సుధాకర్ మాటలు ఇంకా పూర్తి కానేకలేదు.
"ఎస్ సర్! నీలిమ ఎలా దయ్యం అయ్యిందనే విషయం వదిలేయడమే మంచిది ఎందుకంటే ఆమె చావుబతుకల్లో హాస్పిటల్ లో వున్నది. దయ్యం మనిషి కావడం అనంభవం. మరి నిలిమకు ట్రీట్ మెంట్ జరగడం చూస్తున్నాం. అయినా ఇంకా ఆమె ఎలా చనిపోయిందోనని, ఎవరు చంపారంటే ఎవరు చంపారో చెప్పండని మనలో మనం ప్రశ్నించుకోవడం అర్ధరహితం కానీ ఇన్స్ పెక్టర్ ధీరజ....నీలిమ విషయంలో మనందరిని దోషులుగానే భావిస్తుంది....ఆ విషయం మనం మరచిపోకూడదు...." అనిల్ సుదీర్ఘంగా విశ్లేషించాడు.
"యూ ఆర్ కరెక్ట్ ....మీ ముగ్గురికన్నా నన్నే ఎక్కువ అనుమానిస్తుందామే" సుధాకర్ అన్నాడు.
"ఏమో! ఎవరు చూడొచ్చారు? మీరే ఆమెను ఏదో చేసి వుండవచ్చుగా " అన్నాడు రమేష్.
"షటప్ ! మీ మిత్రులు ముగ్గురూ కలిసి ఆమెను ఏదో చేసివుంటారు, అలా చేయలేదని గ్యారంటి ఏమిటి?"
సుధాకర్ లో కోపం పెరిగిపోయింది.
"ఓకే....ఓకే.....ఆ విషయాన్నీ వదిలేద్దాం. మనందరికి సమస్యలని తెచ్చిపెడుతున్న నీలిమ స్పృహలేకుండా హాస్పిటల్ లో చ్రిన శుభనందర్బంగా మనందరమూ హేపిగా పార్టి చేసుకోవడానికి ఇక్కడ చేరాం. ఆ విషయం మరచిపోతే ఎలా? " రమేష్ చిరునవ్వుతో వాతావరణాన్ని తేలికపరిచాడు.
అందరి చేతుల్లోనూ గ్లాసులు ప్తెకి లేచాయి.
దాదాపు అరగంటపాటు త్రాగుతూనే వున్నారు.
సిగరెట్ త్రాగుతూ గాలి పిల్చుకోవడానికన్నట్టు సుధాకర్ బయటకు వెళ్ళాక తన పోర్షన్ ముందునుంచి బయటనున్న గేటు తెరిచి రోడ్డు మీదకు అడుగుపెట్టాడు.
ఐదు నిమిషాల తరువాత వెనుదిరిగాడతను.
సరిగ్గా నాలుగు అడుగుల్తెనా వేశాడో లేదో....
మెయిన్ గెట్ తెరిచి లోపలనుంచి బయటకు వస్తున్నా ఆకారాన్ని చూసి కెవ్వున కేకవేశాడు సుధాకర్.
* * * *
ఇన్స్ పెక్టర్ షిరాజ తన గదిలో అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తోంది.
టేబుల్ ప్తెనున్న పేపర్లు టేబుల్ ఫాన్ గాలికి రెపరెపలాడుతూ వింత శబ్దన్నీ కలిగిస్తున్నాయి.
రెండు నిమిషాల తరువాత.....
కుర్చీలో కూర్చుని ఆ కాగితాలను చేత్తో తీసుకుని టేబుల్ ల్తెట్ కాంతిలో మరొక సారి పరిశీలనగా చూసింది.
మాజీ మంత్రిగారి గెస్ట్ హౌస్ వాచ్ మెన్ అబ్బులు మెడికల్ రిపోర్టు అది.
అతని మరణ వార్త చాలా ఆలస్యంగా తెలిసింది పోలీసులకు.
వాచ్ మాన్ అబ్బులు శవంప్తె శవపంచాయితి జరిపినప్పుడు కొందరు వచ్చే విషయం బయటపడింది.
అది నీలిమ దర్యాప్తుకు కీలకమ్తెన సాక్ష్యమే!
ముగ్గురు మిత్రులు ఆ గెస్ట్ హౌస్ కు వచ్చే విషయం తెలియకపోతే అబ్బులు మరణాన్ని గురించి అనుమానించాల్సిణ అవసరం వుండేది కాదేమో! అయినా అతని మరణం వెనుక వున్న మిస్టరీ పూర్తిగా చేదించాల్సి వున్నది.
అలానే నీలిమ మూడు రోజులపాటు అదృశ్యమ్తె, నాలుగావరోజు ప్రత్యక్షం అవడం వెనక ఎవరి హస్తం వుందో ఇంతవరకూ తెలియలేదు.
రమేష్ మితబృందంతోపాటు లెక్చరర్ సుధాకర్ కు కూడా ఆమె అంతర్ధకంలో భాగం వుండి వుండాలని ఆమె అనుమానిస్తోంది.
నగరానికి దూరంగా హ్తేవే పక్కన వున్న గెస్ట్ హౌస్ లాంటి చోట నిలిమను బంధించి వుంటే ఎవరికీ ఏ మాత్రం తెలిసే అవకాశం వుండదు. అందుకే ఆ గెస్ట్ హౌస్ లో దాచి వుంచారేమో. అందుకు మిత్రులు ముగ్గురూ సహకరించయినా వుండాలి. లేదా వాళ్ళే చేసి వుండవచ్చు.
అది తెలియాలంటే నలబ్తే ఎనిమది గంటలూ గెస్ట్ హేస్ నీ అంటి పెట్టుకుని వుండే వాచ్ మెన్ అబ్బులుని ప్రశ్నించాలి.
కానీ ఆ వాచ్ మెన్ ఇప్పుడు ప్రాణాలతో లేడు.
తన అనుమానం అతనిప్తెకి మళ్ళకముందే తెలివిగా అతన్ని తప్పించారేమో?
అదే నిజమ్తె వుంటే నీలిమ అదృశ్యం వెనక ఎవరి పాత్ర్హ వున్నదో, ఎంతవరకు వున్నదో తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు.
అబ్బులు మరణం ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఎవర్తెనా హత్య చేశారా? ఏమ్తెంది ఇదమిద్దంగా తేల్చడానికి నరయిన ఆధారాలు లభించడం లేదు.
ప్రమాదవశాత్తూ జరిగిన మరణమేనని డాక్టర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
కానీ.....తనకు నమ్మకం చిక్కడం లేదు.
తన ఊహకు అందనిదేదో జరిగిందని ఆమెలోని సిక్స్ త్ సెన్స్ హెచ్చరిస్తోంది.
అందుకే వాటిని నిశితంగా పరిశీలిస్తున్నదామే!
అబ్బులు మృతదేహం దగ్గరే చనిపోయి వున్న పాము కళేబరాన్ని బట్టి ఆ పాము కరవడం వలెనే అతడు చనిపోయాడని అనుకోవలసి వస్తుంది. డాక్టర్లు కూడా పాము కాటు వలెనే అతడు చనిపోయాడని నిర్ధారించారు.
పాము విషం అతని బ్లడ్ లో వుందని కెమికల్ రిపోర్టులో తేలింది.
ఉన్నట్టుండి ఆమె దృష్టి ఒక పాయింట్ దగ్గర ఆగిపోయింది.