Read more!

షరియా చట్టం అంత భయంకరమా? ఆప్ఘన్లపై ఇక అరాచకలేనా? 

ఒక్క ఆఫ్ఘనిస్థాన్ ప్రజలనే కాదు, ప్రపంచ దేశాలను కూడా తాలిబాన్లు ఎంతగా ఆందోళనకు  గురిచేస్తోందో చూస్తూనే ఉన్నాం. నిజమే, ప్రపంచాన్ని భయపెడుతోంది, తాలిబాన్లు, వారి అరాచక కృత్యాలే అయినా, తాలిబాన్లను నడిపిస్తోంది, శాసిస్తోంది మాత్రం షరియా చట్టం. తాలిబాన్లు ఎంతగా శాంతివచనాలు వల్లించిన, ఆఫ్ఘన్ ప్రజలు ముఖ్యంగా మహిళలు వారి పేరు వింటేనే గజగజ వణికి పోతున్నారంటే, అందుకూ కారణం కూడా, తాలిబాన్లు కాదు, వారు అమలు చేసే షరియా చట్టమే. అందుకే ఆఫ్ఘన్ మహిళలను షరియా చట్టం చావును మించిన భయానికి గురిచేస్తోంది.

తాలిబాన్లు ఓ వంక ఆఫ్ఘన్ మహిళలకు పనిచేసే హక్కు, ఓ  స్థాయి వరకు విద్యా చదువుకునే హక్కు ఉంటుందని అంటూనే, మహిళల హక్కులకు. స్వేచ్చకు కూడా  షరియా చట్టం వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ఈ షరియా అనే పదం చెవిన పడగానే, 20 ఏళ్ల క్రితం నాటి  భయానక అనుభవాలను గుర్తు తెచ్చుకుని మహిళలు భయంతో వణికి పోతున్నారు.  అయితే, ఆఫ్ఘన్ ప్రజలను మరీ ముఖ్యంగా మహిళలను ఇంతలా భయానికి గురిచేస్తున్న షరియా చట్టం, అంటే ఏంటి? మన దేశంలోనూ కామన్ సివిల్ కోడ్ ప్రతిపాదనను వ్యతిరేకించే లౌకిక వాదులు సమర్ధించే షరియా చట్టం ఏమి చెపుతోంది, అసలేంటి ?  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా షరియా చట్టం అంటే ఏమిటని చూస్తే, ఇది ఇస్లామిక్‌ న్యాయ వ్యవస్థ. ఇందులో ముస్లిం పవిత్ర గంథ్రమైన ఖురాన్‌లోని అంశాలు, మత పెద్దలు చేసిన ఫత్వాల ఆధారంగా దీన్ని రూపొందించారు. ముస్లింగా పుట్టిన ప్రతి ఒక్కరూ, ఈ చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలనేది చట్టం సారాంశం. నిజంగా షరియా అంతటి దుర్మార్గ చట్టమా, ముస్లింలు అందరూ ఆచరించి తీరవలసిన చట్టమా, అంటే అవునని,కాదనే రెండు వాదనలు ఉన్నాయి.

షరియా చట్టంలో అంతా చెడే కాదు, మంచి కూడా ఉందని, ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు సహా ముస్లింలందరూ పాటించాల్సిన జీవన నియమావళిగా షరియా నిర్దేశిస్తుందని, ఇస్లాం మత పెద్దలు చెపుతారు. షరియా దేవుని కోరికల ప్రకారం ముస్లింలు తమ జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా నడిపించాలో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుందని, ఉత్తమ జీవ మార్గాన్ని చూపుతుందని అంటారు. అయితే తాలుబాన్లు, అనిసరించే షరియాలో మాత్రం మంచి మచ్చుకు అయినా కనిపించదు. తాలిబాన్ల షరియా చీకటి దారుల్లోకి తీసుకుపోతుందని కొందరు వాదిస్తారు. షరియా తాలిబాన్ల వెర్షన్, అందులో శిక్షలే కాదు, శిక్షలను బహిరంగా అమలు చేసే పద్దతి కూడా అంతే అమానుషంగా ఉంటుంది.  తాలిబాన్ షరియా ప్రకారం సంగీతం వింటే తప్పు, వీడియోలు చూస్తే పాపం, రోజు ఐదు సార్లు నమాజు చేయక పొతే నేరం, పురుషులు గడ్డం మీద కత్తి పడితే, ఏకంగా పీకే తెగిపోతుంది. మహిళలైతే బుర్జా, హిజాబ్‌ వంటి దుస్తులు ధరించాలి. వీరు ఈ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే, చిన్నా పెద్ద తేడా లేకుండా బహిరంగంగా కాల్చి/కొట్టి  చంపుతారు. అందుకే ఆఫ్ఘన్ మహిళలు షరియా అంటే చావు కేక విన్నతగా భయపడుతున్నారు.  

మరోవైపు పైకి శాంతి వచనాలు పలుకుతున్న తాలిబాన్లు, ఇప్పటికే మహిళల పట్ల తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబూల్‌లోని పలు వ్యాపార సముదాయాలు, కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీల్లో మహిళల చిత్రాలను తాలిబన్లు చింపేశారు. మహిళల బొమ్మలు, విగ్రహాలను ధ్వంసం చేశారు. మహిళలు ఉన్న పోస్టర్లపై నల్లటి సిరాను పూశారు. మరికొన్ని కనిపించకుండా పరదాలు కప్పారు. దేశీయ టీవీ చానళ్లు, రేడియో స్టేషన్లలో మహిళలు పనిచేయకూడదని నిషేధం విధించినట్టు వార్తలు వస్తున్నాయి. ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ స్త్రీ అయినా బురఖా ధరించాల్సి ఉంటుంది. వారు తమ ఇంటిని విడిచి వెళ్లాలనుకుంటే మగ బంధువుతో పాటుగా తీసుకురావాలి.స్త్రీ అడుగుజాడలను ఏ పురుషుడు వినకూడదు కాబట్టి మహిళలకు హైహీల్డ్ బూట్లు అనుమతించారు. బహిరంగంగా బిగ్గరగా మాట్లాడేటప్పుడు ఒక మహిళ వాయిస్ అపరిచితుడికి వినిపించకూడదు. 

వార్తాపత్రికలు, పుస్తకాలు, దుకాణాలు లేదా ఇంటిలో ఆడవారి ఫోటోలు తీయడం, చిత్రీకరించడం లేదా ప్రదర్శించడం అనుమతించరు. మహిళలు తమ బాల్కనీలలో కనిపించడానికి అనుమతించరు.ఇలా అడుగడుగునా ఆంక్షలు, గీతదాటితే, షరియా చట్ట పరిధిలో అమానుష శిక్షలు ..షరియా చట్టం ప్రకారం నేరాలను హద్ నేరాలు (కఠినమైన శిక్షలుండే తీవ్రమైన నేరాలు) , తాజిర్ నేరాలు  (న్యాయాధిపతి నిర్ణయం మేరకు విధించే శిక్ష) రెండు రకాలుగా వర్గీకరిస్తుంది. దొంగతనం, వ్యభిచారం హద్ నేరాల జాబితాలోకి వస్తాయి. దీనికి చేతులు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలుంటాయని చెబుతారు.ఇవనే కాదు, నేరం ఏదైనా శిక్షలు మాత్రం ఆలాగే, ఉంటాయి. అందుకే తాలిబాన్లు అన్నా, వారు  అమలు  చేసే షరియా అన్నా ఆఫ్ఘన్ మహిళలు భయంతో వణికిపోతున్నారు.