Read more!

ఖజానా నిల్.. ఉద్యోగుల డీఏ చెల్లింపులు బంద్! ఏపీ ఫ్యూచరేంటో? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రాష్ట్ర ఖజానాలో పైసా కూడా లేని పరిస్థితి వచ్చింది. కనీసం ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏను కూడా చెల్లించలేని హీన దుస్థితికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్. రెండు రోజుల క్రితమే ఉద్యోగులకు డీఏ ప్రకటించింది జగన్ సర్కార్. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. జనవరి 1, 2020 నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన  డీఏ అదనపు వాయిదా చెల్లింపులూ ఆపేసింది. జనవరి 1, 2020 నుంచి జూన్‌ 30, 2021 వరకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించే పరిస్థితి లేదని తేల్చేసింది ఏపీ ప్రభుత్వం. 
                                  

ఉద్యోగుల డీఏ చెల్లింపులు వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం.. తమపై విమర్శలు రాకుండా తెలివిగా వ్యవహరించింది. ఆ నెపాన్ని కేంద్రంపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కోవిడ్ , లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం జూలై 2021 వరకు డీఏ చెల్లింపు నిలిపేసింది. ఇదే కారణం చూపుతూ జగన్ సర్కార్ కూడా ఉద్యోగుల చెల్లింపుల నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. చెల్లింపులు వాయిదా వేస్తూ తాజాగా ఇచ్చిన జీవోలో కేంద్రం నిర్ణయాన్ని కూడా పొందుపరిచింది. రాష్ట్రం కూడా అదే  పరిస్థితుల్లో ఉండటంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

 

ఏపీ ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం డీఏ  27. 248 నుంచి 30.392కు పెరిగింది. 2021 జనవరి జీతాలతో కలిపి క్యాష్ రూపంలో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2018 జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు మొత్తం 30 నెలల బకాయిల్ని  3 సమభాగాల్లో పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తామని జీవోలోనే పేర్కొంది. సీపీఎస్ వారికైతే 30 నెలల ఎరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10 శాతం పాన్ అక్కౌంట్ కు జనవరి జీతాల చెల్లింపు అనంతరం అంటే 3 సమాన భాగాల్లో జమ చేస్తామని వివరించింది. ప్రభుత్వ ప్రకటనతో సంతోషించిన ఉద్యోగులకు కొన్నిగంటల్లోనే నిరాశ మిగిల్చింది జగన్ సర్కార్.  

 

డీఏ చెల్లింపులు వాయిదా వేస్తూ సర్కార్ ఇచ్చిన తాజా జీవోపై ఏపీ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. రెండేళ్లుగా పెండింగ్ ఉన్న బకాయిలను మళ్లీ వాయిదా వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు డీఏ ఇవ్వలేని పరిస్థితికి ఏపీ దిగజారిపోయిందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం జీవో ఇచ్చినప్పుడు  కేంద్రం నిర్ణయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు, ఉద్యోగులకు ప్రకటించిన జీవో 3.114 శాతం. డీఏగా ప్రభుత్వం అదనంగా ఇచ్చే డబ్బులు వందల కోట్లలోనే ఉంటాయని చెబుతున్నారు. అలాంటి వందల కోట్ల రూపాయలు కూడా చెల్లంచలేక సర్కార్ చేతులెత్తేస్తే.. రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదనే ఆందోళన ఉద్యోగులు, జనాల్లో వ్యక్తమవుతోంది. 

 

మరోవైపు నవంబర్ నెలలో వారం రోజులు గడిచినా.. ఏపీలోని ఇంకా  40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందలేదని తెలుస్తోంది.  రాష్ట్ర ఖజానాలో నికధులు లేకపోవడంతో  ఆర్థికశాఖ ఏం చేయలేని పరిసత్థిలో ఉంది. కొవిడ్‌ విధుల కోసం నాలుగు నెలల క్రితం కొత్తగా భర్తీ చేసుకున్న వైద్యులు ఇప్పటి వరకు  నెల జీతమూ కూడా తీసుకోలేదట. రాష్ట్రానికి అప్పుల సమీకరణకు ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోవడంతో ఈ గండం తలెత్తిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

 

ఆర్థిక గండం నుంచి గట్టెక్కేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అప్పుల కోసం బ్యాంకులతో ప్రభుత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. గురువారం సచివాలయంలో ఐదు బ్యాంకులతో ఆర్థికశాఖ అధికారులు అప్పుల కోసం చర్చలు జరిపారు. తక్షణమే రూ. 6,000 వేల కోట్లు అప్పు కావాలని బ్యాంకర్లను కోరగా..  ప్రస్తుతం ప్రభుత్వానికి గ్యారంటీ స్పేస్‌ రూ. 6000 కోట్లు మాత్రమే ఉండడంతో .. ఆ ఐదు  బ్యాంకులు కలిసి ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది.  ఖజానాలో ఆ నిధులు జమ కాగానే పెన్షనర్లకు, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇవ్వలాని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సోమవారం వరకూ ఇది జరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

 

జగన్ సర్కార్ అస్తవ్యస్థ విధానాల వల్లే ఏపీ ఖజానా ఖాశీ అయిందని జనాలు ఆరోపిస్తున్నారు. ఆర్థిక నియంత్రణ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం వల్లే గడ్డు పరిస్థితులు వచ్చాయంటున్నారు ఆర్థిక శాఖ నిపుణులు. జగన్ ప్రభుత్వం జవాబుదారి తనం లేకుండా ముందుకు వెళుతుందని, అడ్డగోలుగా నిధులు ఖర్చు చేస్తుందనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. తమ సొంత ఇమేజ్ పెంచుకోవడానికి, ప్రజల్లో క్రేజీ పొందాలనే ఉద్దేశ్యంతో అవసరం లేని వాటికి భారీగా నిధులు ఖర్చు  చేస్తూ.. అత్యంత కీలకమైన వాటిని విస్మరిస్తున్నారని చెబుతున్నారు. ఖజానా ఖాళీ అయిందంటే రాష్ట్రం దివాళా తీసినట్టేనని వారు  చెందుతున్నారు. ఏ ప్రభుత్వానికికైనా ఆర్థిక నిర్వహణే అతి ముఖ్యమైన,, అది గాడి తప్పిదే తలెత్త పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితి రావడం కలవరం కల్గించే విషయమని చెబుతున్నారు.