బేగంపేట ఎయిర్పోర్టులో అగ్నిప్రమాదం
posted on Feb 24, 2017 @ 2:02PM
హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం సమయంలో విమానాశ్రయంలో ఉన్న పొదల్లో అగ్నిప్రమాదం జరిగి మంటలు ఎగసిపడ్డాయి.. దీనిని గమనించిన స్థానికులు ప్రమాద విషయాన్ని విమానాశ్రయ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది ఫైరింజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.