ఏపీ లో ఒక్క రోజులో 61 పాజిటివ్ కేసులు: జవహర్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 6,928 నమూనాలు పరీక్ష చేస్తే 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 61, 216 టెస్టులు చేశామని, మిలియన్ మందికి 1147 టెస్టులు చేసి దేశంలో నే అగ్రస్థానంలో ఉన్నామని, రాష్ట్రంలో కరోనా కేసుల శాతం 1.66 ఉందని, మిగిలిన రాష్ట్రాల తో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆయన వివరించారు. 

శ్రీకాకుళం జిల్లాలో 3 పాజిటివ్ కేసులు తేలాయని, పాత పట్నం మండలానికి చెందిన వీరిని ఆస్పత్రికి తరలించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో క్లస్టర్లు 196 కి పెరిగాయి.122 పట్టణ ప్రాంతాల్లో 74 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.కోవిడ్ రోగుల్లో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గటం సహజం ఇందుకోసం 1900 పల్స్ ఆక్సీ మీటర్లు తెప్పించామని జవహర్ రెడ్డి చెప్పారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్  సాచురేషన్ లెవెల్ ను పరీక్ష చేసి తక్షణమే అందించాలని కోవిడ్ ఆస్పత్రులకు సూచనలు చేశామన్నారు.

Teluguone gnews banner