జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే ఉదయభానును సైతం లెక్కచేయని వైద్యులు

జ్వరంతో బాధపడుతున్న తన కొడుకును జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చిన ధర్మవరం తండా మహిళ. సాధారణ రోగాలకు వైద్యం చేయమంటూ మహిళను తిప్పి పంపిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. కరోనా మాస్క్‌లు పంపిణీ చేస్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును రోడ్డుపైనే కలిసి తన గోడు వెళ్ళబోసుకున్న ఆ తల్లి. తన బిడ్డకు వైద్యం చేయించాలని ఎమ్మెల్యే ఉదయభానుకు విజ్ఞప్తి. స్పందించిన ఎమ్మెల్యే ఉదయభాను వెంటనే ఆసుపత్రికి తరలింపు.

ఎమ్మెల్యే ఉదయభాను చెప్పినా వైద్యం చేసేందుకు తిరస్కరించిన ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ విజయభాస్కర్‌. సాధారణ జ్వరాలకు వైద్యం చేయవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పినా, ఎవరు చెప్పిన తాము వైద్యం చేయమని అడ్డం తిరిగిన వైద్యులు. వైద్యుల మాటలతో కంగుతిన్న ఎమ్మెల్యే ఉదయభాను.అధికార పార్టీ ఎమ్మెల్యే మాటలనే లెక్క చేయని వైద్యులు. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉదయభాను.

Teluguone gnews banner