Clearing the slush from Liver

Liver is one the most hardworking organ apart from heart; it helps in keeping the body fluids free of toxins not just that it also releases digestive enzyme which aid in absorption of nutrients. Basically liver regulates each any everything that comes into body it utilizes whatever it can while eliminating the useless things, these are recognized as harmful!


When liver is over-burdened with work of getting rid of toxins or harmful stuff it surfaces certain symptoms such as; headaches, lethargy, irregular digestion, weight gain, fatigue, skin discoloration or pain in the right upper abdomen.


The non-diet method i.e., by making some changes in the food habits rather than cutting down on food, of keeping our liver toxin burden free are: Keeping away any amount and any type of alcohol. Enormous amounts of water with a slice of lemon act as a water filtration system. Eating good quality foods rather counting on calories, such as leafy greens packed with magnesium, chlorophyll, Vitamins A and C, along with fresh vegetables and fresh fruits. Taking supplements is also essential, B vitamin and selenium are important since they help metabolize substances in the body that help keep your liver healthy. 


Certain foods are liver-friendly. Garlic rich in allicin and selenium are the natural liver cleansers. Citrus fruits high in vitamin C and selenium aid in liver cleansing activities. Beet and carrots rich in flavonoids and beta-carotene stimulate liver functions. The beverage – green tea has antioxidant assist liver function. The wondrous avocados glutathione, a compound that is necessary for the liver to cleanse harmful toxins. Apples are rich in pectins which eliminate toxins cutting down the work of liver.

 

-Koya Satyasri

మూత్రాన్ని ఆపుకునే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది.  పరిస్థితులు, సందర్భాలు ఏవైనా మూత్రం వచ్చినప్పుడు ఆపుకుంటూ ఉంటారు. దీని వల్ల ఇబ్బంది కలిగినా గత్యంతరం లేక ఇలా చేస్తుంటారు.  అయితే ఇలా మూత్రాన్ని ఆపుకోవడం అనేది చాలా లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. దీని వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  ఇంతకూ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలేంటి? శరీరానికి కలిగే ప్రమాదాలేంటి? తెలుసుకుంటే.. చలికాలం కష్టం.. చలికాలం చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది.  వాటిలో మూత్రానికి వెళ్లడానికి బద్దకించే వారు కూడా ఉంటారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది చాలా నిజం. ఇదే కాకుండా బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా గుడి,  పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు.  ఇలా మూత్రాన్ని ఆపుకోవడం చాలా డేంజర్. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలు.. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల కలిగే చాలా పెద్ద నష్టం మూత్రంలో ఇన్పెక్షన్ ఏర్పడటం.  మూత్రం మానవ శరీరంలో ఇన్ఫెక్షన్లు తొలగించడానికి సహాయపడుతుంది. కానీ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలో ఉండే విష పదార్థాల ప్రభావం వల్ల మూత్రాశయ ద్వారం ఇన్పెక్షన్ కు లోనవుతుంది. మూత్రాన్ని ఎక్కువ సేపు పట్టి ఉంచడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.  ఇది మూత్ర పిండాల సంబంధిత  సమస్యలకు దారితీస్తుంది.   మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు చాలా ప్రముఖమైనవి. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం బలహీనంగా మారుతుంది.  మూత్రాశయ కండరాలు బలహీనం అవుతాయి.  ఇది మూత్రం లీకేజికి దారి తీస్తుంది.  ఇది చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలోని మలినాలు, విసర్జక పదార్థాలు కలిసి గట్టిపడి రాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఈ సమస్య కిడ్నీలను మరింత ప్రమాదానికి గురిచేస్తుంది.  అందుకే మూత్రాన్ని ఆపుకోవడం అస్సలు మంచిది కాదు.                                  *రూపశ్రీ.  

చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం.  చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. దీనికి తగ్గట్టే మందంగా ఉన్న దుప్పటిని నిండుగా కప్పుకొని పడుకుంటారు.  ఇలా పడుకున్నప్పుడు ఏకంగా ముఖాన్ని కూడా పూర్తీగా కవర్ చేసుకుని పడుకునే వారు ఎక్కువే ఉంటారు.  దీనివల్ల ముక్కు, నోరు, చెవులకు చలితీవ్రత సోకదని అనుకుంటారు. అయితే ఇలా పడుకోవడం మంచిదేనా? దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలుసుకుంటే.. చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకోవడం అనే అలవాటు వల్ల చలి నుండి ఉపశమనం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ  ఇలా చేయడం వల్ల  కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న అదే గాలిని పదే పదే పీల్చుకుంటారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ  కార్బన్ డయాక్సైడ్ ఉన్న గాలిలో నిద్రపోవడం మెదడుకు,  శరీరానికి హానికరం. ఈ అలవాటు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల  శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది  మెదడు,  గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.  ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో ఉదయం తలనొప్పి, అలసట,  నోరు పొడిబారడం కూడా జరుగుతుందట.  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. నోటి నుండి వచ్చే తేమ దుప్పటి  బట్టలో చిక్కుకుపోతుంది. దీని వలన దుప్పటి లోపల వాతావరణం వెచ్చగా,  తేమగా ఉంటుంది. ఈ వాతావరణం ఫంగస్  పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ముఖం మీద ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల ఈ అలెర్జీ కారకాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళతాయి.  వీటి వల్ల  అలెర్జీలు,  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగుతుంది. ఆక్సిజన్ సరిగా  లేకపోవడం వల్ల  మెదడు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఉంటుంది.   మంచి, గాఢమైన నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.  ఒకవేళ నిద్ర పట్టినా ఉదయం లేవగానే తలనొప్పి, అలసట వంటివి ఏర్పడతాయి.   CO2కి అధికంగా గురికావడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును ప్రభావితం చేస్తుంది. అందుకే చలికాలంలో వెచ్చదనం కోసం ముఖాన్ని కూడా కప్పుకుని నిద్రపోవడానికి బదులు,  వెచ్చని దుస్తులు,  టోపి, కాళ్లకు సాక్స్ వంటివి ధరించి నిద్రపోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఎంత చలి ఉన్నా ఫ్యాన్ ఉండాలి,  కానీ దుప్పటి కప్పుకోవాలి అని అనుకోకూడదు.                                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

కల్తీ లవంగాల కనికట్టు.. వీటిని తింటే ఎంత నష్టమంటే..!

  లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  చాలా రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఔషధ గుణాలు ఉన్న కారణంగా ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం కూడా లవంగాలను వాడుతుంటారు. చాలామంది రోజూ ఒక లవంగం తినడం లేదా లవంగాలు ఉడికించిన నీటిని తాగడం చేస్తుంటారు. ఇదంతా శరీరం డిటాక్స్ కావాలని, శరీరంలో ఉండే చెడు పదార్థాలు,  మలినాలు తొలగిపోవాలని, రోగనిరోధక శక్తి బలంగా మారాలని చేస్తుంటారు. అయితే మంచి లవంగాలకు బదులు నకిలీ లవంగాలను వాడితే మాత్రం ఆరోగ్యానికి మేలు జరగకపోగా.. బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు కల్తీ లవంగాలను ఎలా కనిపెట్టాలి? కల్తీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. కల్తీ లేదా నకిలీ లవంగాలు.. మార్కెట్లో లభించేవన్నీ మంచి లవంగాలు అనుకుంటే పొరపాటు.  చాలా వరకు లవంగాలలో నూనెను సేకరించి, వాటిలో వాసన, సారం అనేవి అన్నీ కోల్పోయాక వాటిని అమ్ముతుంటారు. కొందరేమో వాసన, సారం, నూనె కోల్పోయిన లవంగాలకు రసాయనాలు జోడించి వాటిని అమ్ముతుంటారు. ఇవ్నీ కల్తీ లేదా నకిలీ లవంగాలు అని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ లవంగాలు ఎటువంటి ప్రయోజనాలను అందించవు.  ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కల్తీ లవంగాలు జీర్ణం కావడం కష్టం,  గ్యాస్, కడుపు నొప్పి, ఆమ్లతత్వం,  వికారం వంటి సమస్యలకు ఇవి కారణం అవుతాయి. కల్తీ లేదా నకిలీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలు.. పుఢ్ పాయిజన్.. సరిగ్గా తయారు చేయని లేదా రసాయనాలతో కల్తీ  చేయబడిన లవంగాలు ఫుడ్ పాయిజన్ కు  కారణమవుతాయి. దీని వలన వాంతులు, విరేచనాలు, బలహీనత,  తీవ్రమైన కడుపు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో వాపు, తలనొప్పి.. నిజమైన లవంగాలు మంటను తగ్గిస్తాయి. కానీ నకిలీ లేదా కల్తీ  లవంగాలు ఈ లక్షణాలను కలిగి ఉండవు. బదులుగా అవి శరీరంలో మంటను పెంచుతాయి. కల్తీ లవంగాలకు రంగు,  సువాసన కోసం రసాయనాలను కలిపి ఉంటారు. ఇవి తలనొప్పి,  తలతిరుగుటకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తి మటాష్.. నిజమైన లవంగాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. కానీ నకిలీ లవంగాలు శరీరానికి ఎటువంటి ప్రయోజనాలను అందించవు. ఎక్కువ కాలం నకిలీ లేదా కల్తీ లవంగాలను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. లివర్ నాశనమే.. చవకగా లభించే లవంగాలు,  రసాయనాలతో కల్తీ చేసిన సుగంధ ద్రవ్యాలు  కాలేయానికి క్రమంగా హాని కలిగిస్తాయి. ఇవి వెంటనే వాటి దుష్ప్రభావాలు బయటకి కనిపించేలా చేయకపోయినా వీటి నష్టం క్రమంగా బయటపడుతూ ఉంటుంది. నకిలీ లేదా కల్తీ లవంగాలు గుర్తించడం ఎలా.. ఒక గ్లాసు నీరు తీసుకొని కొన్ని లవంగాలు వేయాలి. లవంగాలు కల్తీ కాకపోతే అవి  మునిగిపోతాయి, కానీ అవి కల్తీ అయితే తేలుతాయి. అంతేకాదు.. లవంగాల నుండి నకిలీ రంగులు,  రసాయనాలు విడుదల కావడం కూడా కనిపిస్తుంది. నిజమైన లవంగాలు మంచి సువాసన, ఎక్కువకాలం కలిగి ఉంటాయి.  అదే నకిలీ లవంగాలు వాసన ఉండవు,  రంగు కూడా నిజమైన వాటితో పోలిస్తే వేరుగా ఉంటాయి. నకిలీ లవంగాలు నల్లగా,  పొడిగా,  బరువు లేకుండా తేలికగా,  చాలా సులభంగా విరిగిపోయేలా ఉంటాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఆయుర్వేదం చెప్పిన రహస్యం.. ఉసిరికాయ ఇలా తింటే మ్యాజిక్కే..!

  ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఉసిరికాయ వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే ఉసిరికాయను తినే విధానం చాలా ముఖ్యం అని ఆయుర్వేదం చెబుతోంది.   అసలు ఉసిరికాయను ఎలా తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆ విధానంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. ఉసిరికాయ ఉడికించి.. ఉసిరికాయను జ్యూస్ లాగా,  పచ్చిగా తినడం చూసే ఉంటారు. చాలామంది ఊరగాయ లాగా నిల్వ చేసుకుని కూడా తింటారు.  అయితే ఉసిరికాయను అలా కాకుండా ఆవిరి మీద ఉడికించి తింటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయట.  ఆవిరి మీద ఉడికించడం వల్ల ఉసిరికాయలో ఉండే విటమిన్-సి చెక్కు చెదరదని ఆయుర్వేద నిపుణులు కొందరు చెబుతున్నారు. ఉడికించిన ఉసిరికాయ ప్రయోజనాలు.. రోగనిరోధక వ్యవస్థ.. ఉడికించిన ఉసిరికాయలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  జలుబు,  దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ.. ఉడికించిన ఉసిరికాయ  జీవక్రియను మెరుగుపరుస్తుంది,  మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.  ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు ఇది  సహాయపడుతుంది.  చర్మం,  జుట్టు.. ఉసిరికాయ అందాన్ని చేకూర్చే  అద్భుతమైన ఫలం. ఉడికించిన ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి చర్మ స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. జుట్టు కుదుళ్లకు  పోషణ ఇస్తుంది.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది,  జుట్టును మందంగా, బలంగా,  మెరిసేలా చేస్తుంది. గుండె జబ్బులు.. ఉడికించిన ఉసిరికాయ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే  శోథ నిరోధక లక్షణాలు శరీరంలో మంట,  చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. కంటి చూపు.. విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఉసిరికాయను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత కంటి సమస్యలైన మాక్యులర్ డీజెనరేషన్,  కంటిశుక్లం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా తినాలంటే.. ఒక తాజా ఉసిరికాయను  బాగా కడిగాలి.  ఒక కుండలో లేదా బౌల్ లో నీరు పోసి పైన ఒక చెల్లు ప్లేట్ లేదా గిన్నె ఉంచి అందులో ఉసిరికాయను వేసి పైన మూత పెట్టాలి.  5నుండి 10 నిమిషాలలో ఉసిరికాయ మెత్తబడుతుంది.  ఆ తర్వాత దాన్ని బయటకు తీసి చల్లబడిన తర్వాత నమిలి నేరుగా తినవచ్చు.       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                          

డిప్రెషన్ బాధితులకు గుడ్ న్యూస్.. 7రోజులు ఇలా చేస్తే షాకింగ్ ఫలితాలు పక్కా..!

డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు.  చుట్టూ ఉన్న అందరూ సపోర్ట్ చేస్తే తప్ప దీన్నుండి సులువుగా బయట పడలేరు. డిప్రెషన్ కారణంగా నమోదు అవుతున్న మరణాలు కూడా చాలానే ఉంటున్నాయి.  అయితే డిప్రెషన్ లో నలిగిపోతూ ఇక తమ జీవితం అంతే నిరాశలో ఉండేవారికి గుడ్ న్యూస్.. డిప్రెషన్ ను తరిమి కొట్టే అద్బుతమైన మార్గం ఉంది.  కేవలం 7రోజులు చాలు.. జీవితంలో అద్బుతం జరుగుతుంది.  ఈ విషయం స్వయానా పరిశోధకులు,  వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  ఇంతకూ 7 రోజులు చేయాల్సిన పనులేంటి? ఇది డిప్రెషన్ తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. ఫోన్ బంద్.. డిప్రెషన్ ఎండ్.. డిప్రెషన్ సమస్యను ఎండ్ చేయడానికి ఫోన్ బంద్ చేయడం అతిగొప్ప మార్గమని వైద్యులు, పరిశోధకులు అంటున్నారు.  ఒక పరిశోధన ప్రకారం కేవలం వారం రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల డిప్రెషన్ లక్షణాలు 24శాతం తగ్గాయని చెబుతున్నారు.  అంతేకాదు.. ఆందోళన సమస్య 16.1 శాతం,  నిద్రలేమి, నిద్రకు సంబంధించిన సమస్యలు దాదాపు 14.5 శాతం తగ్గాయట.  కాబట్టి సోషల్ మీడియాకు వారం రోజులు దూరం ఉంటే ఇన్ని సమస్యలు మంత్రించినట్టు తగ్గుతాయని అంటున్నారు.  సోషల్ మీడియా అంటే స్మార్ట్ ఫోన్,  అందులో నెట్ కనెక్షన్.. ఇవి రెండూ దూరంగా ఉంటే చాలని అంటున్నారు. సోషల్ మీడియా డిటాక్స్ ప్లాన్.. 7రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అనే ప్లాన్ ను దశల వారిగా ఈ కింది విధంగా ఫాలో కావచ్చు. 1రోజు.. సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలో.. ఆత్మ పరిశీలన చేసుకుని.. ఆ తరువాత విషయాన్ని ఒక కాగితం మీద కొన్ని లక్ష్యాలు రాసుకోవాలి.  దీనివల్ల ఎవరికి వారికే తాము సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉండాలి, దాని వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అనే విషయం అర్థం అవుతుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి తమకు తాము రెఢీ అవుతారు. 2వ రోజు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి మంచి మార్గం నోటిఫికేషన్లను ఆప్ చేయడం.  నోటిఫికేషన్ల వల్ల ఫోన్ ను పదే పదే తీయవలసి వస్తుంది. నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలి. హోమ్ స్క్రీన్ మీద సోషల్ మీడియా యాప్ లను తీసేయాలి. వాటిని ఫోల్డర్ లలో ఉంచి యాప్ లను తెరిచే అవసరం తగ్గించాలి. 3వ రోజు.. రోజూ ఫోన్ చూస్తూ గడిపే సమయాన్ని కాస్తా మంచి అలవాట్ల కోసం వెచ్చించాలి.  కొంతసేపు పుస్తకం చదవడం,   వ్యాయామం, మంచి అభిరుచి, ఎప్పటినుండో నేర్చుకోవాలని అనుకున్న పనిని నేర్చుకోవడం, ఆర్ట్స్ క్రాఫ్ట్స్,  తోటపని ఇట్లా ఏదైనా సరే.. సోషల్ మీడియాకు దూరంగా మనసును లాక్కెళ్లాలి. 4వ రోజు.. సోషల్ మీడియా నుండి బయటకు వచ్చి చుట్టూ ఉన్న పరిసరాలు,  జరుగుతున్న పరిస్థితులతో మాత్రమే కనెక్ట్ అవుతూ ఉండాలి.  చేసే ప్రతి పనిని మనసుతో ఆస్వాదిస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మెదడు మానిటైజ్ అవుతుంది. మెదడు మీద సోషల్ మీడియా ఒత్తిడి మెల్లిగా తగ్గడం మొదలవుతుంది. 5వరోజు.. మానసికంగా మెరుగ్గా ఉండటానికి ద్యానం, శ్వాస వ్యాయామాలు బాగా సహాయపడతాయి.  అందుకే రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయాలి. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఎలా అనిపిస్తోంది, మనసు ఎలా ఫీలవుతోంది,  ఏ పని తేలికగా అనిపించింది, ఏ పని కష్టంగా అనిపించింది మొదలైనవన్నీ ఒక జర్నలింగ్ రాసుకోవాలి. ఇది జరుగుతున్న మార్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 6వ రోజు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటే ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపడం చాలా మంచిది. అది కూడా నేరుగా వ్యక్తులతో కలిసి సమయాన్ని గడపాలి. ఇది బంధాలను బలపరచడమే కాకుండా,  డిప్రెషన్ వంటి భూతాన్ని పారద్రోలడానికి బంధాలు ఎంతగా సహకరిస్తాయో కూడా అర్థం చేసుకునేలా చేస్తుంది. 7వ రోజు.. వారంలో జరిగిన ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న మార్పును రివైండ్ చేసుకోవాలి.  ఏ చిన్న రిలీఫ్ కనిపించినా చాలా గొప్ప ఫలితం సాధించినట్టే.. ఎందుకంటే ఒక్కసారి గెలుపు రుచి చూస్తే దానికోసం అలాగే కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది. మెల్లిగా సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉండాలో అంత దూరం ఉంటూ కేవలం అవసరం కోసం మాత్రమే లిమిట్ గా సోషల్ మీడియా ఉపయోగించడం నేర్చుకుంటే డిప్రెషన్ భూతాన్ని తరిమి కొట్టేయవచ్చు.                         *రూపశ్రీ.

దోసకాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలున్నవారికి మంచిది కాదు..!

దోసకాయ తినడానికి  చాలా మంది  ఇష్టపడతారు. సాధారణంగా దోసకాయను  కూరగాయల లిస్ట్ లో చెబుతారు. దోసకాయలో నీరు  సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది,  శరీరం డీహైడ్రేట్ కాకుండా  నివారిస్తుంది. అయితే చాలా మంది దోసకాయను వంటకంగా కాకుండా నేరుగా తినడానికి లేదా  సలాడ్, రైతా లలో జోడించుకోవడానికి ఇష్టపడతారు.  ఇంకొందరు  ఉప్పుతో కలిపి తింటారు. దోసకాయలు ఆరోగ్యానికి చాలా మంచివిగా పరిగణించబడతాయి. కానీ కొందరికి మాత్రం దోసకాయ చేటు చేస్తుందని చెబుతారు.  ఇంతకీ దోసకాయలో ఉండే పోషకాలు ఏంటి? దోసకాయలను ఎవరు తినకూడదు? తెలుసుకుంటే.. దోసకాయ పోషకాలు.. దోసకాయలలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం,  మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు  ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.  దోసకాయలు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో, అవి కొంతమందికి  హాని కూడా చేస్తాయి.   దోసకాయలు ఎవరు తినకూడదంటే.. దోసకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే కొందరిలో  గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం లేదా తిమ్మిరి వంటి సమస్యలు పెరుగుతాయి. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు లేదా ఇప్పటికే ఎసిడిటీ లేదా ఉబ్బరంతో బాధపడుతున్నవారు దోసకాయలను తక్కువగా తినాలట. లేదంటే  అస్సలు తినకపోవడం మేలట. ఎందుకంటే ఇది వారి సమస్యలను మరింత పెంచుతుంది. దోసకాయలు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఎవరికైనా ఇప్పటికే దగ్గు, జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే వారు  దోసకాయ తినడం మంచిది కాదు. దీని శీతలీకరణ ప్రభావం దగ్గును తీవ్రతరం చేస్తుంది.  జలుబును పెంచుతుంది. కాబట్టి దగ్గు, జలుబు,  గొంతునొప్పి వంటివి ఉన్నవారు దోసకాయ తినకపోవడం మంచిది. కొంతమందికి దోసకాయ తిన్న తర్వాత అలెర్జీ సమస్యలు వస్తాయి. పెదవులు లేదా గొంతు దురద, వాపు, కడుపు నొప్పి,  వికారం వంటి అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. దోసకాయ తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దోసకాయ తినడం మానేయడం మంచిది. దోసకాయ ఒక సహజ మూత్రవిసర్జన పదార్థం. అంటే ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది. ఎవరికైనా ఇప్పటికే తరచుగా మూత్రవిసర్జన ఉంటే, దోసకాయ వారి సమస్యను మరింత పెంచుతుంది. అలాంటి వారు చాలా తక్కువ మొత్తంలో లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత దోసకాయ తినడం మేలు. దోసకాయలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా రక్తపోటును కూడా కొద్దిగా తగ్గిస్తాయి. ఎవరికైనా ఇప్పటికే తక్కువ రక్తపోటు ఉంటే దోసకాయను ఎక్కువగా తినడం వల్ల తలతిరుగుడు, బలహీనత లేదా అలసట వస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు దోసకాయలను తక్కువగా తీసుకోవాలి. కొంతమందికి జలుబు సులభంగా సోకుతుంది. ఇలాంటి వారు చల్లని పదార్థాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు.  సులభంగా జలుబుకు గురయ్యే అవకాశం ఉన్నవారు, చేతులు కాళ్ళు చల్లగా ఉంటే లేదా తరచుగా కడుపులో చలి ఉండటం వంటి సమస్యలున్నవారు దోసకాయలు తినడం అస్సలు మంచిది కాదు.                                *రూపశ్రీ.

శీతాకాలంలో తులసి టీ చేసే మ్యాజిక్ ఇదే..!

  శీతాకాలం ఆరోగ్యానికి పరీక్షలు పెట్టే కాలం.  శీతాకాలంలో చలి కారణంగా జలుబు, ఇన్ఫెక్షన్లు,  చర్మం పగలడం,  దురదలు,  ర్యాషెస్, డాండ్రఫ్ వంటివి చాలా వస్తాయి.  ప్రతి సమస్యను తగ్గించుకోగానే మరొక సమస్య రెఢీ అవుతూ ఉంటుంది.  అన్నింటి కంటే ముఖ్యంగా చలి కారణంగా శరీరంలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది. వీటి నుండి ఉపశమనం కోసం చాలామంది అల్లం, వెల్లుల్లి, తులసి వంటి ఔషద గుణాలు ఉన్న పదార్థాలు బాగా వాడుతుంటారు.  అయితే శీతాకాలంలో తులసి టీ తయారు చేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. తులసి అద్బుతమైన మూలిక.. తులసి అద్బుతమైన మూలిక అనే విషయం అందరికీ తెలిసిందే. తులసికి ఆయుర్వేదం నుండి అన్ని రకాల వైద్యాలలో చాలా ప్రాముఖ్యత ఉంది.  తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలో సహాయపడతాయి.  చలికాలంలో ఆరోగ్య సంరక్షణ కోసం తులసిని పుష్కలంగా వాడవచ్చు. సీజన్ సమస్యలకు చెక్.. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే ముక్కు దిబ్బడ,  దగ్గు,  గొంతు నొప్పి వంటి సీజన్ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో తులసి టీ చాలా బాగా సహాయపడుతుంది. శ్వాస సమస్యలు.. చలికాలంలో చల్లని గాలుల కారణంగా చాలామంది శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలు శీతాకాలంలో విజృంభిస్తుంటాయి.  ఈ సమస్యల కు చెక్ పెట్టడానికి తులసి చాలా బాగా పనిచేస్తుంది. చర్మానికి తులసి.. తులసిలో వేడి గుణాలు ఉంటాయి.  తులసిని తీసుకున్నప్పుడు శరీరంలో వేడి పుడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచుతుంది. చలి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. పొట్ట ఆరోగ్యం.. తులసి టీ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం,  బరువు తగ్గడం,  కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  పొట్ట ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. షుగర్ సమస్య రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండేవారు రెగ్యులర్ గా తులసి టీ తాగుతూ ఉంటే సుగర్ లెవల్స్ క్రమంగా నియంత్రణలోకి వస్తాయట. తులసిలో ఉండే ఔషద గుణాలు జీవక్రియను మెరుగుపరచడం వల్ల ఇది సాద్యమవుతుందని  అంటున్నారు. తులసి టీ తయారు విధానం.. టీ అనగానే బారతీయులకు పాలు, పంచదార వేసి చేసే పానీయం గుర్తు వస్తుంది.  కానీ తులసి టీ తయారు చేయడానికి పాలు అవసరం లేదు. కావలసిన పదార్థాలు.. తులసి ఆకులు.. నీరు తేనె నిమ్మరసం తయారు విధానం.. ఒక గ్లాసు నీటిలో 5 నుండి 7 తులసి ఆకులు వేయాలి.  దీన్ని బాగా మరిగించాలి.  మరిగిన తరువాత వడపోసుకోవాలి.  ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ నిమ్మరసం,  ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. తేనె,  నిమ్మరసం వేయకపోయినా పర్వాలేదు.  తులసిని నీళ్లలో మరిగించి తాగవచ్చు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

కత్తి లాంటి కంటి చూపుకు అమేజింగ్ డ్రింక్ ఇది..!

  సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అన్ని అవయవాలలోకి కళ్లు చాలా ముఖ్యమైనవి. కంటిచూపు మెరుగ్గా ఉంటే జీవితంలో చాలా భాగం చాలా సవ్యంగా గడిచిపోతుంది. కానీ నేటి కాలంలో కంటిచూపు సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి.  చిన్న పిల్లల నుండి ప్రతి ఒక్కరూ కళ్ల అద్దాలు ఉపయోగించడం, కంటి సంబంధ సమస్యలతో ఇబ్బంది పడటం చేస్తుంటారు. చాలామంది కంటి చూపు మెరుగవ్వడం కోసం సప్లిమెంట్లు కూడా తీసుకుంటూ ఉంటారు.  కానీ సంప్లిమెంట్లు అక్కర్లేకుండా కంటి చూపు కత్తిలా, పదునుగా మార్చే అద్బుతమైన డ్రింక్ ఒకటుంది.  ఈ డ్రింక్ ను తీసుకుంటే కంటి అలసట తగ్గడంతో పాటు కంటి శుక్లం సమస్య కూడా తగ్గుతుందని చెబుతున్నారు.  ఈ డ్రింక్ ఏంటో.. ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో.. ఈ డ్రింక్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. జామాకు టీ.. జామకాయ రుచికరమైన పండు మాత్రమే కాదు, దాని ఆకులలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. జామ ఆకులతో తయారుచేసిన టీ కంటి చూపును మెరుగుపరచడానికి,  కంటి చూపు జాగ్రత్తగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. జామాకులలో పోషకాలు..  జామాకులలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు,  అనేక ఇతర పోషకాలు ఉంటాయి.  ఇవి  కళ్ళకు పోషణ ఇస్తాయి.  కంటి అలసటను తగ్గిస్తాయి.  కంటిశుక్లం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. జామాకు టీ తయారీ విధానం.. తాజాగా ఉన్న ఆకుపచ్చ జామ ఆకులను తీసుకొని వాటిని బాగా కడిగి, దుమ్ము, రసాయనాలు వాటి మీద నుండి తొలగించాలి.  ఒక పాన్‌లో రెండు నుండి మూడు కప్పుల నీటిని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత, జామ ఆకులను నీటిలో వేయాలి. ఆకులలోని  పోషకాలు నీటిలో చేరతాయి. సుమారు   7-8 నిమిషాలు తక్కువ వేడి మీద మరిగించాలి. ఆ తరువాత స్టౌ ఆప్ చేసి వడగట్టాలి.  గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.  ఇందులో రుచి కోసం తేనె, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. జామాకు టీ ఇందుకే బెస్ట్.. జామ ఆకులలో  విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.  ఇది  రెటీనాను బలపరుస్తుంది.  రేచీకటి వంటి  కంటి   సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. జామాకు టీ  కళ్ళను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. తద్వారా కంటిశుక్లం,  వయస్సు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటి అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది .  ఎక్కువసేపు స్క్రీన్ వైపు చూడటం వల్ల కంటి అలసట,  పొడిబారడం జరుగుతుంది. జామాకు  టీ దీనిని తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్ల వాపు,  ఎరుపు నుండి ఉపశమనం. దీనిలో ఉన్న శోథ నిరోధక లక్షణాలు కళ్ళ ఎరుపు,  చికాకును తగ్గిస్తాయి . రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  జామాకు టీ  కళ్ళకు ఆక్సిజన్,  పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది. దీని వలన కంటిచూపులో స్పష్టత పస్తుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ప్రయాణాల్లో చాలా ఇబ్బంది పెట్టే మలబద్దకం సమస్యకు చెక్ పెట్టండి ఇలా..!

కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది.  చాలా వరకు ఆఫీసు పనులు, వ్యక్తిగత పనుల మీద ఒంటరిగానే ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిజానికి ప్రయాణాలు అంటే అదొక స్పెషల్ మూమెంట్ అనిపిస్తుంది.  కానీ చాలా మంది మాత్రం ప్రయాణంలో చెప్పుకోలేని అసౌకర్యం అనుభవిస్తుంటారు.  అదే మలబద్దకం. ప్రయాణం కోసం అలా ఇంటి నుండి బయటపడగానే.. ఇటు మలబద్ధకం, ఉబ్బరం, తిమ్మిర్లు,  అసౌకర్యం మొత్తం ప్రయాణాన్ని నాశనం చేస్తాయి. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు  ఈ సమస్య నరకాన్ని పరిచయం చేస్తుంది. అసలు ప్రయాణాలలో మలబద్దకం ఎందుకు వస్తుంది.  ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలేంటి తెలుసుకుంటే.. ప్రయాణాల సమయంలో మలబద్దకం ఎందుకు వస్తుంది? ప్రయాణాలు చేసేటప్పుడు దినచర్య మారడం,  ఆహారపు అలవాట్లలో మార్పులు,  నీరు తక్కువ తీసుకోవడం,  ఎక్కువ సేపు కూర్చోవడం,  నిద్రలేకపోవడం,  టాయిలెట్ కు వెళ్లడానికి తగిన వెసులుబాటు లేకపోవడం మొదలైనవి మలబద్దకం రావడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రయాణాల సమయంలో మలబద్దకం,  ఉబ్బరం,   గ్యాస్ వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కుంటారు. ముఖ్యంగా వృద్దులు, స్త్రీలు,  పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ప్రయాణ సమయంలో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టే చిట్కాలు.. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టాలంటే ప్రయాణాలలో ఫైబర్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  మరీ ముఖ్యంగా ప్రయాణాలలో హోటల్ ఆహారాన్ని నిషేధించాలి. ప్రయాణాలలో ఆహారం వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పండ్లను తినడం మంచిది. పండ్లలో ఫైబర్ ఉంటుంది, నీటి శాతం కూడా ఉంటుంది.  ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది. ప్రయాణాలలో ఆకలి వేయకపోయినా స్నాక్స్ తినే అలవాటు కొందరికి ఉంటుంది.  బిస్కెట్లు,  సమోసాలు వంటివి తినడం వల్ల మలబద్దకం వస్తుంది.  అందుకే వీటిని నివారించాలి.  ఆకలిగా అనిపిస్తే బాదం, కాజు వంటి శక్తిని ఇచ్చే నట్స్ తీసుకోవాలి. ప్రయాణాలలో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ప్రయాణాలలో తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా అటు ఇటు తిరగడం,  ఏవైనా స్టాప్ లు వచ్చినప్పుడు కిందకు దిగి మళ్లీ ఎక్కడం వంటివి చేయవచ్చు. ప్రయాణాలలో తప్పనిసరిగా బయటి ఆహారం తినాల్సి వస్తే ప్రోబయోటిక్స్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  దోశ, ఇడ్లీ,  మజ్జిగ, పెరుగన్నం వంటివి మలబద్దకం రాకుండా చేస్తాయి. అలాగే ప్రయాణంలో పాలు పోక ఊరికే కాఫీలు,  టీలు తాగడం మానేయాలి. ప్రయాణాలలో మలబద్దకం సమస్యను ఎదుర్కునేవారు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఇలా సమస్య ఎదుర్కునేవారు వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడటం మంచిది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఏ సీజన్ లో అయినా పొట్ట సమస్యలకు చెక్ పెట్టే అమృతం ఇది..!

పొట్ట కాస్త తేడా కొడితే చాలు.. ఎంత బలంగా, దృఢంగా ఉన్న మనిషి అయినా  అసౌకర్యానికి లోనవుతారు.  పొట్ట ఆరోగ్యం బాగుంటే మిగతా శరీరం ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. కానీ పొట్ట ఆరోగ్యం తేడా వస్తే తిండి, నీరు తీసుకోవడం కూడా  బ్రేక్ పడుతుంది.  ఇలా పొట్ట, ప్రేగు ఆరోగ్యాన్నే గట్ అని పిలుస్తారు. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడే ఆరోగ్యకరమైన బాక్టీరియా తయారయ్యేది పొట్టలోనే.. అలాంటప్పుడు పొట్ట ఆరోగ్యం బలంగా ఉండటం ఎంతో  అవసరం.  పొట్ట ఆరోగ్యం బాగుండాలన్నా,  పొట్ట సమస్యలు ఏ సీజన్ లో వచ్చినా వాటికి చెక్ పెట్టాలన్నా కేవలం ఒక్క పానీయం అమృతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  అదేంటో  తెలుసుకుంటే.. మజ్జిగ.. శీతాకాలంలో తరచుగా మజ్జిగ, పెరుగుకు దూరంగా ఉంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ప్రతి సీజన్‌లో కడుపు సమస్యలకు చెక్ పెట్టడంలో మజ్జిగ చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనంతో పాటు ప్రతిరోజూ మజ్జిగ  తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు తగ్గుతాయి.  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇదే అసలైన మజ్జిగ.. మజ్జిగ ఈనాటి పానీయం కాదు.. దీనికి ఎంతో చరిత్ర ఉంది. పెరుగు చిలికిన తర్వాత తయారుచేసిన మజ్జిగ ఎప్పుడూ ఆరోగ్యకరమైనది. చాలామంది వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతారు.  కానీ శీతాకాలం వచ్చేసరికి పెరుగు, మజ్జిగ వాడకం తగ్గిస్తారు.  అయితే ఆయుర్వేదం ప్రకారం ఇది ప్రతి సీజన్ లో శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. జీర్ణక్రియను బలంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. మజ్జిగ ఇలా తాగాలి.. చాలామంది పెరుగులో నీళ్లు కలిపి పలుచగా చేసుకుని దాన్నే మజ్జిగ అనుకుంటారు. కానీ నిజానికి మజ్జిగ అనేది పెరుగులో వెన్న తొలగించిన తరువాత లభించే ద్రవం. ఈ మజ్జిగలో అస్సలు ఫ్యాట్ ఉండదు.  ఈ మజ్జిగను నేరుగా అలాగే తాగవచ్చు.  లేదా అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పొడి వంటివి కలిపి కూడా తాగవచ్చు.  అలా కాకున్నా ప్లెయిన్ మజ్జిగలో కాసింత నిమ్మరసం, జీలకర్ర పొడి కలుపుకుని తీసుకున్నా జీర్ణశక్తి బలంగా ఉంటుంది.   మజ్జిగ బెస్ట్ ఎందుకంటే.. మజ్జిగలో కాల్షియం, ప్రోబయోటిక్స్,  ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపు ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.  జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. భోజనం తర్వాత బరువుగా, గ్యాస్ లేదా ఉబ్బరం ఉన్నవారికి మజ్జిగ ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి జోడించిన రాతి ఉప్పు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.  వేయించిన జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  నల్ల మిరియాలు కడుపు వాయువును తగ్గించి కడుపును తేలికపరుస్తుంది.                                      *రూపశ్రీ.