Read more!

19న బాలకృష్ణ నామినేషన్ 

ఎపీలో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ నెల 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. బాలయ్య కదిరి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం, ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు. 
కాగా, ఏపీలో ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్  29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్న సంగతి తెలిసిందే.
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఆయన రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి కాగా కదిరి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. రాయలసీమలో రేపటి నుంచి విస్తృతంగా పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో కదిరి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న బాలకృష్ణ ఈ నెల 19న హిందూపురంలో నామినేషన్‌ వేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం చేయనున్నారు.

హ్యాట్రిక్ విజయాల దిశగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీల కతీతంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన బాలకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలను సైతం కొనసాగిస్తున్నారు. తాజా ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభల్లో బిజీగా ఉన్నారు. రాయలసీమ పర్యటన అనంతరం ఉత్తరాంధ్రలో బాలకృష్ణ ప్రచారం ఉంటుంది.