రాహు దోషాన్ని పోగొట్టే అద్బుతమైన చిట్కా.. ఇలా చేస్తే సమస్యలు మాయం!


భారతీయులు జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. జ్యోతిష్యంలో బాగంగా వివిధ రకాల దోషాల గురించి చెబుతూ ఉంటారు.  గ్రహాల దోషాల వ్యక్తిని ఏదో ఒక ఇబ్బందిలో నెట్టేస్తూ ఉంటాయి.  వీటిలో రాహు దోషం ప్రదానమైనది. రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. జాతకంపై రాహు దోషం ప్రబావం ఉంటే అది చాలా ఇబ్బందికర పరిస్థితులను కల్పిస్తుంది. ఎవరి జీవితంలో అయినా రాహువు అశుభ స్థితిలో ఉంటే జీవితంలో అడ్డంకులు తలెత్తడం మొదలవుతుంది. జీవితంలో అబివృద్ది ఆగిపోతుంది. ఎంత కష్టపడినా, ఎంత చేసినా విజయం జారిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దీనికి జ్యోతిష్య పండితులు ఒక అద్బుతమైన పరిహారాన్ని చెబుతున్నారు. కేవలం మూడు బుధవారాలు పరిహారాన్ని పాటిస్తే రాహు దోషం తొలగి జీవితంలో సమస్యలు చాలా వరకు తగ్గుతాయని అంటున్నారు. ఇందుకోసం ఏం చేయాలంటే..

చేపలు..

చేపల ద్వారా రాహు దోషాన్ని తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇది ఆశ్చర్యంగానూ, నమ్మకశక్యంగానూ అనిపించవచ్చు. కానీ ఈ పరిహారం చాలాబాగా పనిచేస్తుందట.

చేపల మార్కెట్లో  చేపలు అమ్ముతూ ఉంటారు.  బ్రతికి ఉన్న చేపను కొనుగోలు చేయాలట.  ఆ చేపను తీసుకుని మెల్లిగా చెరువు లేదా వేరే నీటి ప్రాంతానికి వెళ్లాలట.  తనకున్న రాహు దోషం తొలగిపోవాలని మనసులో ప్రార్థిస్తూ ఆ చేపను నీటిలో వదిలేయాలట.  దీని వల్ల చేపకు ప్రాణ బిక్ష పెట్టినట్టు అవుతుంది. ఇది జాతకంలో రాహు దోష ప్రభావాన్ని తగ్గిస్తుంది అంటున్నారు.

కేవలం పైన చెప్పుకున్న పరిహారం మాత్రమే కాకుండా వీలున్నప్పుడల్లా చేపలు ఉండే చెరువు లేదా నది,  నీటి ప్రాంతాలకు వెళ్లి చేపలకు ఆహారం వేయాలి.  ఇది కూడా రాహు దోష ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుందట.  

ఇంట్లో అక్వేరియం తీసుకొచ్చి అందులో చేపలు పెంచుతూ వాటికి ఆహారం వేస్తూ ఉన్నా రాహు దోషం ప్రబావం తగ్గుతుందని అంటున్నారు. ఇది శ్రీ మహావిష్ణువును,  అమ్మవారిని శాంతపరిచేందుకు ఒక మార్గం అని అంటున్నారు. ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం ఉంటే రాహు దోషం చాలా వరకు తగ్గుతుందని అంటారు.  అందుకే ఈ పరిహారం బాగా పనిచేస్తుందని అంటున్నారు.

ఇందులో పేర్కొన్న విషయం జ్యోతిష్య పండితులు సోషల్ మీడియాలో పేర్కొన్న విషయం ఆధారంగా పొందుపరచడం జరిగింది.  దీనికి ఎలాంటి ప్రామాణిక ఆధారాలు లేవు. గమనించగలరు..

                                         *రూపశ్రీ


More Aacharalu