చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మరి కొద్ది సేపటిలో తీర్పు

స్కిల్ కేసులో సీఐడీ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ పూర్తయినా రెండు రోజులుగా తీర్పు వాయిదా పడుతూవస్తున్నది. ఇందుకు కారణం ఏపీ హైకోర్టులో చంద్రబాబు స్వాష్ పిటిషన్ పై కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండడమే. ఆ తీర్పును బట్టే ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం (సెప్టెంబర్ 21) ఉదయం కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువరిస్తామన్న ఏపీసీ కోర్టు న్యాయమూర్తి తొలుత మధ్యాహ్నానికి, ాతరువాత సాయంత్రానికి చివరికి  శుక్రవారం (సెప్టెంబర్ 22)కి వాయిదా వేసింది.

మళ్లీ శుక్రవారం (సెప్టెంబర్ 22) ఉదయం తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఒక వైపు సీఐడీ కస్టడీ పిటిషన్ పై తీర్పు ఏ విధంగా ఉంటుందన్న ఉత్కంఠ కొనసాగుతుంటే.. అంత కంటే ఎక్కువగా బాబు స్క్వాష్ పిటిషన్ పై తీర్పు ఎప్పుడు వెలువడుతుంది? ఆ తీర్పు ఎలా ఉంటుంది? అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ పై శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు తీర్పు వెలువడనుంది. అయితే అంతకు ముందు చంద్రబాబు రిమాండ్ గడువు పూర్తి కావడంతో  శుక్రవారం ఉదయం (సెప్టెంబర్ 18) న వర్చువల్ గా చంద్రబాబును కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో చంద్రబాబు రిమాండ్ ను కోర్టు రెండు రోజులు పొడిగించింది.  

ఈ సందర్భంగా చంద్రబాబు న్యాయమూర్తికి తన వాదన వినిపించారు. అక్రమ కేసులో  అన్యాయంగా తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు.  నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తనను స్కిల్ కేసులో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసిందని పేర్కొన్నారు.  ఈ కేసులో తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సి ఉందని, ఏపీ సీఐడీ అలా చేయలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన అరెస్టు జరిగిందని చెప్పారు.  తనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనన్నారు. నిర్ధారణ కాని ఆరోపణలతో అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.  చట్టాన్ని తాను గౌరవిస్తానన్నారు.  కాగా జైలులో సౌకర్యాలపై  జడ్జి  చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.   జైల్లో ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారుఅంతే కాకుండా న్యాయమూర్తి చంద్రబాబుతో మీ మీద వచ్చినవి ఆరోపణలు మాత్రమేనన్నారు. దీన్ని మరోలా అర్ధం చేసుకోవద్దని అన్నారు. 

Teluguone gnews banner