మాజీ ఎమ్మెల్యే దేముడు మృతి

చింతపల్లి మాజీ ఎమ్మెల్యే దేముడు ఈరోజు కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దేముడు స్వస్థలం గొలుగొండ మండలం శరభన్నపాలేం. కాగా దేముడు  సీపీఐ తరపున చింతపల్లి నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదిలా ఉండగా దేముడు భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం అయిన శరభన్నపాలేనికి తరలించారు. పలువురు పార్టీ నేతలు దేముడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Teluguone gnews banner