మా జన్మ ధాన్యం అయ్యింది: సాయి కుమార్, సునీత
posted on Oct 22, 2015 @ 10:49AM
అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా పాల్గొనేందుకు తమకు అవకాశం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నామని యాంకరింగ్ చేయబోతున్న డబ్బింగ్ కింగ్ సాయి కుమార్, సునీత చెప్పారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరుగకుండా ఆశించిన దానికంటే గొప్పగా యాంకరింగ్ చేసేందుకు గత రెండు రోజులుగా రిహార్సల్స్ కూడా చేస్తున్నామని వారు తెలిపారు.
ఇటువంటి అవకాశం దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని సాయి కుమార్ అన్నారు. అవకాశం రావడానికి అమరేశ్వరుని ఆశీస్సులే కారణం. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్న ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇది మన ఇంటి పండుగ మన అందరి పండుగ. అమరేశ్వరుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను అని గాయని సునీత అన్నారు.