రాంసింగ్ ఆత్మహత్య పై అనుమానాలు, న్యాయ విచారణ
posted on Mar 11, 2013 @ 12:35PM
ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిర్భయ హంతకులను ఉరి తీయాలని దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన డిమాండ్ చల్లారకముందే…నిందితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే రా౦సింగ్ ఆత్మహత్యపై న్యాయ విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సోమవారం జైలు అధికారులను ఆదేశించింది. కాగా రాంసింగ్ను ఉంచిన సెల్లో మరో ఇద్దరు ఖైదీలు ఉన్నారు. వారిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.