MAKE EVERYDAY A PRODUCTIVE ONE!

Many times in life, we live some wasteful days. Days when life seems purposeless. You may think, there’s nothing that can be done to change this. But, you can! Making a day productive is in your hands. I’ll give you some ideas that’ll make everyday of your life meaningful.

Firstly, to increase the number of hours in your day, you should wake up early. Psychology says man needs motivation to do anything in life. Even to wake up early, you will need to motivate yourself. Give yourself exciting reasons to look forward to the next day. Waking up for an interesting breakfast can for instance, motivate a food lover to start early day. Similarly, find your interest and motivate yourself to wake up to that.


Learn to think fast. Dont brood over one thought forever! Act spontaneously. Put the first thought that crosses your mind, into action. Dont wait for the right time, because the right time is right now! Give more importance to your gut feeling. That always gives you the right answer and it thinks faster than your brain.


Apply the same trick at work too! Work fast to keep up the enthusiasm and put small targets for each task. Listening to music to keep yourself interested in your work. To work well, your environment also needs to be appropriate. Tasks are better performed in a well lit room. So arrange your work space accordingly for best results. Have a nice day!


..............Kruti Beesam

భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉండాలి?  ఎలా ఉండకూడదు?

గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి. అయితే గొడవలు కూడా ఆరోగ్యంగా  ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. కానీ నేటి కాలంలో చాలా వరకు భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేసే విదంగా గొడవలు జరగడం చూస్తుంటాం.  అసలు భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? తెలుసుకుంటే.. భార్యాభర్తల మధ్య వాదనలు, గొడవలు జరుగుతూ ఉంటాయి.  అవన్నీ నిజంగా బంధాన్ని బలపరుస్తున్నాయా లేదా అనే విషయాన్ని గమనించుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినా అది ఆరోగ్యకరంగా ఉండాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ అబిప్రాయాలను ఓపెన్ గా చెప్పుకోవాలి.  అది వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసేలా కాకుండా సమస్యపై దృష్టి పెట్టేలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బంధం విచ్చిన్నం కాకుండా బంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ వాదించుకున్న తర్వాత జరిగిన విషయం గురించి ఇద్దరూ లోతుగా  ఆలోచించాలి.  ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి గొడవ తర్వాత భార్యాభర్తలు తమ భాగస్వాములను మరింత అర్థం చేసుకోగలిగితే,  సమస్య ఎందుకు వచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ బంధం ఆరోగ్యకరంగా ఉంటుంది. భార్యాభర్తల మద్య గొడవ ఏదైనా అనుమానం, హింస,  కోపం, నియంత్రించడం,  భయపెట్టడం వంటి విషయాల ద్వారా చోటు చేసుకుంటే అది బార్యాభర్తల మద్య బంధాన్ని నాశనం చేస్తుంది. భార్యాభర్తల మధ్య  ఎన్ని గొడవలు జరిగినా అది చివరికి పరిష్కారం అవ్వాలి.  అలా ఉన్నప్పుడే ఆ బందం అందంగా, ఆనందంగా ఉంటుంది.  భార్యాభర్తలు కూడా ఇలాంటి గొడవల వల్ల దూరం కాకుండా ఉంటారు.  కానీ గొడవలు నిరంతరం జరుగుతూ పరిష్కారం మాత్రం జరగకపోతే ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవవు.                                  *రూపశ్రీ.

అత్తాకోడళ్ల బంధాన్ని బలపరిచే మ్యాజిక్ చిట్కాలివి..!

  అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది.  దీనికి కారణం కేవలం బయట సమాజంలో కాదు.. ఇద్దరు వ్యక్తుల మద్య అభద్రతాభావం.  తమ స్థానం ఎక్కడ బలహీనం అవుతుందో అని అత్తగారు,  తనకు తన మాటకు ఎక్కడ విలువ లేకుండా పోతుందో అని కోడలు ఇద్దరూ తమ తమ పంతాలకు పోవడం వల్ల అత్తాకోడళ్ల మధ్య విభేదాలు వస్తుంటాయి. అయితే కొన్ని మ్యాజిక్ చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల అత్తాకోడళ్ల బంధం ఎంతో పదిలంగా,  బలంగా,  సంతోషంగా ఉంటుంది.  ఆ  మ్యాజిక్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. నేటి కోడలే రేపటి అత్తగారు, ఇప్పటి అత్తగారు ఒకప్పుడు కోడలు  అనే మాట వినే ఉంటారు. అత్తగారి జీవితంలో అంచనాలు ఉంటాయి,  అనుభవాలు ఉంటాయి. కానీ కోడలి జీవితంలో ఆధునికత,  కలలు,  భవిష్యత్తు గురించి ఆశలు ఉంటాయి.  ఇవి రెండూ విరుద్దంగా అనిపిస్తాయి. అందుకే అత్తాకోడళ్ల మధ్య వ్యతిరేకత తలెత్తుతూ ఉంటుంది. అంచనాల గురించి ఓపెన్ గా.. కోడలి మీద అత్తకు, అత్త గురించి కోడలికి కొన్ని అంచనాలు ఉంటాయి.  అయితే విషయాన్ని మనసులో పెట్టుకుని ఎదుటి వారు,  వారికి వారే అర్థం చేసుకుని తమకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం పిచ్చితనం. ఇంటి బాధ్యతలు కోడలితో ఏవి పంచుకోవాలని అనుకుంటారో అత్తగారు ఓపెన్ గా చెప్పాలి. అలాగే కోడలు కూడా తన కెరీర్,  ప్రాధాన్యాల గురించి ఓపెన్ గా తన అత్తగారితో చెప్పాలి.  ఎందుకంటే అంచనాలు నెరవేరకపోతే అత్తాకోడళ్ల బంధం దెబ్బతింటుంది. అందుకే ముందే ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటే మంచిది. ప్రేమతోనే సరిహద్దులు.. అత్తాకోడళ్లు ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోవడం వల్ల చాలా గొడవలు జరుగుతుంటాయి.  చాలా సార్లు అత్తలు తమ ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తారు. కానీ అత్తాకోడళ్లు ప్రేమగానే మాట్లాడుకుని తమ సరిహద్దులు విధించుకుంటే చాలా వరకు గొడవలు రాకుండా ఉంటాయి. కానీ ఇద్దరూ ఒకరి విషయాలలో మరొకరు ఎక్కువ జోక్యం చేసుకుంటే పెద్ద గొడవలు జరుగుతాయి. గతం, అనుభవాలు... అత్త జీవితంలో అనుభవాలు చాలా ఉంటాయి. అలాగే కోడలి జీవితంలో అనుభవాలు ఉంటాయి. అత్తగారు తాను జీవితంలో ఎదుర్కున్న సమస్యలు, కుటుంబ పరంగా ఎదుర్కున్న కష్టాలు, చేసిన పోరాటాలు కోడలితో చెప్పుకుంటూ ఉండాలి, కోడలు తన చిన్నతనం తను పెరిగిన విధానం,  తన కష్టం,  భవిష్యత్తు గురించి తన ఆశలు చెప్పుకోవాలి. ఇవి ఇద్దరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. అంతేకాదు.. అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉంటారు.  ఆ ఇల్లు సంతోషంగా, ఎంతో బాగా అబివృద్ది చెందాలంటే అత్తాకోడళ్లు ఇద్దరూ అవగాహనతో ఉండటం ముఖ్యం.   నిర్ణయాలు.. అత్తాకోఢల్లు ఇద్దరూ ఒక్కమాట మీద ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది.  అందుకే ఏ విషయం గురించి అయినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి.  కోడలు ఇలాగే ఉండాలనే నియమాలు విధించడం అత్తగారి గొప్పతనం అనిపించుకోదు, అత్తగారు చెప్పే ఏ విషయం గురించైనా ఆలోచించకుండా వ్యతిరేకత చూపడం కోడలి తెలివి అనిపించుకోదు. అత్తాకోడళ్లు ఇద్దరూ మాట్లాడుకుని వారి ఇగో సాటిసిపై అయ్యే దిశగా కాకుండా జీవితం గురించి, ఇంచి అబివృద్ది గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పొగడ్తలు.. గొప్ప మెడిసిన్.. బంధం ఆరోగ్యంగా ఉండటంలో పొగడ్తలు చాలా గొప్పగా పనిచేస్తాయి.   అత్తగారు ఏదైనా బాగా చేసినప్పుడు కోడలు,  కోడలు ఏదైనా పనిని బాగా చేసినప్పుడు అత్తగారు.. ఒకరిని ఒకరు మెచ్చుకోవడం చేయాలి.  ఇలా మెచ్చుకోవడం ఇద్దరి మద్య బందాన్ని బలంగా మార్చుతుంది. అంతేకాదు.. ఒకరి మంచి అలవాట్లను మరొకరు మెచ్చుకోవడం, ఒకరికి ఒకరు మంచి స్నేహితురాలిగా ఉండటం వల్ల అత్తాకోడళ్ల బందం పదిలంగా ఉంటుంది.                              *రూపశ్రీ.

జ్ఞాపకాలు బాధపెడుతున్నాయా? ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది..!

జ్ఞాపకం అంటే జరిగిపోయిన ఒక సంఘటన తాలుకూ సందర్భాలు, మాటలు,  మనుషులు గుర్తుండిపోవడం.   ఇవి సంతోషం కలిగించేవి అయితే గుర్తు వచ్చిన ప్రతిసారీ సంతోషాన్నే కలిగిస్తాయి. కానీ.. అవి బాధపెట్టే విషయాలు అయితే మాత్రం వాటి ప్రభావం మామూలుగా ఉండదు. కొన్నిసార్లు గత సంఘటనలు,  జ్ఞాపకాలు హృదయంలో లోతైన గాయాన్ని మిగిల్చుతాయి. అలాంటి సమయాల్లో లోలోపలే నలిగిపోతాడు.  చాలా నరకం అనుభవిస్తాడు.  ఒంటరితనం ఫీలవుతాడు. కానీ  ఒంటరిగా అనిపించడం అంటే జీవితంలో చాలా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది.  దీన్నుండి బయటకు రావడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. అంగీకారం.. బాధాకరమైన జ్ఞాపకాల నుండి బయటపడటానికి వాటిని అణచివేయడం కంటే అంగీకరించడం చాలా ముఖ్యం. సత్యాన్ని అంగీకరించడం ముందుకు సాగడానికి మొదటి అడుగు. కాబట్టి జరిగినవి ఏవైనా సరే.. వాటిని అంగీకరించాలి.  ఒకరు మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా,  నష్టం కలిగినా.. ఇలా ఏదైనా సరే..  దాన్ని అంగీకరించి ముందుకు సాగాలి.  ఇలా చేస్తే జ్ఞాపకాలు బాధపెట్టవు. షేరింగ్.. జ్ఞాపకాలు బాధపెట్టినప్పుడు బాధను అందరితో పంచుకోవడం తప్పు. కుటుంబ సభ్యులు,  అర్థం చేసుకునే స్నేహితులు, లేదా కౌన్సిలర్ లతో జరిగింది చెప్పుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను విశ్లేషణ చేసుకుని ఆలోచించే సామర్థ్యం ఉండదు. అదే ఇలా అర్థం చేసుకోగలిగే వారు ఉంటే .. జరిగిన విషయం గురించి మంచి వివరణ, సలహా, ఊరట కలిగే విధంగా మాట్లాడటం వంటివి చేయగలుగుతారు. వ్యక్తీకరణ.. బాధను వ్యక్తీకరించడం కూడా ఒక కళే.. డైరీ రాయడం లేదా కళ-సృజనాత్మకత ద్వారా  భావాలను వ్యక్తపరచడం కూడా ఉపశమనం కలిగిస్తుంది. మనసులో ఉన్న భావాలను కాగితంపై పెట్టడం మంచి చికిత్స. అంతే కాదు.. బాధ నుండి బయటకు రావడానికి ఆ అక్షరాలే సహాయం చేస్తాయి. ధ్యానం, యోగ.. ధ్యానం,  యోగా సహాయం తీసుకోవడం కూడా జ్ఞాపకాల మిగుల్చే బాధ నుండి బయటకు రావడానికి సహాయపడుతుంది. ఇది మనస్సును ప్రశాంతపరచడమే కాకుండా వర్తమానంలో జీవించడం కూడా నేర్పుతుంది. బాధకు సమయం ఇవ్వవద్దు.. బిజీగా ఉండటం,  కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవడం,  ఏదో ఒక కొత్త పనిని చేయడం లేదా నేర్చుకోవడం  వలన జ్ఞాపకాల నుండి దూరం కావడానికి సహాయపడుతుంది.  కొత్త వాటిలో మునిగిపోయినప్పుడు బాధాకరమైన విషయాలు మసకబారుతాయి. అసలు వాటి గురించి ఆలోచించే అంత సమయం ఉండకుండా చూసుకోవాలి. జీవనశైలి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగా తినడం, తగినంత నిద్రపోవడం,  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల  మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు.                                      *రూపశ్రీ.  

న్యాయవాది.. న్యాయానికి వారధి..!

  మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..  రాజ్యాంగం ఈ దేశానికి కొన్ని నియమాలు, నిబంధనలు, షరతలు విధించింది. దేశ పౌరులకు కొన్ని హక్కులు, మరికొన్ని సరిహద్దు గీతలు గీసింది.  వీటి నుండి ఏ వ్యక్తి అయినా అతిక్రమించి ప్రవర్తించినా,  ఇతరులకు నష్టం కలిగించినా,  ఇతరులకు అన్యాయం చేసినా.. అందరికీ న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది.  ఈ న్యాయవ్యవస్థ నుండి ప్రజలకు న్యాయం సమకూర్చి పెట్టడానికి వారధులుగా నిలిచేవారే న్యాయవాదులు.  ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన న్యాయవాదుల దినోత్సవాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్బంగా జరుపుకుంటారు. ఈ సందర్బంగా సమాజంలో న్యాయవాదుల పాత్ర.. న్యాయ వ్యవస్థకు వారి సేవల గురించి తెలుసుకుంటే.. న్యాయానికి వారధులు.. ప్రతి వ్యక్తి  తనకు అన్యాయం జరుగుతోంది అంటే చట్ట బద్దంగా న్యాయాన్ని అర్థించాలంటే దానికి  న్యాయవాదుల సహాయం,  వారి సలహా చాలా అవసరం.  న్యాయవాదులే న్యాయస్థానానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తారు. రాజ్యాంగం ప్రజలకు కేటాయించిన హక్కులను,  రాజ్యంగం పేర్కొన్న నియమాలు, షరతుల ఆధారంగా న్యాయాన్ని చేకూర్చడంలో సహాయపడతారు. కర్తవ్యం.. చాలామంది మేము న్యాయవాదులం అని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా గర్వంగా చెప్పుకోవడం అనేది కేవలం న్యాయవిద్య అభ్యసించి న్యాయవాదులు అయిపోగానే వచ్చేది కాదు.. న్యాయవాదికి అసలైన గౌరవం,  అసలైన గుర్తింపు వచ్చేది బాధితులకు, న్యాయం కోసం తనను ఆశ్రయించిన వారికి న్యాయం జరిగేలా చూసినప్పుడే. అందుకే న్యాయవాది కర్తవ్యం ఏమిటంటే బాధితులకు న్యాయం జరిగేలా చూడటం. అప్పుడే తన  కర్తవ్యాన్ని తను సరిగా నిర్వర్తించినట్టు. వృత్తి-దుర్వినియోగం.. ప్రతి వ్యక్తి తను  చేపట్టే వృత్తి ద్వారానే తన జీవనం సాగిస్తుంటాడు. అలాగే న్యాయవాదులు కూడా తమకు వచ్చే ఆదాయం ద్వారానే తమ జీవితాన్ని సాగిస్తుంటారు.  కానీ చాలా వరకు ఇందులో ఆదాయం గురించి స్పష్టత ఉండదు. తమకు  కేసులు లేకపోతే ప్రైవేటు లాయర్ల జీవనం, వారి కుటుంబ పోషణ సమస్యగా మారుతుంటుంది.  అందుకే కొందరు తప్పటడుగు వేస్తారు.  డబ్బు కోసం న్యాయానికి విరుద్దంగా కూడా ప్రవర్తిస్తారు.  కొన్నిసార్లు న్యాయం వైపు నిలబడ్డామని చెబుతూ అన్యాయం వైపు సమర్థిస్తూ బాధితులను మోసం చేస్తుంటారు.  ఇదంతా చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. కానీ కేసులు, ఆస్తులు,  ఆర్థిక విషయాలు అయితే ఇలాంటివి కోల్పోయిన వ్యక్తులు తిరిగి కోలుకుని మళ్ళీ జీవిత పోరాటంలో పడిపోవచ్చు. కానీ .. మానవ సంబంధాలు,  ప్రాణానికి నష్టం కలిగించిన వ్యక్తులు  ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడకుండా చేయడం వల్ల న్యాయ విద్యను అభ్యసించి దాన్ని దుర్వినియోగం చేసినవారవుతారు. ఇలాంటి వారి వల్ల న్యాయ వ్యవస్థకు చాలా నష్టం జరుగుతుంది. అటు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అందుకే న్యాయ విద్య అభ్యసించడం అంటే ఒక గొప్ప శాస్త్రాన్ని తమ చేతిలో ఆయుధంగా పట్టుకోవడం. న్యాయవాదులు తమ ప్రతిభను నిందితులను కాపాడటానికి బదులుగా బాధితులకు న్యాయం జరిగేలా చేయడానికి వినియోగించాలి. అప్పుడే న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది.  అన్యాయానికి అడ్డుకట్ట పడుతుంది.                            *రూపశ్రీ.

డాక్టర్ రాజేంద్రప్రసాద్ జయంతి.. న్యాయవాదుల దినోత్సవం నేడు..!

  కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు. ప్రజలకు న్యాయాన్ని చేకూర్చడంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషిస్తారు.  ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న, భారతదేశంలోని న్యాయవాదుల సంఘం న్యాయవాదుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది . ఇది భారతదేశపు మొదటి రాష్ట్రపతి, భారతదేశ ప్రముఖ న్యాయవాది అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి  గురించి తెలుసుకుంటే.. డాక్టర్ రాజేంద్రప్రసాద్.. రాజేంద్ర ప్రసాద్ డిసెంబర్ 3, 1884న జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో,  కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. మొదట్లో రాజేంద్రప్రసాద్ గారు సైన్స్ విద్యార్థి. 1907లో ఆయన ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసి బోధన వృత్తిలో అడుగుపెట్టారు. 1909లో ప్రసాద్ న్యాయశాస్త్రం అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. 1910లో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ పూర్తి చేసి, 1915లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని అందుకున్నాడు. మరుసటి సంవత్సరం రాజేంద్రప్రసాద్ గారు బీహార్- ఒడిశా హైకోర్టులో చేరారు. భాగల్పూర్ నగరంలో కూడా న్యాయవాద వృత్తిని చేపట్టారు. న్యాయవాదిగా ఆయన  కెరీర్ చాలా అద్బుతంగా ఉండేది, కానీ 1920లో స్వాతంత్ర్య ఉద్యమానికి సహాయం చేయడానికి ఆయన పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాడు. 1937లో ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. 1950లో రాజ్యాంగం ఆమోదించబడిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.  ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చి విద్యాభివృద్ధికి దోహదపడినవారు రాజేంద్రప్రసాద్ గారే.. అందుకే ఆయన జయంతిని న్యాయవాదుల దినోత్సవంగా  జరుపుకుంటున్నారు.                             *రూపశ్రీ.  

ఎవరైనా మిమ్మల్ని పదే పదే అవమానిస్తే ఇలా చేయండి.. అవతలి వారు నోరు మూసుకుంటారు..!

  సరదా.. చాలా సహజంగా అనిపించే విషయం. చాలామంది సాధారణంగా మాట్లాడే సమయంలో సరదా పేరుతో కొన్ని జోక్స్ వేయడం లేదా కొన్ని మాటలు అనడం చేస్తుంటారు. ఆ సందర్భానికి అది పెద్దగా తప్పని అనిపించకపోయినా మరుసటి రోజు లేదా కొన్ని రోజుల తరువాత ఆలోచిస్తే అది చాలా అవమానంగా అనిపించవచ్చు. ముఖ్యంగా సరదా పేరుతో అనే కొన్ని మాటలు ఒకసారి అయితే సరదాగానే ఉంటుంది. కానీ పదే పదే ఆ మాటను అనడం లేదా పదే పదే అదే విధంగా ప్రవర్తించడం చేస్తుంటే అది అవమానించడం అవుతుంది.  ఇలా సరదా మాటున జరిగే అవమానాన్ని చాలామంది పంటి బిగువున భరిస్తుంటారు.  కొందరు అదే పనిగా సరదా అనే ఒక తెరను అడ్డు పెట్టుకుని మరీ మనుషుల్ని నొప్పిస్తుంటారు. ఈ పరిస్థితిని అధిగమించాలన్నా.. సరదా పేరుతో మిమ్మల్ని ఇతరులు పదే పదే అవమానించకూడదు అన్నా కింద చెప్పుకునే విధంగా మీ ప్రవర్తనను మార్చుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని వెక్కిరిస్తుంటే లేదా ఏదైనా వ్యక్తిగత వ్యాఖ్య చేస్తే, మీరు ఆ స్థలంలో ప్రశాంతంగా ఉండాలి . వెంటనే రియాక్ట్ కాకుండా ఉండాలి. ఎదుటి వ్యక్తి  ఏమి చెబుతున్నాడో,  ఎందుకు చెబుతున్నాడో  పూర్తిగా అర్థం చేసుకోవాలి. సరైన సమయం వచ్చినప్పుడు, ఆ ప్రశ్నకు మర్యాదగా, ముక్కుసూటిగా  సమాధానం ఇవ్వాలి. తాము అనే మాటలకు సమాధానం వస్తుంటే ఇంకోసారి అలా అనే సాహసం చెయ్యరు చాలావరకు.  కాబట్టి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు సున్నితంగానే చెప్పు దెబ్బ కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి. చాలా సార్లు ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు,  మిమ్మల్ని దూషించినప్పుడు. ఎవరైనా మిమ్మల్ని ఇతరుల ముందు అవమానించిన ప్రతిసారీ  రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. సమాధానం ఇవ్వడం కరెక్ట్ అనుకుంటారు కానీ.. ఎదుటి వారు అన్న మాటలకు అప్పటికే మనసులో కోపం పుట్టి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది వక్తి  మానసిక స్థితిని కూడా పాడు చేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు తర్కం,   ఆలోచనాత్మకత మరచిపోతుంటారు.  కాబట్టి వెంటనే రియాక్ట్ కాగండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే వెంటనే ఫీలైపోనక్కర్లేదు.  ఫీలవుతూ కోపంగా రియాక్ట్ అవ్వడం కంటే  నవ్వుతూనే చురకలు అంటించడం మంచిది. ఇలా చేస్తే ఇంకోసారి మీ జోలికి రాకుండా ఉంటారు.. ఇతరులు ఎలాగైతే సరదా పేరుతో మిమ్మల్ని  అంటున్నారో మీరు అదే సరదా మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ సరదాకు కాస్త చిరునవ్వు కూడా జోడించాలి. ఎవరైనా మిమ్మల్ని అవమానించడానికి ట్రై చేస్తున్నా,  పదే పదే అవే సంఘటనలు ఎదురవుతున్నా  ముందుగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఇతరులు అన్న విషయాన్ని చెడ్డ పదజలాంతో కాకుండా మర్యాదపూర్వకంగా ఉండే మాటలతోనే గట్టి సమాధానం చెప్పాలి. ఇలాచేస్తే మీరు చెప్పేది తప్పని ఎవరూ అనరు.  మర్యాదగానే మాట్లాడారనే మార్క్ మీకు ఉంటుంది.  మిమ్మల్ని అవమానించిన వారికి సమాధానం చెప్పామనే తృప్తి మీకూ ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానించినా, అర్థం చేసుకోకున్నా అది మీ తప్పు కాదు, ఎదుటివారి తప్పు. ఎవరో ఏదో అనగానే మీరు తప్పేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు.  మనం ముందుకు సాగుతూనే ఉండాలి. ప్రపంచంలోని ఎంకరేజ్ చేసేవారికంటే.. ఎగతాళి చేసి వెనక్కు లాగడానికి ట్రై చేసే వారే ఎక్కువ మంది ఉంటారని, మనుషుల్ని బాధపెట్టడానికే ముందుకు వస్తారని గుర్తుంచుకోవాలి. అలాంటివారి మాటలను వదిలిపెట్టి  ముందుకు వెళ్లడమే అందరూ చేయాల్సిన పని.                                             *రూపశ్రీ.

ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందా లేదా? ఇలా తెలుసుకోండి..!

  ప్రేమ ఇప్పట్లో స్కూల్ పిల్లల మధ్యన కూడా వినిపిస్తున్న మాట. కాలేజీ వయసు వచ్చేసరికి ప్రేమ పేరుతో శృతి మించిపోయేవారు కూడా అధికంగా ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ అనేది చాలా వరకు కనిపించట్లేదు. ఆకర్షణ లేదా స్వార్థం కోసం చాలామంది చనువు పెంచుకుని దాన్నే ప్రేమ అని పిలుస్తున్నారు కూడా.  ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందా లేదా? తెలుసుకోవడం ఎలా అని చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. అయితే నిజమైన ప్రేమ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కొన్ని విషయాలు చాలా దోహదపడతాయి. అవేంటో తెలుసుకుంటే.. చాలామంది లవ్ పార్టర్ నుండి ఖరీదైన బహుమతులు ఆశిస్తుంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి  అని అడుగుతూ ఉంటారు కూడా. ఒకవేళ డిమాండ్ కు తగ్గట్టు ఏమైనా ఇవ్వకపోతే నీకు అసలు నా మీద ప్రేమ లేదు అనేస్తుంటారు. ఇలా ఖరీదైన బహుమతులు ఇస్తేనే ఇద్దరి  మధ్య ప్రేమ ఉందని అంటూంటే ఆ రిలేషన్ లో ప్రేమ లేదని అర్థం. ప్రేమ ఉన్నంత మాత్రానా అన్నీ ఓపెన్ గా చెప్పేయాలని కాదు అర్థం. ప్రేమలో ఉన్న భాగస్వామి వ్యక్తిగతానికి సంబంధించిన పాస్వర్డ్ లు, ఇతర విషయాలు చెప్పమని బలవంతం చేస్తుంటారు కొందరు. ఇలా చేసేవారి  మధ్య ప్రేమ లేనట్టేనని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.  అలాంటి బంధాలు ఎక్కువ కాలం నిలవడం కూడా కష్టమేనట. ఎప్పుడైతే ఒకరి స్పేస్ ను గౌరవిస్తామో.. అప్పుడే ప్రేమ కూడా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య స్పేస్ అనేది చాలా ముఖ్యం. ఒకరి గురించి మరొకరికి ప్రతీదీ తెలియాలి అనుకునే మెంటాలిటీ చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికి పోసెసివ్ నెస్ ఎక్కువ కూడా. అయితే ఇలాంటి వారి మధ్య కూడా   ప్రేమ కంటే అభద్రతా భావమే ఎక్కువ ఉంటుంది. అభద్రతా భావం ఉన్న రిలేషన్ లో వ్యక్తి పట్ల నమ్మకం, ప్రేమ అనేవి ఉండవు. రానురాను అభద్రతాభావం కాస్తా అనుమానంగా మారే అవకాశం కూడా ఉంటుంది. లవ్ లో ఇద్దరి మధ్య స్పేస్ తగినంత ఉండకపోవడమే కాదు.. అస్సలు  భాగస్వామిని పట్టించుకోకుండా  తన మానాన తనును  ఉండనివ్వడం కూడా ప్రేమ లేకపోవడాన్ని సూచిస్తుంది.  ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు సాధారణమైన విషయాలను అంతగా పట్టించుకోకుండా ఎలా లైట్ తీసుకుంటారో.. తన పార్ట్నర్ కు ఏం కావాలి? ఏం అవసరం అనేది పట్టించుకోవడం బాగోగులు, అవసరాల గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఏదైనా ఒక పని చేయాలని అనుకొనేటప్పుడు ఖచ్చితంగా చెప్పే చేయాలి అనే మెంటాలిటీ ఉంటే మాత్రం ఆ ఇద్దరి మధ్య ప్రేమ కొరవడినట్టే. అందులో ఆధిపత్యం, అహంకారం, తన భాగస్వామికి స్వేచ్ఛ ఇవ్వకపోవడం వంటివి ప్రేమను డామినేట్ చేస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ కు చాలాప్రాముఖ్యత ఉంది. భాగస్వామి కంటే ఫోన్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నా, ఫోన్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నా.. పార్ట్నర్ మీద ప్రేమ విషయంలో ఆలోచించుకోవాల్సిందే. అంతేకాదు.. భాగస్వామి ఫోన్ చెక్ చేయడం,  ఫోన్ లో జరిగే ప్రతి కార్యకలాపం తనకు తెలిసే జరగాలని అనుకోవడం.. అలాంటివన్నీ ప్రేమకంటే ఎక్కువ అభద్రతాభావం, అనుమానం లాంటి వాటిని బలపరుస్తాయి. కాబట్టి అలాంటివి ఉన్న బంధం ప్రేమ అనుకోవడం పొరపాటు.                                                        *రూపశ్రీ.

ఒకరి ఫోన్ లను మరొకరు చెక్ చేయడం.. రిలేషన్‌కు ఎంతవరకు మేలు చేస్తుంది..!

  ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు. నిజానికి ఇలా పోన్ చెక్ చేయడం అనే విషయం కారణంగా గొడవలు పెరిగి భార్యాభర్తల మద్య నమ్మకం కోల్పోయి, విడిపోవడానికి దారి తీస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఫోన్ చూడటంలో ఏముంది?  ఇదేం పెద్ద విషయం కాదే.. అన్నట్టు అనిపిస్తుంది చాలామందికి. కానీ ఇది బయటకు వివరించలేని సమస్యలను క్రియేట్ చేస్తుంది. అసలు భార్యాభర్తలు  ఒకరి ఫోన్ ను మరొకరు చెక్ చేయడం అనే విషయం బంధాన్ని ఎంత దెబ్బతీస్తుందో దీని వల్ల కలుగుతున్న నష్టాలేంటో తెలుసుకుంటే.. పెళ్లైపోయింది.. భార్యాభర్తలు అయిపోయాం.. ఇక నీకు నాకు మధ్య దాపరికం ఏముంటుంది? ఫోన్ చూస్తే తప్పేంటి? ఇది చాలా మంది బార్యలు లేదా భర్తలు చెప్పే మాట. ఇందులో నిజమే ఉన్నా.. పోన్  లో ఏదో దాపరికం లేదా రహస్యం ఉంటుంది కాబట్టే ఫోన్ చూడద్దు అని అంటున్నారు అనుకోవడం చాలా పొరపాటు. ఫోన్.. వ్యక్తిగతం.. చాలమంది ఫోన్ లో పర్సనల్ ఉంటుంది అనుకుంటారు. ఇది చాలా వరకు అందరూ కరెక్ట్ అనుకుంటారు. నిజానికి వ్యక్తిగతం అనేది జీవితానికి సంబంధించిన విషయం. కానీ ఫోన్ లో ఉండేది కేవలం సోషల్ మీడియా జీవితం.  స్నేహితులతో చాటింగ్ చేసినా, ఆఫీసు వ్యక్తులతో కాంటాక్ట్ అవుతున్నా,  ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నా, ఫోన్ లు మాట్లాడుతున్నా అవన్నీ ఔటాఫ్ రిలేషన్ విషయాలు.  పదే పదే ఫోన్ చూడటం, విషయాల గురించి గుచ్చి గుచ్చి అడగటం,  బయటి వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడటం వంటివి బంధాన్ని దెబ్బతీస్తాయి.  ఇలా మాట్లాడటం వల్ల బంధంలో నమ్మకం బలహీనం అవుతుంది. తప్పేం కాదు... కానీ.. భార్యాభర్తలు ఒకరి ఫోన్ ను మరొకరు చూడటం తప్పేమీ కాదు..కానీ  ఒకరిని మరొకరు అనుమానించినట్టు, అవమానించినట్టు బిహేవ్ చేయడం మాత్రం చాలా తప్పు. చాలామంది మగాళ్లు పెళ్లయ్యాక భార్య గురించి ప్రతిదీ తనకు తెలియాలని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి వ్యక్తికి కొన్ని మినహాయింపులు ఉండాలి.   నమ్మకం.. అనుమానం.. పదే పదే విసిగిస్తుంటే దాన్నివేదింపుగా అనుకుంటారు. ఇదే నెమ్మదిగా అనుమానం అనే జబ్బుగా మారుతుంది.  కానీ భార్యాభర్తలు ఇద్దరూ ఏ విషయాన్ని అయినా ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటే అసలు అనుమానం అనే మాటే ఇద్దరి మధ్య ఉండదు.  నువ్వు తప్పక చూపించాల్సిందే లాంటి డిమాండ్లు లేకుండా వారి పోన్ లు చూపించమని అడగడానికి ముందు మీరే వారికి మీ పోన్ చూపిస్తూ ఉంటే  వారిలో క్రమంగా మార్పు వస్తుంది. అప్పుడే నమ్మకం బలపడుతుంది. ఇగో నే.. గోల.. చాలామంది ఇలా పోన్ చూడటం అనే విషయాన్ని క్యారెక్టర్ ను అవమానించడం,  అహం దెబ్బతినడం అని చెబుతూ ఉంటారు. నిజానికి నేటి జెనరేషన్ లో  ఇగో వల్లనే బంధాలు దెబ్బతింటాయి. అయితే ఇగోను పదే పదే రెచ్చగొట్టడం కూడా మంచిది కాదు.  పెళ్లైన కొత్తలో మాత్రం ఇలాంటి విషయాలలో ఎంత లైట్ గా ఉంటే అంత మంచిది.   ఒకప్పుడు.. భార్యాభర్తల మధ్య దాపరికం ఏముంటుంది? మేమేమన్నా అలాగే చేస్తున్నామా అని వెనుకటి తరం వాళ్లు చెబుతుంటారు.  కానీ స్మార్ట్ ఫోన్ లు అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ తరం వేరు.. బంధం ముడిపడ్డాక ఆ బంధం బలపడాలంటే అన్ని విషయాలు గీసి రెచ్చగొట్టుకోవడం ఆపాలి. అందుకే ఈ జెనరేష్ వాళ్లు బంధం బాగుండటానికి ఇతర విషయాలను పట్టించుకోవడం మానేయాలి. ఆధారపడటం.. భార్య భర్త మీద, భర్త భార్య మీద ఆధారపడటం అనేది బంధాన్ని నిలబెట్టే విషయం.  భార్య ఇంటిపని, వంట పని చేసి భర్తకు అన్ని సమకూర్చడంలో అతను భార్య మీద ఎలా ఆదారపడతాడో.. తనకు కావలసిన వస్తువైనా, వేరే ఏదైనా భర్త ను అడగడం పట్ల భార్య అలాగే ఉండాలి.   డబ్బు..   బార్యాభర్తల మధ్య డబ్బు కూడా చాలా పెద్ద గొడవలు సృష్టిస్తుంది.  భార్య తనది కాబట్టి ఆమె కష్టార్జితం తనదే అనుకునే భర్తలు ఉంటారు.  తాను సంపాదిస్తున్నాను కాబట్టి భర్త జోక్యం చేసుకోకూడదు అనుకునే భార్యలు కూడా ఉంటారు. కానీ బార్య సంపాదించినా అవసరం, సందర్భం వస్తే ఆమె ఎప్పుడైనా ఇచ్చేది భర్తకే.. అలాగే భర్త కూడా ఎప్పుడూ తను సంపాదించే డబ్బుతోనే  భార్యను చూసుకోవాలని,  బార్య సంపాదన పర్మినెంట్ అనే ఆలోచన చేయడం మానుకోవాలి.   పైనల్ గా.. భార్యాభర్తలు ఒకరి పోన్ ఒకరు చూడటం తప్పు కాదు.. అలాగని పోన్ చూడకపోవడం, చూడనివ్వకపోవడం అంటే అందులో ఏదో రహస్యం ఉంటుందని కాదు.. అర్థం చేసుకోవడం, ప్రాముఖ్యత ఇవ్వడంలోనే అంతా ఉంటుంది.  కానీ ఎప్పుడూ అనుమానాన్ని ప్రోత్సహించకూడదు.                                *రూపశ్రీ.

బ్రేకప్ అని  బాధపడేవాళ్ల కళ్లు తెరిపించే విషయాలివి..!

జీవితం చాలా విచిత్రమైనది. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు,  ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు.  కానీ చాలామంది రేపు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశాభావంతో ఉంటారు.  ప్రతీది ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని అంచనాలు కూడా పెట్టుకుంటారు.  అలాంటి వాటిలో మనుషులతో కలిగే అనుబంధాలు చాలా ముఖ్యమైనవి. ప్రేమ కావచ్చు, భార్యాభర్తల బందం కావచ్చు.  రేపు ఇలా జరిగితే బాగుంటుంది,  మేమిద్దరం ఇలా ఉంటే బాగుంటుంది అని ఇద్దరిలో ఎవరో ఒకరు అనుకుంటూ ఉంటారు. కానీ బంధం విచ్చిన్నమైనప్పుడు, ఎంతగానో ప్రేమించిన వ్యక్తి తమను వదిలి వెళ్లిపోయినప్పుడు ప్రపంచం అంతా శత్రువుగా అనిపిస్తుంది. బ్రేకప్ అనేది చాలా బాధపెట్టే విషయం.  చాలామంది బ్రేకప్ జరిగితే గత ఆలోచనలు జ్ఞాపకాలలో ఉంటూ, అక్కడే స్టక్ అయిపోయి ఎప్పుడూ వదిలి వెళ్ళిన వారినే తలచుకుంటూ ఉంటారు. కానీ బ్రేకప్ గురించి కొన్ని విషయాలు తెలిస్తే తాము చేస్తున్నది తప్పా లేక ఒప్పా అనే విషయం చాలా సులువుగా అర్థమైపోతుంది. బ్రేకప్ గురించి అందరూ తెలుసుకోవలసిన విషయాలేంటంటే.. బంధం.. తప్పు.. ఒప్పు.. చాలామంది ఒక బంధంలో ఉన్నప్పుడు తప్పు ఏది,  ఒప్పు ఏది,  తాము చేస్తున్నది కరెక్టా కాదా అనే విషయాలు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు.  వారి ఎమోషన్ వారిని ఏమీ ఆలోచించుకోనివ్వదు. బ్రేకప్ అనేది జరిగితే చాలా మంది అనుకునేది ఒక్కటే.. కాలం అన్నీ నయం చేస్తుంది అని.  కానీ నిజం ఏంటంటే.. కాలం అన్నీ నయం చేయదు. కాలం నయం చేయాలంటే మారడానికి ముందు మనిషి సిద్దంగా ఉండాలి. అంతేకానీ కాలం నయం చేస్తుంది అనుకుంటూ పదే పదే గతంలో తిరుగాడుతూ ఉంటే కాలం నయం చేయకపోగా మనిషిలో శూన్యాన్ని పెంచుతుంది. తమను తాము కోల్పోవడం.. బ్రేకప్ అనేది జరిగినప్పుడు, మనస్ఫూర్తిగా అవతలి వ్యక్తిని ఇష్టపడినప్పుడు చాలామంది అనుకునే మాట.. తమను తాము కోల్పోయాము అని. మరీ ముఖ్యంగా తమ పార్ట్నర్ కోసం అన్నీ వదిలేసుకున్నవారు ఉంటారు. అలాంటి వారు మోసపోతే తాము ఇంత చేసినా ఎందుకు మోసపోయాం అనే విషయాన్ని అర్థం చేసుకోలేక ఆలోచనలతో పిచ్చివాళ్లుగా మారుతుంటారు.   విడిపోవడం సులువే.. కానీ బాగుచేయడమే.. ఒక బంధాన్ని విడదీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ తిరిగి బంధాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం. ఇది చాలా మంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం కూడా. కారణాలు ఏవైనా కావచ్చు.. బంధాలు మెల్లిగా విచ్చిన్నం అయిపోతాయి.  తీరా బంధాలు విచ్చిన్నమయ్యాక ఎందుకు ఇలా జరిగింది, దీన్ని తిరిగి నిలబెట్టుకోలేమా? అని ఆలోచిస్తూ ఉంటారు. బంధానికి బేస్.. ఒక్కసారి బ్రేకప్ అయ్యాక చాలామంది నిరాశ, విరక్తి, వైరాగ్యంలోకి వెళుతూ ఉంటారు. కానీ చాలామంది అర్థం చేసుకోని విషయం, ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. బంధం ఎందుకు విచ్చిన్నం అయింది, ఎక్కడ తప్పు జరిగింది? తప్పు ఎవరిలో ఉంది? ఇవన్నీ ఆలోచించిన తరువాత అర్థమయ్యే విషయం ఒకటే.. బంధాలు కేవలం ప్రేమ పైనే నిలబడవు.. బంధాలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి గౌరవం,  మాట్లాడే విధానం,  బాలెన్స్డ్ గా ఉండటం మొదలైనవన్నీ చాలా అవసరం. బ్రేకప్ నేర్పించే విషయాలు ఇవీ.. మనకు ఎవరు సరైనవారు,  ఎవరు కాదు అనే విషయం నేర్పేది బ్రేకప్పే.. అలాగే ఒక వ్యక్తి వల్ల ప్రేమగా, సంతోషంగా ఉంటున్నామా లేక జీవితం యాంత్రికంగా సాగుతోందా అనేది కూడా బ్రేకప్పే నేర్పుతుంది. ప్రేమించడం ముఖ్యమే.. కానీ సెల్ఫ్ లవ్ అనేది మరింత ముఖ్యం.  అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ముఖ్యం.  అవతలి వ్యక్తి ఎంత ప్రేమ చూపించినా సరే. ఎప్పుడూ తమను తాము తగ్గించి, తమ వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం లేదు.   తన ఆలోచనలకు, తన నిర్ణయాలకు తప్ప,  తన జీవితంలోకి వచ్చిన ఒక మనిషికి  విలువ ఇవ్వని వ్యక్తి వెళ్ళిపోయినందుకు బాధపడటం అనేది సహజమే. మంచితనం ఉన్న ప్రతి ఒక్కరూ, నిజంగా ప్రేమించిన వారు ఇట్లా బాధపడతారు. కానీ వారి ఆలోచనలతో,  వారి జ్ఞాపకాలతో  అక్కడే ఆగడం చాలా తప్పు.                                *రూపశ్రీ.

క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..!

క్రమ శిక్షణ ప్రతి వ్యక్తి జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతుంది.  క్రమశిక్షణతో ఉన్నవారికి,  క్రమశిక్షణ లేనివారికి మధ్య తేడాను గమనిస్తే ఇది ఇట్టే అర్థమైపోతుంది.  క్రమశిక్షణ  ఉన్న వ్యక్తులు జీవితంలోని ప్రతి విషయంలో ఒక స్పష్టమైన దారిని అనుసరిస్తారు. వీరి ప్రవర్తన, ఆలోచనలు, పనితీరు, ఆచరణ.. all reflect their structured mindset అని చెప్పవచ్చు. క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వ్యక్తులు బోలెడు మంది ఉంటారు.  వీరిలో ఉండే లక్షణాలు స్పష్టంగా తెలుసుకుంటే.. సమయపాలన (Time Management).. క్రమశిక్షణ గల వ్యక్తులు సమయాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. వారు ఎప్పటికప్పుడు ప్లాన్ ప్రకారమే పనిచేస్తారు. అపాయింట్‌మెంట్లు, డెడ్‌లైన్లు, సమావేశాలు.. ఇవన్నీ సమయానికి ముందుగానే పూర్తి చేస్తారు. లక్ష్యాలు స్పష్టంగా ఉండటం (Clarity of Goals).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు వారి జీవిత లక్ష్యాలు, దాని చేరుకునే దారులు స్పష్టంగా ఉంటాయి. వీరు చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టి దశల వారీగా సాధించడానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప పెద్ద లక్ష్యాలను ఒకే సారి సాధించాలి అనుకోరు. ఆత్మ నియంత్రణ (Self-Control).. క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఇష్టాయిష్టాలు, ప్రలోభాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. పని సమయాల్లో ఫోన్, సోషల్ మీడియా వంటి ధ్యాసలను దూరంగా ఉంచగలుగుతారు. ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద మాత్రమే ఏకాగ్రత నిలపగలుగుతారు.   స్థిరత్వం (Consistency).. చాలా మంది అదేవిధంగా పని చేయాలంటే ఒత్తిడి లేదా అసహనానికి లోనవుతూ ఉంటారు. కాన క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు మాత్రం ఒకే విధంగా నిరంతరం పని చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇదే  వీరిలో ప్రత్యేకత. అదేవిధంగా రోజూ వ్యాయామం, చదువు, పని మొదలైన వాటిని నిరంతరంగా చేస్తూ ఉంటారు. బాధ్యత (Responsibility).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఏదైనా పనిని ఇతరులు చెప్పేవరకు అలాగే నిరీక్షిస్తూ కూర్చోరు.  ఇతరులతో చెప్పించుకోకుండా తమ పని తామే చేసుకుంటారు. తప్పులు జరిగినప్పుడు తప్పును ఒప్పుకుని పరిష్కరించడానికి ముందుంటారు. శ్రమతో కూడిన జీవితం (Hardworking Nature).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకుంటారు.  చేయాల్సిన పనులను వెంటనే చేసేతారు తప్ప పనుల్ని వాయిదా వేసే గుణం అస్సలు ఉండదు.  శ్రమించడం వల్ల ఎంత సమయం, శక్తి పోతుందన్న భయం ఉండదు. క్రమబద్ధత (Organization).. క్రమ శిక్షణ కలిగిన వ్యక్తులు తమ వస్తువులను కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు.   టేబుల్, గదులు, డాక్యుమెంట్లు ఇలా చాలా అన్ని సమర్థవంతంగా పెట్టుుంటారు. వీరితో ఏవైనా చర్చలు జరిపితే ఆ చర్చల్లోనూ, రచనలలోనూ స్పష్టత, క్రమబద్ధత కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన శ్రద్ధ (Health Discipline).. ఆహారం, నిద్ర, వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో చక్కగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటేనే క్రమశిక్షణగా ఏ పనిని అయినా చేసుకోగలుగుతాం అని వీరు నమ్ముతారు.  అందుకే ఎప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు. చెడు అలవాట్లు అంటే వీరికి అసహ్యం. అదేవిధంగా సోమరితనంగా ఉండేవారు,  చెడు అలవాట్లు కలిగిన వారు అంటే వీరికి గిట్టదు. ఇలాంటి వారికి దూరంగా ఉంటారు. స్వీయ ప్రేరణ (Self-Motivation).. ఎవరూ చెప్పకుండానే తాము ముందుగా ప్రేరణ పొందడం వీరిలో గొప్ప లక్షణం. ఎవరో వచ్చి వీరిని ఉత్సాహ పరిచి ముందుకు నెట్టాల్సిన అవసరం లేదు.   ఒక పని పూర్తి చేయాలనే ఉత్సాహం లోపల నుంచే వస్తుంది. ఎప్పటికప్పుడు మెరుగుదల (Continuous Improvement).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఎప్పుడూ చేసే పని  పట్ల ఉదాసీనంగా ఉండరు.  ఈ పనిని ఇంకా బాగా చేయవచ్చా? ఈ పని గురించి ఇంకా విభిన్న కోణాలు ఉన్నాయా?  వంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. తద్వారా వీరు ఎప్పటికప్పుడు తమ పనితీరును, జీవితాన్ని మెరుగుపరుచుకుంటూనే ఉంటారు.                                             *రూపశ్రీ.