నిజమైన ప్రజాస్వామ్యం అదే

 

మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలే ఆశయాలను ఆచరించాలి.. అదే ఆయనకు మనము ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ పూలే ఆశయ సాధన కోసం తపించేవారని, పూలేను ఆదర్శంగా తీసుకొనే అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలే అని, వెనుకబడిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎప్పడైతే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని వెల్లడించారు.

Teluguone gnews banner