NRI టీడీపీ పోరు

 

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధికి అహర్నిహలు కష్టపడుతూ.. రాష్ట రాజధాని కోసం.. దానిలో పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ అభివృద్ధిలో తనవంతు తానుగా సాయం అందించడానికి చంద్రబాబు తనయుడు కూడా బాగానే కష్టపడ్డారు. ఏపీ రాజధానిలో పెట్టుబడుల కొరకు అమెరికా పర్యటన చేసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ పర్యటన గురించి అందరూ మరిచిపోయినా లోకేశ్ NRI ట్రిప్ తరువాత ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు డా. వేమూరి రవి. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి లోకేశ్ కు ఆంతరంగీకుడిగా ఉన్నట్టు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ అమెరికా పర్యటనలో క్రియాశీల పాత్ర పోషించిన ఈయన అక్కడ లోకేశ్ అన్ని కార్యక్రమాలన్నింటిని కో-ఆర్డినేట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పుడు వేమూరి రవికి కాబినేట్ లో పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా అదే సమయంలో అమెరికా పర్యటన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే లోకేశ్ కంటే కేటీఆర్ పర్యటనే బాగా సక్సెస్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ డా. రవికి కేబినేట్ హోదా కలిగిన NRI కో-ఆర్డినేటర్ అనే ఒక పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది.

 

ఇంతవరకూ బానే ఉన్నా అసలు NRI టీడీపీ స్ఠాపించిన దగ్గరనుండి దానికోసం విశ్రాంతి లేకుండా.. కష్టపడిన TANA, NATS ప్రముఖులకు మాత్రం ఇది కాస్త చేదువార్తగానే భావిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో 2007 లో చంద్రబాబు అమెరికా పర్యటనలో కాని లోకేశ్ పర్యటనలో కాని.. మొన్న ఎలక్షన్లలో వాళ్లవంతు సహకారం అందించారు. ముఖ్యంగా జైరాం కోమటి, నాదెళ్ల గంగాధర్, సతీష్ వేమన, రవి మాదాల లాంటి వారికి ఇది శరాగతంగా తగిలింది. రాజకీయంగా ఎలక్షన్స్ లో పోటీ చేయలేని వీళ్లందరికి ఇప్పటికే NRI కోటాలో పార్టీలో ఏమాత్రం సంబంధంలేని ఆనంద్ కూచిబొట్ల కేబినేట్ పదవిలో ఉండటంతో అప్పట్లో పెదవి విరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డా. రవికి కూడా కాబినేట్ హోదాలో పదవిని ఇవ్వడంపై కూడా అసంతృప్తి చెందే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ వార్తను వారు ఏ విధంగా తీసుకొని ముందుకెళతారో చూడాలి.

Teluguone gnews banner