జగన్ మేనమామ ఏం చెప్పలేదు
posted on Mar 1, 2013 @ 1:34PM
జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఒక రోజు పోలీస్ కస్టడీ ముగియడంతో ఆయనను ఈ రోజు కోర్ట్ ఎదుట హాజరుపర్చారు. కస్టడిలో రవీంద్రనాథ్ రెడ్డి పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఏమి చెప్పకపోవడంతో తిరిగి తమ కస్టడీకి అనుమతించాలని కోరనున్నారని తెలుస్తోంది. తనకి అనారోగ్యంగా ఉందంటూ కోర్ట్ అనుమతితో రిమ్స్‌లో వైద్య పరీక్షలు పొందిన సమయంలో డాక్టర్లను బెదిరించి వారి సెల్ ఫోన్ ద్వారా కొంతమంది తో మాట్లాడినట్టు సమాచారం. ఈ సంఘటన పై కూడా పోలీసులు దర్యాప్తును వేగం చేశారు.
ఫిర్యాదు కాపీ పైన జిల్లా సహకార అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం రోజు రవీంద్రనాథ్ రెడ్డి కోర్టులో లొంగిపోయారు. అతని ముందస్తు బెయిల్‌తో పాటు తరవాత దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రవీంద్రనాథ్ రెడ్డిని పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారణలో అతను తనకు ఏమీ తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది.