Read more!

సజ్జల ప‌వ‌ర్స్‌ పీకేసిన జ‌గ‌న్‌!.. విజయసాయికి ప్ర‌మోష‌న్‌.. లెక్క మారింది..

కొన్నాళ్లుగా వైసీపీలో హోల్ అండ్ సోల్ స‌జ్జ‌ల‌నే. జ‌గ‌న్ త‌ర్వాత నెంబ‌ర్ 2 పొజిష‌న్‌. మొద‌ట్లో విజ‌య‌సాయిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉత్త‌రాంధ్ర‌కు సామంత‌రాజును చేశారు. ఆయ‌నేమో రాజ్యం మొత్తం నాదేనంటూ విర్ర‌వీగారు. బాగా ఓవ‌ర్ చేశారు. వ‌రుస ఫిర్యాదుల‌తో సాయిరెడ్డి కోర‌లు క‌ట్ చేశారు సీఎం జ‌గ‌న్‌. విశాఖ నుంచి తీసుకొచ్చి.. త‌న తాడేప‌ల్లి ప్యాలెస్‌లో బంధించేశారు. పార్టీ అనుబంధ సంఘాల స‌మ‌న్వ‌య బాధ్య‌త‌లంటూ ఏదో చిన్న పోస్టు ప‌డేసి.. ఇకపై ఇక్క‌డే ప‌డుండంటూ ఆదేశించారు. ఇక విజ‌య‌సాయి ప‌ని ఖ‌తం అనుకున్నారంతా. హ‌వా అంతా స‌జ్జ‌ల‌దేనంటూ చ‌ర్చ జ‌రిగింది. కానీ, నెల రోజుల వ్య‌వ‌ధిలోనే సీన్ మారిపోయింది. ప్ర‌యారిటీ తారుమారు అయింది. స‌జ్జ‌ల ప‌వ‌ర్స్‌కు కోత పెట్టారు. విజ‌య‌సాయికి ఆ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఎవ‌రికి ఏ ప‌నులు అప్ప‌గించాలో.. బ‌హుషా జ‌గ‌న్‌కే క్లారిటీ లేన‌ట్టుంది.

స‌ల‌హాదారు తానే.. పార్టీ బాధ్య‌త‌లూ త‌న‌కే.. తానే నెంబ‌ర్ 2 అనుకుంటూ గాల్లో తేలిపోతున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని.. తీసుకొచ్చి నేల మీద నిల‌బెట్టేశారు జ‌గ‌న‌న్న‌. ఇటీవ‌ల సజ్జల రామకృష్ణారెడ్డికి.. వైసీపీ జిల్లా అధ్యక్షుల్ని.. రీజనల్ కోఆర్డినేటర్లను సమన్వయం చేసుకునే బాధ్యతలు ఇచ్చారు. దాదాపు పార్టీ అంతా స‌జ్జ‌ల చేతిలో పెట్టినంత ప‌ని చేశారు. అంత‌లోనే ఏమైందో ఏమో.. ఆ వెంట‌నే మ‌ళ్లీ నిర్ణ‌యాన్ని స‌వ‌రించుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు.. రీజనల్ కోఆర్డినేటర్ల స‌మ‌న్వ‌య బాధ్య‌త‌ల‌ను విజయసాయిరెడ్డికి అప్పగించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం కేవలం ఎమ్మెల్యేల బాధ్య‌త‌ల‌కే ప‌రిమితం చేసి.. ప్రాధాన్యం త‌గ్గించేశారు. ఎప్ప‌టిలానే మీడియా కోఆర్డినేష‌న్‌ను ఆయ‌న ద‌గ్గ‌రే ఉంచేశారు. 

ఎందుకు? స‌డెన్‌గా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎందుకిలా స‌జ్జ‌ల ప‌వ‌ర్స్‌కు కోత వేశారు?  విజ‌య‌సాయిరెడ్డికి మ‌ళ్లీ ఎందుకు ప్రాధాన్యం పెంచారు? అనే చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. నెంబ‌ర్ 2 అనే ప‌ద‌మే జ‌గ‌న్‌లో భ‌యానికి కార‌ణం అంటున్నారు. పార్టీ అంటే తానొక్క‌డి పేరు మాత్ర‌మే వినిపించాల‌ని.. తన త‌ర్వాత మ‌రెవ‌రూ నెంబ‌ర్ 2గా ఉండ‌కూడ‌ద‌నేది జ‌గ‌న్ లెక్క అంటున్నారు. అందుకే, సొంత చెల్లి ష‌ర్మిల‌ను సైతం ప‌క్క‌న‌పెట్టేశార‌ని గుర్తు చేస్తున్నారు. ఇటీవ‌ల స‌జ్జ‌ల పేరు పార్టీలో మారుమోగుతుండ‌టం.. కేబినెట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కే జ‌రిగిందంటూ పార్టీ నేత‌లంతా స‌జ్జ‌ల చుట్టూ తిరుగుతుండ‌టం జ‌గ‌న్‌కు న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. అందుకే, పార్టీలో స‌జ్జ‌ల స్థాయిని అమాంతం త‌గ్గించేశార‌ని చెబుతున్నారు. విజ‌య‌సాయిరెడ్డిని ఇప్ప‌టికే పార్టీ నేత‌లంతా దూరం పెట్టేశారు కాబ‌ట్టి.. స‌జ్జ‌ల‌ను కాద‌ని సాయిరెడ్డిని ఎంచుకున్నార‌ని అంటున్నారు. ఇలా వైసీపీలో ఎవ‌రికీ ప్రాధాన్యం ఉండ‌ద‌ని.. ఎవ‌రూ సూప‌ర్ ప‌వ‌ర్ కాద‌ని.. తాను మాత్ర‌మే సుప్రీం అనే మెసేజ్ పార్టీ వ‌ర్గాలకు ఇవ్వ‌డానికే.. జ‌గ‌న్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని విశ్లేషిస్తున్నారు.