పూజ చేసిన తరువాత పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!
ఇంట్లో పూజ చేసినప్పుడు వాతావరణంలో శాంతి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ సమయం ఆధ్యాత్మిక శుద్ధికి మాత్రమే కాకుండా మానసిక, శారీరక సమతుల్యతకు కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అన్ని నియమాలను పాటించి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. కానీ చాలా సార్లు పూజ తర్వాత తెలియకుండానే కొన్ని పనులు చేస్తారు. ఇది ఈ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో చేసే పూజ విజయవంతం కావాలని, ఫలవంతం కావాలని మీరు కోరుకుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం.
కఠినంగా మాట్లాడటం..
పూజ తర్వాత వెంటనే ఎవరినైనా దుర్భాషలాడినా లేదా శపించినా, అది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. పూజ సమయంలో మాత్రమే ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఇది తప్పు.. పూజ తరువాత కూడా మాటలను అదుపులో ఉంచుకోవాలి. శరీరం, మనస్సు రెండూ స్వచ్ఛమైన స్థితిలో ఉంచుకోవాలి.
ఆహారం..
పూజ చేసిన తరువాత మద్యం తీసుకోవడం లేదా మాంసాహారం తినడం నిషేధం. చాలామంది పూజ అయిపోయింది కాబట్టి ఏదైనా తినవచ్చు, తాగవచ్చు అనుకుంటారు. కానీ పూజ తరువాత ఇలా చేయడం వల్ల అంతకు ముందు చేసిన పూజకు ఎలాంటి ఫలితం ఉండదు.
జుట్టు, గోర్లు..
పూజ చేసిన సమయంలో ఇంట్లోనూ, పూజ చేసిన వ్యక్తిలోనూ సానుకూల శక్తి నిండి ఉంటుంది. కాబట్టి జుట్టు లేదా గోర్లు కత్తిరించడం శుభప్రదంగా పరిగణించబడదు. ఇది సానుకూల శక్తిని తగ్గించవచ్చు.
అవమానం..
పూజ సమయంలో ఒక సాధువు లేదా ఋషి ఇంటికి వస్తే, వారిని గౌరవించాలి. వారిని విస్మరించడం లేదా తలుపు నుండి దూరంగా వెళ్లమని చెప్పడం, వారిని వెళ్లిపోమని చెప్పడం అశుభంగా పరిగణించబడుతుంది.
ప్రసాదం..
దేవునికి సమర్పించిన ప్రసాదాన్ని కొంత సమయం తర్వాత మాత్రమే భక్తితో స్వీకరించాలి. ప్రసాదాన్ని వెంటనే తినడం వల్ల దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తగ్గుతుంది.
ఉప్పు..
పూజ తర్వాత ఉప్పు కలిపిన ఆహారం తినడం వల్ల శరీరం శక్తి స్థితి చెడిపోతుందని నమ్ముతారు. ఈ సమయంలో తేలికైన, సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినాలి.
పాదాలు..
పూజ తర్వాత శరీరంలో ఆధ్యాత్మిక శక్తి చేరుతుంది. ఇది ఎక్కువ కాలం నిలిచి ఉండాలి అంటే వెంటనే పాదాలను కడుక్కోకూడదు. ఇందుకే పూజ అయిన వెంటనే లేదా గుడి నుండి రాగానే కాళ్లు కడుక్కోకూడదని చెబుతుంటారు.
*రూపశ్రీ.
