ఏపీ కొత్త సీఎస్ గా నిరభ్ కుమార్ ప్రసాద్
posted on Jun 7, 2024 @ 9:58AM
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా నిరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీరభ్ కుమార్ ప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ కొత్త సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం (జూన్ 6) ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పుడే ఆయన ఏపీ కొత్త సీఎస్ గా నియమితులయ్యే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి.
తాజాగా ఆయన ఏపీ సీఎస్ గా నియమితులయ్యారు. నీరభ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత సీఎస్ కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం (జూన్ 6) సెలవుపై వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా చంద్రబాబు మౌఖికంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. జవహర్ రెడ్డి ఈ నెలాఖరుకు పదవీవిరమణ చేయనున్న సంగతి తెలిసిందే.