శిల్పాశెట్టి మోసగత్తె
posted on Mar 22, 2015 @ 5:38PM
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పెద్ద మోసగత్తె అంటూ ఆమె మీద కేసు నమోదైంది. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా వున్న రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ సంస్థ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శిల్పాశెట్టి మోసగత్తె అంటూ కేసు నమోదైంది. తమను శిల్పాశెట్టి తొమ్మిది కోట్ల రూపాయలకు ముంచిందని కోల్‌కతాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఆరోపణలు చేసింది. ఆమెకి చెందిన కంపెనీలో 9 కోట్ల రూపాయలు తాము పెట్టుబడులు పెట్టామని, తిరిగి వాటిని చెల్లించకుండా ఆమె మోసం చేసిందని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. శిల్పా అండ్ రిపు సుదన్ కుంద్రా ఆఫ్ ఎస్సెన్షీయల్ స్టోర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని శిల్పా నడుపుతోంది. ఇందులో తాము పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఎంకే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కేసు పెట్టింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ శిల్పా, ఆమె కంపెనీపై నమ్మక ద్రోహం, మోసం, ఉద్దేశపూర్వక కుట్రతదితరమైనవి పేర్కొంటూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రెండేండ్లలో పదింతలు తిరిగిస్తామని పెట్టుబడులు పెట్టించి అనంతరం పట్టించుకోవడం మానేశారని ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.