రాష్ట్రపతి అనంతపురం పర్యటన

 

శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి చేరుకున్న రాష్ట్రపతి నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.ఆయనతో పాటు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర సమయంలో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో అనంతపురం వెళతారు.

అనంతపురంలో జరిగే నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరిగే నీలం శతజయంతి ముగింపు వేడుకల్లో పాల్గొనటంతో పాటు, తరువాత పుట్టపర్తిలొని సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత మూడు గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.ఈ పర్యటనలో మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొననున్నారు. ప్రణబ్ రాక నేపథ్యంలో అనంతపురం, పుట్టపర్తిలలో భద్రత కట్టుదిట్టం చేశారు. డీజీపీ దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Teluguone gnews banner