వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి సుప్రీం నోటీసులు
posted on Dec 6, 2024 @ 12:33PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారి చేసింది. తెలంగాణ హైకోర్టు భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ సునీత సుప్రీం గడపతొక్కారు. భాస్కర్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ధర్మాసనం శుక్రవారంవిచారణ చేపట్టింది.
విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ కు సునీత పిటిషన్ జత చేస్తూ సుప్రీం నోటీసులు జారీ చేసింది.