Read more!

బాలకృష్ణుడితో కత్తులు దూస్తున్న కొడాలి నాని

 

 

 

నిన్నగాక మొన్నటి వరకు నందమూరి కుటుంభానికి వీరవిధేయుడిగా గర్వంగా తనని పరిచయం చేసుకొనే గుడివాడ తే.దే.పా.శాసన సభ్యుడు కొడాలి నాని ఉన్నటుండి పార్టీ మార్చగానే మరిచిపోకుండా వెన్వెంటనే తన విధేయత కూడా మార్చుకొన్నాడు. అంతటితో ఆగితే పరవాలేదు. గాని, ఇన్నాళ్ళుగా ఏ కుటుంభానికి జై కొడుతూవచ్చేడో వాళ్ళపైనే తిట్లు లంకించుకొని వీరంగం ఆడేస్తున్నాడు. నిజం చెప్పాలంటే, అతనిని నందమూరి వంశం ఏనాడు అవమానపరచలేదు, సరి కదా అతనికి పార్టీలో తగిన హోదా కల్పించి గౌరవించింది. కేవలం తమ కుటుంబాన్ని అభిమానించే వాడని అభిమానంతోనే ఆ గౌరవం ఇచ్చారు అతనికి. అయినా, స్తానిక నేతలతో ఇమడలేక అతను పార్టీ విడిచి వెళ్ళిపోయాడు. అందుకు అతనిని ఎవరు కూడా తప్పుబట్టరు. అయితే, జగన్ అండ చూసుకొని తప్పుగా మాట్లాడటమే ఆతను చేసిన పెద్ద తప్పు. రాజకీయం గా ఏమి మాట్లాడిన ఎవరికీ అభ్యంతరం ఉండదు. గాని వ్యక్తిగతంగా విమర్శలకు దిగడమే ఆటను చేసిన పెద్ద తప్పు.


అందుకే, కొంచెం ఆవేశాపరుడిగా పేరుబడ్డ బాలకృష్ణ అతని సంగతి తెలిసిన వెంటనే తనదయిన శైలిలో ఘాటుగా “అవును! గుడివాడ నా అబ్బ సొత్తే! మా పార్టీ సొత్తే! మా పార్టీ పేరు చెప్పుకోకుండా ఇక్కడ ఎవరు గెలువలేరు,” అని జవాబు ఇచ్చేసరికి పాపం నానికి ఎక్కడో కాలింది.



నాని ఇప్పటికైనా కొంచెంతగ్గి ఉంటే అతనికే గౌరవం మిగిలేది. గాని ఆతను వెంటనే మరో అడుగు ముందుకు వేసి ఈ సారి బాలకృష్ణకే ‘బస్తీ మే సవాల్’ అంటూ ఎన్నికలలో అతని మీద పోటికి సిద్దం అని ప్రకటించేయడమే గాక, ఒక వేళ తను గాని అతని చేతిలో ఓడిపోతే రాష్ట్రం విడిచి వెళ్ళిపోతానని ‘ఇంద్రసేనారెడ్డి’ లా తొడచరిచి మరీ గుడివాడ నుండి సమరానికి సై అంటున్నాడు. గుడివాడే కాదు హోల్ సేల్ మొత్తం రాష్ట్రం లో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్దం అని మరో సవాలు కూడా విసిరి నందమూరి సింహం నోట్లో తలబెట్టేందుకు తయారయ్యాడు . ఏమిటీ...ఇదంతా జైల్లో చిప్ప కూడు తింటున్న జగన్ బాబు అండ చూసుకోనే...!