చిరంజీవి...బీజేపీలో చేరతారంటూ ఓ పత్రిక కథనం
posted on Sep 24, 2015 @ 7:44PM
మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరతారంటూ ఓ ఆంగ్ల పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి చిరంజీవి ప్రయత్నించడం లేదని ఇటీవల రాహుల్ గాంధీ క్లాస్ పీకారని, పైగా కేంద్రమంత్రి పదవి ఇచ్చి చిరంజీవికి జాతీయ గుర్తింపు వచ్చేలా చేస్తే, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయకుండా తన 150వ సినిమాపైనే ఫోకస్ పెట్టారని రాహుల్ చిర్రుబుర్రులాడారట, దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన మెగాస్టార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని రాసుకొచ్చింది, బీజేపీ కూడా మెగా ఫ్యామిలీ పట్ల సానుకూలంగా ఉందని, రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ సంస్థకు ఎన్డీఏ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాసుకొచ్చింది, పవన్ కూడా బీజేపీ మద్దతుదారుడైనందున చిరంజీవి బీజేపీలో చేరతారంటూ విశ్లేషణాత్మక కథనం ఇచ్చింది.