Read more!

నవనీత్ కౌర్ పై కేసు

అబ్ కీ బార్ 400 బహార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి హైదరాబాద్ లోకసభ స్థానం  మీద పూర్తి కాన్ సన్ ట్రేషన్ చేస్తోంది. 40 ఏళ్లుగా హైద్రాబాద్ లోకసభ స్థానాన్ని గెలుస్తూ వచ్చిన మజ్లిస్ పార్టీని ఓడించడానికి బిజెపి అధిష్టానం భారీ వ్యూహంతో ఉంది. ఎవరూ ఊహించని  మహిళా అభ్యర్ధిని రంగంలో దించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్  షో నిర్వహిస్తే దేశవ్యాప్తంగా పేరున్న సెలబ్రిటీలను రంగంలో దించుతోంది. ఒకప్పుడు తెలుగు సినిమాల హీరోయిన్ అయిన నవనీత్ కౌర్  హైదరాబాద్ బిజెపి ఎంపి అభ్యర్థి మాధవీలత  తరపున ప్రచారానికి వచ్చి  కేసులో ఇరుక్కున్నారు. 
హైదరాబాద్ లోని షాద్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల షాద్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవనీత్ కౌర్ ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్థాన్ కు వేసినట్లే’నన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా పరిగణించడంతో పోలీసులు నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే మాధవీలతపై మజ్లిస్ పార్టీ ఈసీ కి ఫిర్యాదు ఇస్తే కాంగ్రెస్ పార్టీ పోలీస్ కేసు నమోదు చేయించడం చర్చనీయాంమైంది.