ఆంధ్రలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల తబ్లీగ్ జమాతే పుణ్యమే: జగన్ మోహన్ రెడ్డి
posted on Apr 2, 2020 @ 3:58PM
*వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్
*వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
*ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం వైయస్.జగన్
కోవిడ్ –19ను ఎదర్కోవడంలో రాష్ట్రంలో సమగ్ర విధానానలు అనుసరిస్తోందని ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో 2012 నాన్ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులను నెలకొల్పా మన్నారు.13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కోవిడ్ –19 వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రులను కేటాయించా మన్నారు.
10,933 నాన్ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్ ఈ ఆస్పత్రుల్లో సిద్ధం చేశామని సి ఎం చెప్పారు.
మొత్తంగా 1000 ఐసీయూ బెడ్లను సిద్ధంచేశామాన్నారు.
దీనికి తోడుగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్ కోసం మరో 20వేల బెడ్లను రెడీగా ఉంచామని చెప్పారు. అంతేకాక క్షేత్రస్థాయిలో నిరంతరం గట్టి పర్యవేక్షణ చేస్తున్నామాన్నారు.
ఫిబ్రవరి 10 నుంచి ఇప్పటివరకూ 27,876 మందికిపైగా విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చారని,
వీరిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 10,540 మందికాగా 17,336 మంది రూరల్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని సి ఎం చెప్పారు. వీరిని తరచుగా కలుసుకున్నవారు, సన్నిహితంగా మెలిగిన వారు, వీరి కుటుంబ సభ్యులు... అంటే మొత్తంగా ప్రైమరీ కాంటాక్ట్స్ 80,896 మంది ఉన్నారని సి ఎం చెప్పారు.
వీరందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఉన్నారన్నారు.
కోవిడ్ –19 లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సమగ్ర సర్వే చేసినట్టు సి ఎం చెప్పారు.
గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇప్పటికి రెండు సర్వే చేశాం:
ఢిల్లీలో తబ్లీగీ సమాతే సదస్సుకు హాజరైన వారిని గుర్తించి వారి క్వారంటైన్‌కు తరలించామాన్నారు.
వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహించండం, మంచి వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామాన్నారు:
తబ్లిగీ జమాతేకు హాజరైన 1085 మంది ఇలా గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయిస్తున్నామని సి ఎం చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ 132 మందికి కోవిడ్ –19 సోకిందని,
ఇందులో 111 మంది తబ్లీగ్ జమాతేకు వెళ్లిన వారేనని,
91 మంది తబ్లీగ్‌జమాతేకు వెళ్తే, మరో 20 మందికి కాంటాక్ట్ కావడంద్వారా ఈ వైరస్ సోకిందని వివరించారు.