రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతి


 

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి (60) మృతిచెందారు. తన స్వస్థలం అయిన మహబూబ్ నగర్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డి పల్లిలో ఈ రోజు ఉదయం గుండెనొప్పి కారణంగా మృతి చెందారు. వివరాల ప్రకారం.. రోజూలాగనే ఉదయాన్నే పనిమీద బయటికి వెళ్లిన కృష్ణారెడ్డి.. బయటికి వెళ్లిన కొంతసేపటికి ఛాతి నొప్పి కారణంగా ఇంటికి తిరిగివచ్చారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలను విడిచారు. తన సోదరుడి మరణవార్త తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి తీవ్ర   మనస్తాపానికి గురయ్యారు. కృష్ణారెడ్డి మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేశ్ తో పాటు పలువురు తెదేపా నేతలు దిగ్ర్భాంతికి గురయ్యారు  . కృష్ణారెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Teluguone gnews banner