శివుడి ఆభరణాల రహస్యం.. వాటిని ఇంట్లో ఉంచుకుంటే ఏమవుతుంది..

 


హిందూ మతంలో దేవీ దేవతలు పట్టు వస్త్రాలు, పీతాంబరాలు, మిరుమిట్లు గలృొలిపే ఆభరణాలు ధరించి ఉంటారు.  వీటిలో ఈశ్వరుడు చాలా ప్రత్యేకం.  ఈశ్వరుడు ఎలాంటి మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించడు.  ఆయన ఆభరణాలుగా ధరించే ప్రతిదీ మిగిలిన దేవుళ్లకు చాలా విభిన్నంగా ఉంటాయి. శివుడు ధరించే ఆభరణాలు ఏమిటి? వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల జరిగేది ఏమిటి? పూర్తీగా తెలుసుకుంటే..

హిందూ మతంలో, శివుని ఆభరణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివుని ఆభరణాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రయోజనాలే కాకుండా ఆయన ఆశీస్సులు కూడా లభిస్తాయట.  

 ఎద్దు..

 శివుడి వాహనం ఎద్దు. ఎద్దునే నంది అని పిలువబడుతుంది. నంది ఎల్లప్పుడూ శివుడితోనే ఉంటుంది. శివుడు నంది  పై స్వారీ చేయడం అంటే శివుడు ఎల్లప్పుడూ ధర్మంపై స్వారీ చేస్తాడని అర్థం. ఇంట్లో నంది విగ్రహాన్ని చిన్నగా ఉంచుకోవడం  ద్వారా దుష్టశక్తి  ఇంట్లోకి ఎప్పుడూ ప్రవేశించదని చెప్తారు.

చంద్రుడు..

చంద్రుడు మనస్సుకు, చల్లదనానికి సంబంధించినవాడు. శివుని తలపై చంద్రుడు ఆసీనుడై ఉంటాడు. శివుని తలపై చంద్రుడు ఉండటం అంటే మనస్సు చంచలమైనది కాబట్టి మనస్సు మిమ్మల్ని ఎప్పుడూ ఆధిపత్యం చేయనివ్వకూడదు అని అర్థం.  అయితే లోహంతో చేసిన చంద్రుడిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా,  సంతోషంగా ఉంటుంది.

ఢమరు..

శివుడి చేతిలో ఢమరు ఉంటుంది.  ఈ  డమరు కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. డమరు విశ్వాన్ని సూచిస్తుంది. డమరును ఇంట్లో ఉంచుకోవడం వల్ల విషయాలు ఎప్పుడూ అదుపు తప్పకుండా ఉంటాయట.

త్రిశూలం..

శివుని త్రిశూలం సత్వ, రజో, తమో అనే మూడు గుణాలను సూచిస్తుంది. శివుని ఈ అలంకారం అంటే ఈ మూడు గుణాలూ శివుని నియంత్రణలో ఉన్నాయని అర్థం. ఇంట్లో త్రిశూలం ఉంచుకోవడం వల్ల మనస్సు, మెదడు, శరీరం శక్తివంతంగా ఉంటాయి.

పాము..

శివుని ఆభరణాలలో పాము కూడా ఉంటుంది. అయితే పాము జాగ్రత్త,  అప్రమత్తతకు చిహ్నం. పామును ధరించడం ద్వారా శివుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాడని సందేశాన్ని ఇస్తాడు. ఇంట్లో పాము బొమ్మను ఉంచుకోవడం వల్ల శత్రువులను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.


                                  *రూపశ్రీ.


More Shiva