హోదా వద్దు.. యోగా ముద్దు.. రాందేవ్ బాబా

 

ప్రఖ్యాత యోగా గురువు రాందేవ్ బాబా హర్యానా ప్రభుత్వం తనకు ప్రతిపాదించిన కేబినెట్ ర్యాంకును తిరస్కరించారు. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ యోగా, ఆయుర్వేదం ప్రచారం కోసం రాందేవ్ బాబాను అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోనివట్ లో మంగళవారం రాందేవ్ బాబా భారీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను బాబాగానే ఉంటానని, తనకు ఎలాంటి పదవుల మీద ఆసక్తి లేదని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.

Teluguone gnews banner