"సరే- మేమే చెబుతున్నాం.....ఆమె మనిషికాదు దయ్యమని..... మీరేమంటారు?" అనిల్ అందుకున్నాడు.
"నా అభిప్రాయం కూడా అదే" ఠక్కున సమాధానం చెప్పాడు ప్రేమ్ చంద్ .
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?"
"అదా....అ....ది.....?" నీళ్ళు నమిలాడే తప్పు సమాధానం ఇవ్వలేకపోయాడు ప్రేమ్ చంద్.
"మీరు చెప్పలేరు. ఎందుకంటే- ఆమె దయ్యమ్తెంది అంటే ఎలా అయిందని అడుగుతాం కాబట్టి.....అవును కదూ?" రమేష్ ఎత్తిపొడిచాడు.
"ముందు మీరు బయటకు వెళతారా లేదా?" కోపంగా అన్నాడతను.
"మాస్టారు! మీరు అరిచి గి పెట్టినా మేము కదలంగాక కదలం.... మా బారినుంచి పారిపోవడానికి మీకు అవకాశం లేకుండా ఆ తలుపు వేసిన కారణం మికిప్పడు అర్ధమ్తెంది కదూ? దయ్యమ్తెన నీలిమ గురించి నీకేం తెలుసో మాకు చెప్పాలి."
"మీ వల్లనే నీలిమ చచ్చి దేయ్యమయింది. అంతకన్నా నాకేం తెలియదు."
"సరే! అలానే అనుకుందాం. అది నీ కంటితో నువ్వు చూశావా అసలు నీకేం తెలుసో, నీకెంతవరకు తెలుసో మాకు చెప్పాలి. అప్పడే నిన్ను వదిలేది.....లేదంటే నిన్నేం చేస్తామో మాకే తెలియదు" అనిల్ కర్కశంగా అన్నాడు.
వాళ్ళవ్తెపు పరిశీలనగా చూసి, ఇక చెప్పక తప్పదని అర్ధమయిందతనికి.
తనకు ఏం తెలుసో చెప్పడం మొదలు పెట్టాడతను.
వింటున్న మిత్రులు ముగ్గురూ ఆశ్చర్యంతో తలమునకల్తే పోతున్నారు.
* * * *
గెస్ట్ హౌస్ లో ల్తెట్లు వెలిగాయి.....
అబ్బులు పాముకాటు వల్ల చనిపోయిన రాత్రి అది.....
పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ లోనికి వచ్చిన వ్యక్తివ్తెపు చిరునవ్వుతో చూశాడు వ్తెస్ చాన్సలర్.....
"పని అయిపోయినట్టే...."
వచ్చి రావడంతోనే అన్నాడతను.
"అయితే ఇక మనకు యిబ్బంది ఏమీ లేదంటావా?" అతని వ్తెపు చూస్తూ ప్రశ్నించాడు వ్తెస్ చాన్సాలర్.
"ప్రస్తుతం లేనట్టే....."
"నిజమో, కాదో ఇప్పుడు ఆలోచింఛి బుర్ర చెడగొట్టుకోవడం అనవసరం. ఒక అనుమానం వచ్చింది మనకు. అది నిజమనే భావించి దాని నుంచి ఎలా బయటపడాలో పథకం ప్రకారం పని పూర్తిచేశాం. తీరా అంతా అయిపోయాక ఇప్పుడు మనం చేసింది తెప్పే మోననుకోవడం శుద్ధ ఆవివేకం" సీరియస్ గా చెప్పాడతను.
రెండు నిమిషాలు ఆ ఇద్దరిమధ్య నిశ్శబ్దం.....
"బట్! నేను చేయవలసినదంతా చేశాను. కనిసం ఇదయినా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చూడవలసిన బాధ్యత నిది....అర్ధమ్తెండా?"
మౌనంగా తలూపాడు వ్తెస్ చాన్సలర్.
"మనం ఇక్కడ ఎక్కువసేపు వుండటం మంచిదికాదు."
"అబ్బులు తప్పు ఈ సమయంలో మనలను చూసినవాళ్ళు లేరు- ఇక్కడకు వచ్చేవాళ్ళూ లేరు. ఎందుకంత కంగారు?"
"షటప్! తెలివితక్కువగా మాట్లాడకు. అబ్బులు ఇంతకుముందే బయటకు వెళ్ళిన సంగతి మనిద్దరికీ తెలుసు రేపు ఎవరు పరిశోధన చేసినా ఆ విషయమే బయట పడాలంటే మనం ఇప్పుడు ఇక్కడ వుండకూడదు- అనవసరమయిన వాదనలతో కాలక్షేపం చేయకుండా వెంటనే బయలుదేరు....."
మారు మాట్లాడకుండా బయటకు నడిచాడు వ్తెస్ చాన్స్ లర్.
గెస్ట్ హేస్ లోని ల్తెట్లు ఆరిపోయాయి.
వెనుకవ్తేపున పార్క్ చేసి వున్న నేవిబ్లూ కలర్ మారితి కారులోకి చేరుకున్నారిద్దరూ
లెక్చరర్ నీలిమ వుపయోగించే కారు ఇదే.....
తొలిసారిగా ఎఅమేష్ మిత్రబృందాన్ని నీలిమ దయ్యం భయపెట్టిన రోజు ఈ గెస్ట్ హౌస్ లోనికి వచ్చిన నేవిబ్లూ కలర్ కారు అప్పటినుంచి లోపలే వుందిపోయింది.
ఆ రోజు రాత్రి నీలిమ డ్రాయివ్ చేసుకుంటూ వచ్చింది.
తరువాత వెంకట్ కంటికి గాల్లో తేలిపోతున్న తెల్లటి ఆకారం , నిలిమదని గుర్తుపట్టిన మిత్రబృందం షాక్ తినడంతో అసలు కథ మొదలయింది.
అప్పటినుంచి ఆ కారు అక్కడే వున్న విషయం ఎవరూ పట్టించు లేదు.
ఇప్పుడు అదే కారులో ఈ ఇద్దరూ బయలుదేరారు.
వ్తెస్ చాన్సలర్ ప్రక్కకనున్న వ్యక్తి....ఇందస్తియలిస్ట్ ముకుందరావు..... అనిల్ తండ్రి!
* * * *
తెల్లవారింది....
ఇన్స్ పెక్టర్ ధీరజ కాలకృత్యాలు తీర్చుకుని స్టేషన్ కు బయలు దేరింది.
రొటిన్ వర్క్ పూర్తి అయిపోగానే- నీలిమ ప్తేలు తెరిచి అబ్బులు డెత్ రిపోర్ట్ లో ప్తేలు చేసింది.
అబ్బులు మరణం వెనక ఏదో బలమ్తెన కారణం వుందనే నిశ్శయనికి వచ్చింది ఇన్స్ పెక్టర్ ధీరజ.
లెక్చరర్ నీలిమ అదృశ్యమ్తెనదానికి, రమేష్ మిత్ర బృందానికి ఏదో సంబంధం వుండి వుండాలని, అలానే అబ్బులు మరణానికి, ఆ గెస్ట్ హౌస్ కు వచ్చే మిత్ర బృందానికి ఏదో ఒక లింక్ వుండి వుంటుందనీ ఆమె అనుమానిస్తోంది.