Read more!

దేశానికి ఐదు నిమిషాలు ఇవ్వగలరా?

చాలామంది దేశం నాకేమిచ్చింది అని ప్రశ్నిస్తారు. దేశం నాకేమిస్తుందా అని ఆలోచిస్తారు.. దేశం నాకు చాలా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే
మనుషులోయ్ అనే మాట మాత్రం ఆలోచించరు. దేశమంటే మరెవరో కాదు.. దేశమంటే మనమేనని అర్థం చేసుకోరు. దేశం మనకి చాలా ఇచ్చింది. ఆఫ్రికా దేశాలనో, ఎడారి దేశాలనో చూస్తే
మనకి అర్థమవుతుంది. 
మనకి ఎంతో ఇచ్చిన దేశానికి మనం కూడా ఏమైనా ఇవ్వాలి.. దేశం నాకేమిచ్చింది అని కాకుండా.. దేశానినేనేమిచ్చాను? దేశానికి నేనేమివ్వాలి అని ఆలోచించాలి. అనిపిస్తోందా?
దేశానికి ఏమైనా ఇవ్వాలని మీకనిపిస్తోందా? అయితే, దేశానికి మీరివ్వాల్సింది ఏమిటంటే, దేశం మీ నుంచి కోరుకునేది ఏమిటంటే, ఐదు నిమిషాలు.. ఎస్.. ఐదంటే ఐదు నిమిషాలు.. రీల్స్
చూడడ్డానికి గంటలు గంటలు వినియోగిస్తాం. అలాంటిది దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించలేమా? ఇప్పుడు మీకు దేశం కోసం ఐదు నిమిషాలను ఇవ్వాలని అనిపిస్తోందా? అయిదు
నిమిషాలు కాదు.. పదినిమిషాలు ఇస్తాం.. ఎక్కడ ఇవ్వాలో చెప్పండి అనిపిస్తోందా? అయితే అది ఎక్కడ ఇవ్వాలో మేము  చెప్పం.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్
చెబుతున్నారు చదవండి.
‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం ఎన్నో హక్కులను కల్పించింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగిన ఎన్నికలలో ఓటు వేయడం
పౌరులుగా మన ప్రధాన బాధ్యత. ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికలలో ఓటు వేయడానికి, మన దేశం కోసం ఓటు వేయడానికి ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించడానికి
వీలవుతుంది కదా! ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. నేను మొదటిసారి ఓటు వేసినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందాను. ఆ ఆనందాన్ని ఓటు వేసిన
ప్రతిసారీ పొందుతూ వుంటాను’’.... భారత ఎన్నికల సంఘం చేపట్టిన ‘మై ఓట్.. మై వాయిస్’ మిషన్‌లో భాగంగా జస్టిస్ చంద్రచూడ్ ఇలా చెప్పారు.