Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 23



    స్నేక్ పాయిజన్ అతని శరీరంలోకి ప్రేవేశించిన వెంటనే ఆ విషం అతని రక్తంలో కలిసింది. కానీ విషపూరితమ్తెన అ రక్తం గుండె వరకూ ప్రవహించకముందే అతడి గుండె కదిలికలు ఆగిపోయాయని వివరణ ఇచ్చిన డాక్టర్ నోట్ ను మరొకసారి శ్రద్ధగ  పరికించి చూసింది.

    పాము కరిచింది అన్న భీతితోపాటు  విషం తన నరనరాన పాకివెళ్ళిపోతోందని అతడు గ్రహించిన వెంటనే చావు తప్పదనే విషయం అతనికి అర్ధమ్తెంది. ఆ భితితోనే   హఠత్తుగా గుండె ఆగిపోయి  వుండవచ్చు నని....అందువల్ల నే విషపు రక్తం గుండెకవాటాలలోకి వెళ్ళకపోయినా  అతనంత  తోదంరగా మరణించడానికి ఆస్కారం కలిగిందని డాక్టర్ అభిప్రాయ పడ్డాడు.

    కానీ విషం వల్లనే  అతని గుండె ఆగిపోయిందా, లేదా అనేది  పరిశీలిస్తే కాదనే  అనిపించింది దిరజకు.

    అబ్బులు పామువల్ల కాకుండా భీతి, భయం వల్ల కూడా చనిపోయివుండవచ్చునేనే సందేహాన్ని వెలిబుచ్చిన డాక్టర్ అభిప్రాయాన్ని పరిగణన లోకి  తీసుకుంటే ఆ భీతి మరెందువల్లన్తేనా ఏర్పడి వుండవచ్చు.

    అతని మరణం వెనక తప్పనిసరిగా ఏదో మిస్టరీ  వుండి వుండాలనే అభిప్రాయానికి వచ్చిందామె. అదేదో తేల్చుకోవలసిందేననే గట్టి నిర్ణయం తిసుకున్నదామే.

    అప్పటికి అర్ధరాత్ర్హి దాటడంతో బెడ్ ల్తెటు ఆర్పింది.

    బెడ్ ప్తె పడుకుని దుప్పటిని ప్తెకి లాక్కుని కళ్ళు మూసుకున్నది ఇన్స్ పెక్టర్ ధీరజ.

    కానీ.... అప్పడే కాలింగ్ బెల్ మ్రోగడంతో ఇంత అర్ధరాత్రివేళ వచ్చేదేవారా అని ఉలిక్కిపదిందామే.

    కళ్ళు నులుముకుంటూ వెళ్ళి తలుపు తెరిచిందామే.

    ఎదురుగా వున్న వ్యక్తినీ చూడటంతో ఆమెకు మాటలు పెగలలేదు.

    ఇన్స్ పెక్టర్ ధీరజ కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని చూసి అతడు తమాషాగా నవ్వాడు.

    తనే  చొరవగా లోనికి తలుపు వేశాడు.

    అప్పటికి కూడా ధీరజ బొమ్మలా నిలుచునే వుంది.

   
               *    *    *    *

   
    కాలింగ్ బెల్ మోగింది......

    ప్రేమ్  చంద్ విసుగ్గా కళ్ళు తెరిచాడు.

    అతని చూపులు వాల్ క్లాక్ ప్తెకి మరలాయి.

    ఏడు గంటలు.....

    అప్పడే  తెల్లవారిందా అనుకొని కళ్ళు సులుముకుంటూ బెడ్ దిగా వచ్చింది.

     ఆ రోజు ఆదివారం.....యూనివర్శిటికి  వెళ్ళే పని లేదు. నిన్నాన్నే అతని భార్య పుట్టింటికి వెళ్ళింది.

    అందుకే బద్దకంగా పడుకునే  వుండిపోయడతను.

    'పాలవాడు అయివుంటాడు.... వెధవ.... ఈ రోజు పోయాకపోతే వాడి సొమ్ము ఏదో  పోయినట్టు....' తనలో తను విసుక్కుంటూ వెళ్ళి  తలుపు తెరిచాడు.

    మరుక్షణం విసురుగా నెట్టుకుంటూ లోపలికి  వచ్చాడు రమేష్.

    అతడ్ని చూడగానే వింతగా  ముడివడింది ప్రేమ్ చంద్  భృకుటి

    "రమేష్....నువ్వా?"

    "అంతేకాదు మాస్టారు.... మేము కూడా వచ్చాం" అంటూ  చాటు నుంచి ముందుకు వచ్చారు అనిల్,వెంకట్.

    "ఏమిటోయ్....ముగ్గురు మిత్రులూ ఇంత ప్రొద్దుటే వచ్చి నాకు  సుప్రభాతం పాడి మరి అనిల్, వెంకట్.

    చిరునవ్వుతో అంటూ  లోపలకి నడిచాడు ప్రేమ్ చంద్.

    అనిల్ సమాధానం  చెప్పకుండా తలుపు బోల్డ్ బిగించాడు.

    ఆ చప్పడుకు తల తిప్పి చూసిన ప్రేమ్ చంద్ వులిక్కిపడ్డాడు.

    "ఏం చేస్తున్నావు నువ్వు?"

    "మీతో మాట్లాడవలసింది చాలా వుంది మాస్టారు."

    "అయితే మాత్రం.....దానికి తలుపు వేయాలా?" ప్రేమ్ చంద్  అనుమానంగా  ప్రశ్నించాడు.

    "ముందు చూపుతో వేస్తున్నాడు లెండి."

    "అంటే...." ఆర్కియాలజి హెడ్ ఆఫ్  ది డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్  ప్రేమ్ చంద్  కళ్ళలో లీలగా ఏదో భయం  పొడసూపింది.

    "మీరే  చూస్తారుగా!"

    కుర్చీలాక్కుని అతని ముందు కూర్చుంటూ అన్నాడు వెంకట్.

    ప్రేమ్ చంద్  అయోమయంగా బెడ్ ప్తె కూర్చున్నాడు.

    అతనికి చెరొకవ్తెపునా ఆ బెడ్ ప్తె చొటు చేసుకున్నారు రమేష్, అనిల్.

    "వాట్ ఈజ్ దిస్.... కనిసం మీ గురువునని కూడా మర్యాద లేకుండా ఈ కూర్చోవడం ఏమిటి? డిసిప్లి న్ ను  తాలరేట్  చేస్తే నేను సహించను......

    ఇంకా ఏదో చెప్పబోతున్న ప్రేమ్ చంద్  మాటలు పూర్తికానే లేదు......

    "అది సరికాని మాస్టారు.....నీలిమా లెక్చరర్ ఇంతకూ మనిషా లేక దయ్యమా?"

    రమేష్ ప్రశ్న  విన్న  ప్రేమ్ చంద్  ముఖంలో రంగులు మారాయి.

    "వాట్ ఆర్ యూ టాకింగ్?"

    "మాస్టారు.... మాకూ ఇంగ్లీషు వచ్చు..... నా ప్రశ్నకు జవాబు  కావాలి....చెప్పండి."

    "జవాబా? మీ ప్రశ్నకు జవాబు కావాలి..... చెప్పండి."

    అవునన్నట్టు ముగ్గురూ తలలు వూపారు.

    "ఏమో నాకెలా తెలుస్తుంది? అదేదో మీకే తెలియాలి."

 Previous Page Next Page