఈ దేవుళ్ళ కి కోపం ఎక్కువే సుమా.." అంటూ జబర్దస్త్ గా నాగబాబు చేసిన ట్వీట్ కి అసలే చిరు బ్రదర్స్ అంటే కోపం నషాలా కి అంటిన జనం వీర లెవెల్లో రిప్లై ఇచ్చారు. 

"అక్కడ మన అభ్యర్థులపైన దాడులు జరుగుతున్నాయ్ సార్ కులమతాల గొడవలు వదిలేసి కొంచెం జనంలో తిరగండి", అంటూ తిరిగి నాగబాబు మీద సెటైర్ రువ్వాడో నెటిజెనుడు. అంటే, దీనర్ధం, చిరు బ్రదర్స్ ఎలాంటి బాదరా బందీ లేకుండా... ఉత్తినే ట్వీట్లు చేయటం కాదు, జన సేన అభ్యర్థుల మీద చాలా చోట్ల దాడుల జరుగుతున్నాయి కాబట్టి కాస్త వాళ్ళని పరామర్శించటానికైనా వెళ్ళండి, మైలేజ్ దక్కుతుందని ఆ నెటిజెనుడు సుద్దులు చెప్పాడు. 

కాస్తంత పనికి వచ్చే విషయాల మీద ట్వీట్లు పెట్టమని ఇంకోహాయన, అలాగే, ఇవాళ జన సేన ఫార్మేషన్ డే కాబట్టి దాని మీద, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద జనాన్ని సెన్సిటైజ్ చేసే ప్రయత్నం చేయండని మరొకాయన శ్రీమాన్ నాగబాబు గారికి సలహా ఇచ్చారు.

telugu one news

telugu one news

Teluguone gnews banner