సమ్మర్ లో చర్మఛాయ చిట్కాలు సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది బయటకు రావడానికి కూడా బయపడతారు ఎక్కడ ముఖం నల్లబడిపోతుందో అని. అలా అని ఎక్కడికీ వెళ్లకుండా ఉండలేము కదా. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసారిగా పాటించుకోవాలి. పెరుగు... ఈ వేసవిలో పెరుగు తింటే ఎంత చలవ చేస్తుందో మన ముఖారవిందాన్ని కాపాడటంలో కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో చూద్దాం. 1. ఈ సమ్మర్ లో ఎండ వల్ల నిరంతరం చెమట వస్తూనే ఉంటుంది. దీని వల్ల ముఖంపై రాషస్ రావడం, ముఖం మండటం జరుగుతుంది. అలాంటప్పుడు పెరుగును పట్టిస్తే చల్లగా ఉండటమే కాకుండా అందులో ఉండే జింక్ ముఖానికి ఉన్న టాన్ కూడా పోగొడుతుంది. 2. సూర్యరశ్మి వల్ల ముఖంలో పోషణ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ పొడిబారినట్టు అయిపోతుంది. అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకోవాలి. 3. పెరుగులో ఆరెంజ్ తొక్కల పౌడర్ ను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. 4. పెరుగులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి రాసుకొని ఓ పదినిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల మీ చర్మం మృదువుగా తయారవుతుంది. 5. పెరుగులో పెసరపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ కు మాస్క్ లా వేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.  

మనం ఆచరిద్దాం.. పిల్లలు అనుసరిస్తారు...!   Must Watch Importance of Parent Child Relations in the General Development ... https://www.youtube.com/watch?time_continue=46&v=U8bvNcltj-8  

బంగాళాదుంపతో హేర్ ప్యాక్... జుట్టు పొడవుగా అవుతుంది!!    

చెమట వాసనకి చెక్ పెట్టండి!     ఎంత అందంగా తయారయితేనేం... చెమటతో బట్టలు తడిచిపోతూ, ఆ తడిచిన బట్టల నుంచి వాసన వస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది?! అలాగని ఈ సమస్య గురించి ఎవరికైనా చెప్పుకోవాలంటే సిగ్గు. ఎలా వదిలించుకోవాలో తెలియక విసుగు. చాలామంది పరిస్థితి ఇదే. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా ఇబ్బంది పెట్టే ఈ సమస్య మరీ అంత పెద్దదేం కాదు. ఈ చిట్కాలు పాటించి చూడండి... చిటికెలో సాల్వ్ అయిపోతుంది. - మరీ బిగుతుగా ఉండే బట్టలు వేసుకోకండి. సింథటిక్ వస్త్రాలు కూడా వద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోండి. లో దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్చేయండి. బట్టలు వేడినీటిలో ఉతికి ఎండలో బాగా ఆరబెట్టుకోండి. - రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయండి. బాహుమూలల్ని బాగా శుభ్రం చేసుకోండి. అవాంఛిత రోమాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోండి. అలాగే స్నానానికి యాంటి బయొటిక్ సబ్బుల్ని వాడండి. - తప్పనిసరిగా డియోడరెంట్ వాడండి. ఎప్పటికప్పుడు ఒళ్లంతా చక్కగా టాల్కమ్ పౌడర్ రాసుకోండి. - ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మిరియాలు, అల్లం, వెల్లుల్లి, మసాలాల్ని బాగా తగ్గించండి. శరీర ఉష్ట్రోగ్రతను పెంచే ఆహార పదార్థాలు, పానీయాల జోలికి వెళ్లకండి. - వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు తగండి. శరీరంలో ఉండే మలినాలను తొలగించడంలో దాన్ని మించిన ఎక్స్ పర్ట్ ఇంకెవరూ లేరు. - స్నానం చేసేముందు నిమ్మచెక్కతో బాహుమూలల్ని చెమల ఎక్కువ పట్టే ఇతర ప్రదేశాలన్నీ రుద్దుకోండి. మంచి ఫలితం ఉంటుంది. - తులసి, వేప ఆకులను కలిపి పేస్ట్ లా చేపి... స్నానం చేసేముందు ఒళ్లంతా బాగా రుద్దుకోండి. ఆపైన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. కొన్నాళ్ల పాటు ఇలా చేస్తే సమస్య శాశ్వతంగా తీరిపోయే అవకాశం ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య వెంటాడుతుంటే సిగ్గుపడకుండా ఓసారి స్కిన్ డాక్టర్ ను సంప్రదించండి. తగిన సలహా ఇస్తారు. అవసరమైతే చికిత్స కూడా చేస్తారు. - Sameera

పింపుల్స్ ని సింపుల్ గా  పోగొట్టుకోండి...!    

ఇంట్లో ఇది ఉంటే పార్లర్ అక్కర్లేదు!   ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది. ఒక్కోసారి అది మన చేతిలోనే ఉంటుంది. ఆ విషయం మనకి తెలియక కంగారు పడిపోతుంటాం. ముఖ్యంగా సౌందర్య సమస్యలకి బ్యూటీషియన్ల మీద, డాక్టర్ల మీద ఆధారపడుతుంటాం. నిజానికి చిన్ని చిన్న చిట్కాలతో వాటి నుంచి బయట పడిపోవచ్చు. ఉదాహరణకి... దాల్చినచెక్క ఉంటే చాలు, బోలెడు సమస్యలు తీరిపోతాయి. అదెలా అంటే...   - దాల్చిన చెక్క చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది. స్కిన్ పొడిబారడం వల్ల వచ్చే దురదల్ని తగ్గిస్తుంది. దాల్చినచెక్కని మెత్తని పౌడర్ లా చేసి, దానిలో కాస్త తేనె కలిపి, రాత్రి పడుకోబోయే ముందు దురద ఉన్నచోట రాసుకోవాలి. ఉదయాన్న లేచి చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మంలో తేమ పెరిగి దురదలు తగ్గిపోతాయి. ఏదైనా కుట్టి ర్యాషెస్ వచ్చినా ఈ చిట్కా చక్కగా పని చేస్తుంది.   - దాల్చిన చెక్క పొడిలో నిమ్మరసం కలిపి మొటిమలు, బ్లాక్ హెడ్స్ మీద పూయాలి. ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. కొన్నాళ్లు ఇలా చేస్తే అవి పూర్తిగా మాయమైపోతాయి. మచ్చలు కూడా మిగలవు. - దాల్చిన చెక్కను పొడి చేసి, కొద్దిగా తేనె, కాసింత ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ లా చేయాలి. దీనిలో ఎగ్ వైట్ కలిపి జుత్తుకీ, మాడుకీ పట్టించాలి. పావుగంట సేపు అలా ఉంచి, తర్వాత తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు వదిలిపోతుంది. జుత్తు బలంగా, పొడవుగా పెరుగుతుంది.   - పెట్రోలియం జెల్లీలో దాల్చిన చెక్క పొడి కలిపి పెదవులను బాగా రుద్దుకుంటే పగుళ్లు మానిపోతాయి. డెడ్ స్కిన్ తొలగిపోయి పెదవులు మృదువుగా, అందంగా తయారవుతాయి.   - దాల్చినచెక్క పొడిని నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు కాస్త చల్లారి గోరువెచ్చగా అయ్యాక పుక్కిలిస్తే... నోటి దుర్వాసన వదిలిపోతుంది.   - గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి, ఆలివ్ ఆలియ్, నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి... ఇందులో పాదాలు ముంచాలి. పదిహేను నిమిషాలు అలా ఉంచిన తరువాత రుద్ది కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే పాదాలు పగలకుండా స్మూత్ గా ఉంటాయి. ఆల్రెడీ పగుళ్లు ఉంటే మూసుకుపోతాయి. వంటల్లో మాత్రమే పనికొస్తుందనుకునే దాల్చినచెక్క మన అందాన్ని పెంచడానికి ఎలా దోహదపడుతుందో చూశారు కదా! అందుకే ఇంట్లో ఎప్పుడూ దాల్చినచెక్క ఉండేలా చూసుకోండి. అన్ని సమస్యలకీ అదే పరిష్కారం.   - Sameera

వాటర్ మెలోన్ ఫేస్ ప్యాక్ మరియు దాని ప్రయోజనాలు   పుచ్చకాయ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. వేసవి కాలానికి ఊరటగా ఉండే పుచ్చకాయ నీటి శాతంలో అధికంగా ఉంటుంది. తియ్యగా ఉండడమే కాకుండా, మానసికంగా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా, శరీరంలో నీటి స్థాయిలను పెంచడంతో పాటు, డీహైడ్రేషన్ సమస్యలకు చెక్ పెట్టేందుకు దోహదపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్రమంగా పుచ్చకాయ లేని వేసవిని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ, కేవలం ఈ పుచ్చకాయ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మీ చర్మానికి మరియు జుట్టుకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుందని చెప్పబడింది. చర్మ సంరక్షణ కొరకు సిఫారసు చేయబడిన పండ్లలో పుచ్చకాయకు ఎందుకంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది? పుచ్చకాయలో అత్యంత ముఖ్యమైన విటమిన్లు మరియు పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా లైకోఫేన్ అనే ప్రత్యేకమైన పదార్ధం, మీ చర్మం నుంచి ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సాయపడుతుంది, తద్వారా చర్మం పాడవకుండా కాపాడగలుగుతుంది. మీరు పుచ్చకాయను రోజువారీగా ఆహార ప్రణాళికలో జోడించుకోవచ్చు, క్రమంగా దీని యొక్క అద్భుతమైన ప్రయోజనాలను శరీరానికి అందించవచ్చు. లేదా ఫేస్ మాస్క్, క్లెన్సర్స్, హెయిర్ మాస్క్లు లేదా కండిషనర్ల రూపంలో మీ చర్మం మరియు జుట్టు సంరక్షణా చర్యలలో భాగంగా కూడా దీనిని చేర్చవచ్చు. అయితే, మనం ఈ రెసిపీని ప్రారంభించడానికి ముందుగా, మీ స్కిన్ కేర్ విషయంలో పుచ్చకాయ ఏవిధంగా సహాయం చేస్తుందో తెలుసుకోడానికిగల ముఖ్యమైన  చర్మానికి పుచ్చకాయ వలన కలిగే ప్రయోజనాలు :  * విటమిన్ A, B6, మరియు C తో లోడ్ చేయబడిన పుచ్చకాయ నిజంగా ఒక దివ్య ఫలమనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది చర్మ సంరక్షణలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.  * ఇది మీకు ప్రకాశమైన చర్మాన్ని ఇస్తుంది.  *  ఇది మీ చర్మాన్ని పోషకమయం చేస్తుంది.  * ఇది మీ చర్మాన్ని తేమగా మరియు హైడ్రేట్ చేస్తుంది.  * ఇది ఒక నేచురల్ స్కిన్ టోనర్ గా మరియు క్లెన్సర్ వలె పనిచేస్తుంది.  * ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ వలె పనిచేస్తుంది.  * ఇది మీ చర్మంలో అదనపు నూనెల ఉత్పత్తిని నిరోధిస్తుంది.  * ఇది మీ పొడి చర్మానికి ఉత్తమమైన ట్రీట్మెంట్.  * ఇది టాన్ తొలగిస్తుంది.  * ఇది మీకు ముడుతలు లేని చర్మాన్ని అందిస్తుంది మరియు చారలను తొలగిస్తుంది.  * ఇది మొటిమలను, ఆక్నే సమస్యను కూడా నివారిస్తుంది. పుచ్చకాయతో ఫేస్-మాస్క్ లను  తయారు చేసే విధానం :  1. పుచ్చకాయ - తేనె : యాంటీ బ్యాక్టీరియల్ (క్రిమినాశక తత్వాలు) మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్న తేనె బాక్టీరియాను నిర్మూలించడమే కాకుండా, చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, చర్మ పోషణకు తోడ్పడుతుంది.  కావలసిన పదార్ధాలు :  2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం. 2 టేబుల్ స్పూన్ల తేనె  ఉపయోగించు విధానం :  *  పుచ్చకాయ రసం మరియు తేనెను ఒక గిన్నెలోకి తీసుకుని, ఒక స్థిరమైన మిశ్రమం వచ్చేలా కలుపుకోవాలి.  *  దీనిని మీ ముఖం మరియు మెడపై నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయండి మరియు సుమారు 20 నిమిషాలపాటు దానిని అలాగే విడిచిపెట్టండి.  *  తర్వాత దీనిని చల్లటి నీటితో శుభ్రంచేయండి మరియు మీ ముఖాన్ని పొడి తువాలుతో శుభ్రంగా తుడవండి.  *  ఉత్తమ ఫలితాల కోసం కనీసం వారానికొకసారి అనుసరించండి.   2. పుచ్చకాయ - యోగర్ట్ : పెరుగు మీ చర్మం నుండి అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే హానికరమైన అతినీల లోహిత సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది మరియు టానింగ్ తగ్గిస్తుంది.  కావలసిన పదార్ధాలు :  2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు  2 టేబుల్ స్పూన్ల యోగర్ట్ లేదా పెరుగు.  ఉపయోగించు విధానం :  *  పుచ్చకాయ గుజ్జు మరియు పెరుగు లేదా యోగర్ట్ ను ఒక గిన్నెలో మిశ్రమంగా కలపండి.  *  దీనిని మీ ముఖం మరియు మెడపై అప్లై చేయండి.  *  సుమారు 10-15 నిమిషాలపాటు ముఖంపై ఆరనివ్వండి.  *  దానిని చల్లటి నీటితో శుభ్రం చేయండి తరువాత, పొడి తువాలుతో ముఖంపై నీటిని తొలగించండి.  *  ఉత్తమ ఫలితాల కొరకు వారానికి రెండు సార్లు దీనిని పునరావృతం చేయండి. 3. పుచ్చకాయ - మిల్క్ : పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మీ చర్మం యొక్క స్థితిస్థాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అంతేగాక, పాలు మీ చర్మ నిగారింపును మెరుగుపరచడానికి కూడా సహాయపడుతాయి.  కావలసిన పదార్ధాలు :  2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం  2 టేబుల్ స్పూన్ల పాలు  1 విటమిన్ E టాబ్లెట్  ఉపయోగించు విధానం :  *  ఒక గిన్నెలోకి కొంత పుచ్చకాయ రసాన్ని తీసుకోండి. తరువాత, దానికి కొన్ని పాలను జోడించండి.  *  విటమిన్ E టాబ్లెట్ కట్ చేసి, ఆ మిశ్రమానికి జోడించండి. అన్ని పదార్ధాలను మిశ్రమంగా కలపండి.  *  దీనిని మీ ముఖం మరియు మెడపై అప్లై చేయండి.  *  సుమారు 20 నిమిషాలపాటు దానిని విడిచిపెట్టండి. *  దానిని చల్లని నీటితో శుభ్రం చేయండి మరియు పొడి తువాలుతో ముఖం మీది నీటిని తొలగించండి.  *  ఆశించిన ఫలితాల కొరకు వారంలో రెండు సార్లు దీనిని పునరావృతం చేయండి.   4. పుచ్చకాయ - దోసకాయ : ప్రముఖ యాస్ట్రింజెంట్ అయిన కీరా దోసకాయ మొటిమల మచ్చలు తేలికపడటానికి సహాయపడతాయి. అలాగే చర్మం నుండి మృత చర్మ కణాలను మరియు మలినాలను తొలగిస్తుంది.  కావలసిన పదార్ధాలు :   1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం  1 టేబుల్ స్పూన్ దోసకాయ గుజ్జు  ఉపయోగించు విధానం :  *  ఒక గిన్నెలో కొంత పుచ్చకాయ రసాన్ని మరియు దోసకాయ గుజ్జును తీసుకుని మిశ్రమంగా చేయాలి. మీరు ఒక స్థిరమైన పేస్ట్ పొందేవరకు రెండు పదార్ధాలను కలుపుకోవాలి. *  దీనిని మీ ముఖం మరియు మెడపై అప్లై చేయండి.  *  సుమారు 10-15 నిమిషాలపాటు ముఖంపై ఆరనివ్వండి..  *  ఆతర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి మరియు పొడి తువాలుతో ముఖాన్ని తుడవండి.  *  ఆశించిన ఫలితాల కొరకు కనీసం వారంలో రెండుమార్లు దీనిని పునరావృతం చేయండి. 5. పుచ్చకాయ - అరటి పండు: అరటిపండు విటమిన్ ఎ, B6 మరియు c లతో లోడ్ చేయబడి ఉంటుంది. అరటిపండు చర్మ సంరక్షణకు ఎంతగానో దోహదపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి.  కావలసిన పదార్ధాలు :  2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు  2 టేబుల్ స్పూన్ల అరటి పండు గుజ్జు  ఉపయోగించు విధానం :  *  ఒక గిన్నెలో పుచ్చకాయ, అరటి పండు గుజ్జు రెండింటిని మిశ్రమంగా కలుపుకోవాలి.  *  వీలయితే రెండు పదార్థాలను బ్లెండ్ చేయండి.  *  దీనిని మీ ముఖం మరియు మెడపై నలువైపులా విస్తరించునట్లు అప్లై చేయండి మరియు దానిని 15 నిమిషాలపాటు అలాగే విడిచిపెట్టండి. *  కాసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి మరియు పొడి తువాలుతో మీ ముఖం మీది నీటిని తొలగించండి.  *  ఉత్తమ ఫలితాల కోసం కనీసం వారంలో ఒకసారి అనుసరించండి.  6. పుచ్చకాయ - చక్కెర : చక్కెర సహజ సిద్దంగానే అధిక తేమను క్రమబద్దీకరించే లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పర్యావరణంలోని తేమను చర్మంలోకి ఆకర్షిస్తుంది. మీ కిష్టమైన షుగర్ స్క్రబ్ కోసం పుచ్చకాయతో కలిపి అనుసరించవచ్చు.  కావలసిన పదార్ధాలు :  2 టేబుల్ స్పూన్ల పంచదార  2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు  ఉపయోగించు విధానం :  *  ఒక గిన్నెలో పుచ్చకాయ గుజ్జు, పంచదార రెండింటినీ కలుపుకోవాలి.  *  ఈ మిశ్రమాన్ని మీ చేతులకు కొంత మోతాదులో తీసుకొని మీ ముఖాన్ని దానితో రుద్దండి. *  సుమారు 10 నిమిషాలపాటు అలాగే సున్నితంగా రుద్దండి మరియు మరో 5-7 నిమిషాలపాటు దానిని అలాగే విడిచిపెట్టండి.  *  ఇప్పుడు చల్లటి నీటితో శుభ్రం చేయండి మరియు మీ ముఖాన్ని పొడి తువాలుతో తుడవండి.  *  ఉత్తమ ఫలితాల కోసం వారంలో కనీసం ఒకసారి అనుసరించండి. 7. పుచ్చకాయ - బొప్పాయి : బొప్పాయి పపైన్ అనే ఎంజైమ్ కలిగి ఉండి, ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా మృతకణాలను విజయవంతంగా తొలగిస్తుంది.  కావలసిన పదార్ధాలు :  2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు  2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు  ఉపయోగించు విధానం :  *  ఒక బొప్పాయి ముక్కను తీసుకుని, మాష్ చేసి గుజ్జుగా తీసుకుని దానిని ఒక గిన్నెలోకి కలపండి. *  దీనికి కొంత పుచ్చకాయ గుజ్జును జోడించి, రెండింటిని కలిపి మిశ్రమంగా చేయాలి. *  దీనిని మీ ముఖం మరియు మెడపై నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయండి మరియు దానిని 15 నిమిషాలపాటు అలాగే విడిచిపెట్టండి.  *  దానిని చల్లటి నీటితో శుభ్రం చేయండి., మరియు పొడి తువాలుతో ముఖంపై నీటిని తొలగించండి. *  ఉత్తమ ఫలితాల కోసం వారంలో కనీసం ఒకసారి అనుసరించండి. 8. పుచ్చకాయ - కలబంద గుజ్జు : కలబంద గుజ్జు చర్మాన్ని పునరుత్తేజితం గావిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచేలా చేస్తుంది, మరియు క్రిమినాశక గుణాలను సైతం కలిగి ఉంటుంది. క్రమంగా ఇది మొటిమలను మరియు ఆక్నే సమస్యకు చికిత్సగా ఉపయోగపడగలదు.  కావలసిన పదార్ధాలు :  2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు  2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్  2 టేబుల్ స్పూన్ల తాజా కలబంద గుజ్జు  ఉపయోగించు విధానం :  *  ఒక బౌల్ తీసుకొని అందులో పుచ్చకాయ గుజ్జును కలపండి.  *  తరువాత, కొంత రోజ్ వాటర్ జోడించండి, మళ్లీ బాగా కలపండి.  *  మీరు రోజ్ వాటర్ జోడించిన తర్వాత, తాజాగా సంగ్రహించిన కలబంద గుజ్జును తీసుకొని పుచ్చకాయ మిశ్రమంతో మిక్స్ చేయాలి.  *  ఈ పేస్ట్ ను మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి సుమారు అరగంట పాటు ఆరనివ్వాలి.  *  30 నిమిషాల తరువాత, దానిని శుభ్రంచేసి, మీ ముఖాన్ని పొడి తువాలుతో తుడవండి.  *  ఉత్తమ ఫలితాల కొరకు వారానికి ఒకటి లేదా రెండుసార్లు దీనిని పునరావృతం చేయండి.  9. పుచ్చకాయ - దానిమ్మ : దానిమ్మలో అధికంగా విటమిన్ సి ఉంటుంది. క్రమంగా ఇది, పొడిబారడాన్ని తగ్గించి మీ చర్మాన్ని మృదువుగా మరియు నునుపుగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు చర్మానికి పోషకాలను అందిస్తుంది. దానిమ్మ గింజలు చెడిపోయిన చర్మాన్ని బాగుచేయడంలో కూడా సహాయపడతాయి.  కావలసిన పదార్ధాలు :  2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం  2 టేబుల్ స్పూన్ల దానిమ్మ రసం  1 టేబుల్ స్పూన్ తేనె  ఉపయోగించు విధానం :  *  ఒక గిన్నెలో పుచ్చకాయ, దానిమ్మ రసం రెండింటినీ కలుపుకోవాలి.  *  దీనికి కొంత తేనెను జోడించండి, మరలా అన్ని పదార్థాలను కలిపి మిశ్రమంగా చేసుకోండి.  *  ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడ మీద నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేసి ఆరనివ్వాలి.  *  సుమారు అరగంట పాటు వేచి ఉండి, తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.  *  ఉత్తమ ఫలితాల కొరకు వారానికి ఒక్కసారి ఈ ప్రక్రియను పునరావృతం చేయండి.   

Holi Beauty Care Ladies and Gentleman , and we are addressing both the genders as we felt that we should share the skin and hair care tips that will help you take care of your body and have fun on Holi ! With most of us going for the Organic colours the question about using chemical laced colours and the damage that do may not arise …but for those who still insist on using these cheaply available colours as the Organic ones tend to be on the expensive side we present these tips for protecting your hair and skin:   Hair: Use a scarf or bandana cap to cover your hair. Don’t leave your hair loose and put a pony for protecting long hair. Use coconut or olive oil and massage your hair from tip to scalp. An oil massage will act as a shield against harmful chemicals and dust apart from protecting your hair it will also help you get rid of the colour from your hair easily.   Eyes: Avoid wearing contact lenses when you are playing with colours it  can cause infections .Stick to wearing your glasses and wear some fancy glasses to go with the glam look.   Nails: Paint your nails bright as this will help you keep your nails and the cuticles safe from the harsh colours .   Lips: For protecting your lips while playing Holi, use a lipbalm or a lipstick so that it keeps the lips protected and moisturised at the same time.   Skin: Make a mixture of 1 tablespoon each of coconut oil and olive oil .Apply this all over your skin especially behind the ears before playing Holi. You could also moisturize your face with sunscreen for added protection. And avoid heavy makeup.   Quick tips: Keep a soothing lotion like calamine or aloe Vera gel in handy in case you break into a rash and avoid further irritation. Clean your eyes with water in case you have colour splashed and relax. Wash with water first and than apply the lotion. Avoid bleaching, shaving, waxing, facials of any types of clean-ups for a week after Holi as it will just harm your skin.

హెయిర్ ప్రాబ్లెమ్స్‌కి ఫుడ్‌తో పరిష్కారం!     ముఖానికి మరింత అందాన్ని తెచ్చేది శిరోజాలు. కానీ వయసు పెరిగేకొద్దీ, ఒత్తిళ్లు ఎక్కువయ్యేకొద్దీ జుత్తు రాలిపోయి టెన్షన్ పెడుతూ ఉంటుంది. నిజానికి మనం రోజు వంద వరకూ వెంట్రుకలని కోల్పోతూ ఉంటామని, అది సహజమేనని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి తల దువ్వుకున్నప్పుడు నాలుగు వెంట్రుకలు రాలిపోయాయని కంగారుపడిపోవాల్సిన అవసరం లేదు. మరీ పెద్దమొత్తంలో ఊడిపోయినప్పుడు మాత్రమే టెన్షన్ పడాలి. అసలు అలాంటి సమస్యే రాకుండా ఉండాలంటే ఓ పని చేయాలి. మనం తినే ఆహారంలో మూడు పోషకాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.   ఐరన్ - ఆహారంలో దీని పాళ్లు ఎక్కువ ఉంటే జుత్తుకి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎగ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, సీఫుడ్, మటన్ లివర్ వంటి వాటితో పాటు ఆకుకూర్లలో విరివిగా ఉంటుంది ఐరన్. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోవాలి.   సి విటమిన్ - బత్తాయి, నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల జుత్తు ఎక్కువగా రాలదు. పైగా ఆరోగ్యంగా పెరుగుతుంది.   జింక్ - ఇది జుత్తుకి చాలా అవసరం. హెయిర్ బలంగా పెరగాలన్నా, కాంతివంతంగా బలవర్ధకంగా ఉండాలన్నా ఇది కావాలి. అందుకే జింక్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. గుమ్మడి గింజలు, సీఫుడ్, డార్క్ చాక్లెట్, మటన్, వేరుశనగలు, పుచ్చకాయ గింజల్లో జింక్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇవి ఎక్కువ తింటే హెయిర్ ప్రాబ్లెమ్స్ గురించి చింత అవసరం లేదు. ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటూ... జుత్తుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే శిరోజాల సోయగాలు పెరుగుతాయే తప్ప ఎన్నటికీ తరగవు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా హెయిర్ డ్యామేజ్ అవుతున్నా, హెయిర్ ఫాల్ ఎక్కువున్నా థైరాయిడ్ ప్రాబ్లెమ్ ఏమైనా ఉందేమో టెస్ట్ చేయించుకోవడం మంచిది. - Sameera

పెరుగుతో హెయిర్ పెరుగుద్ది! ఈమధ్య హెయిర్ లాస్ ఎక్కువైంది... నా జుత్తు ఇంత ఉండేది, ఇంతైపోయింది... ఇలాంటి మాటలు తరచూ వినబడుతూనే ఉంటాయి. అమ్మాయిలకు కురులు ఎంతో అందం. అందుకే అవి రాలుతుంటే దిగులుగా ఉంటుంది. ఆ దిగులుతోనే చాలామంది తలకు ఏవేవో పూసేస్తుంటారు. హెయిర్ ట్రీట్మెంట్లంటూ వేలకు వేలు పోసేస్తుంటారు. వాళ్ల కోసమే ఇది. కాసింత పెరుగు ఉంటే మీ హెయిర్ అద్భుతంగా పెరుగుందని మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకోండి.    - ఒక కోడిగుడ్డు సొనలో రెండు చెంచాల పెరుగు కలిపి మాడుకు పట్టించండి. అరగంట తర్వాత తలంటుకోండి. వారానికోసారి ఇలా చేస్తే జుత్తు రాలదు సరికదా ఇంకా ఒత్తుగా అవుతుంది.   - బాగా పండిన అరటిపండు గుజ్జులో చెంచాడు పెరుగు, మూడు చెంచాల తేనె, ఓ చెంచాడు నిమ్మరసం కలిపి తలకు ప్యాక్ వేసుకోండి. మూడు నెలల పాటు వారానికోసారి ఇలా చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఆ తర్వాత రెండు వారాలకోసారి వేసుకుంటే చాలు. మళ్లీ సమస్య రాకుండా ఉంటుంది.   - ఓ కప్పు పెరుగులో రెండు కప్పుల నీళ్లు వేసి బాగా చిలకండి. ఇందులో చెంచాడు ఆలివ్ ఆయిల్, చెంచాడు నిమ్మరసం వేసి కలిపి మాడుకు, జుత్తుకు బాగా పట్టించండి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుని తలంటుకోండి. తరచుగా ఇలా చేస్తూ ఉంటే మీ హెయిర్ ఎంత బలంగా అవుతుందో మీకే తెలుస్తుంది.   - అరకప్పు పెరుగులో చెంచాడు తేనె, చెంచాడు వెనిగర్ కలిపి జుత్తుకు పట్టించండి. అరగంట తర్వాత ఎగ్ షాంపూతో తలంటుకోండి. వారానికోసారి ఇలా చేసినా కూడా జుత్తు రాలడం తగ్గి బలపడుతుంది. మెరుస్తుంది.   - పెరుగులో అలొవెరా జిగురు, ఆలివ్ ఆయిల్, తేనె కలిపి ప్యాక్ వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.   - గుప్పెడు కరివేపాకుల్ని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ఓ కప్పు పెరుగులో కలిపి తలకు రాసుకోవాలి. దీనివల్ల జుత్తు బాగా పెరుగుతుంది.   - మెంతుల్ని పెరుగులో నానబెట్టి, రుబ్బి తలకు రాసుకున్నా... పెరుగులో కొబ్బరి పాలు కలిపి దానితో జుత్తు కడుక్కున్నా కూడా మంచిదే. వీటివల్ల హెయిర్ గ్రోత్ బాగా ఉండటమే కాదు... తళుకులీనుతుంది కూడా. చూశారు కదా! హెయిర్ పెరగడానికి పెరుగు ఇంత ఉపయోగపడుతుంది. వెంటనే ట్రై చేయండి మరి!   - Sameera

Party Make Up Tips   If you want to be the essence of a party, there is no better place to start than at your dressing table. The party makeup tips given here will....... * Apply a coat of the colorless base coat and let it dry. * Wash your face with warm water, using your favorite face wash. * Rub ice on your face for 5-10 mins, in breaks. * Dab some cleansing milk on a cotton ball and wipe your face with it. * Clean your nails thoroughly and file them to give a proper shape. * Add another coat of the colorless base coat and let it dry. * Apply some lotion/ moisturizer, while making sure you do not end up leaving your face oily. * Depending upon your complexion, apply foundation all over your face, with the help of a sponge/foundation brush. You can apply a darker shade of the foundation on the broader parts of your face. * Now, apply shimmer powder on your face, over the foundation, with the help of a brush. * Blush your cheeks, adding color gradually. Use some blusher on the sides of the forehead and chin as well. * First of all, you need to apply the eye-shadow on your eyelids * Define your eyes with eyeliner, making use of short strokes. * Next, apply 2-3 coats of mascara, on the tips of your lashes. * Finally, define your eyebrows with the help of an eyebrow pencil. * Shape up your lips nicely and precisely, with the help of a lip liner pencil. * Now is the time to apply the lip color, with the help of a brush. * Blot the lipstick with tissue and then apply once again. * Finally, add a coat of gloss on your lips. * Add two coats of a nail polish, giving a gap of 10 minutes in-between.

మీకు కూడా సొట్ట బుగ్గలు కావాలంటే! సొట్ట బుగ్గలు ఉండటం ఎప్పటికీ ఓ ఎట్రాక్షనే! కానీ సొట్టబుగ్గలు పుట్టుకతో రావాల్సిందే కానీ మనం కావాలనుకుంటే వచ్చేవి కాదు. కానీ ప్రతిదానికీ ఓ ఉపాయం ఉన్నట్లే వీటికి కూడా ఉందంటున్నారు కాస్మాలజిస్టులు. కొన్ని చిట్కాలు పాటిస్తే డింపుల్స్‌ మీ సొంతం అవుతాయంటున్నారు. * సెల్ఫీలు లాంటి ఫొటోలు తీసుకునేటప్పుడు టెంపరరీగా సొట్ట బుగ్గలు కావాలంటే ఓ పని చేయండి. వేలితో కానీ, పెన్సిల్‌తో కానీ బుగ్గ మీద ఓ అయిదు నిమిషాలు నొక్కి ఉంచితే బుగ్గలు టెంపరరీగా సొట్టపడతాయి. * రోజూ ఓ అరగంట పాటు బుగ్గల్ని వేలితో లేదా పెన్సిల్‌తో నొక్కి ఉంచితే పర్మనెంట్‌గా బుగ్గలు సొట్టబడతాయని చెబుతున్నారు. కానీ ఇదెంతవరకు వాస్తవమో తెలిసే అవకాశం లేదు. * సొట్టబుగ్గలకి అన్నింటికంటే ఎఫెక్టివ్‌ చిట్కా ఉంది. నవ్వేటప్పుడు కనుక మనస్ఫూర్తిగా విశాలంగా నవ్వితే... చాలామంది బుగ్గలు సొట్టపడతాయట. * మేకప్‌ వేసుకునేటప్పుడు ఓ చిన్న చిట్కా పాటించినా బుగ్గల మీద సొట్ట ఉన్నట్లు కనిపిస్తుంది. దానికోసం నవ్వేటప్పుడు మడత పడే చోట... మన స్కిన్‌ రంగు కంటే కాస్త తక్కవ రంగు ఫౌండేషన్‌ని గుండ్రంగా అప్లై చేయాలి. * బుగ్గ మీద piercing చేయడం వల్ల కూడా బుగ్గలు సొట్ట పడినట్లు కనిపిస్తాయి. ఇవేవీ కాదంటారా! మీకు శాశ్వతంగా సొట్టబుగ్గలు ఉండి తీరాలంటారా! అయితే దానికి చిన్నపాటి cosmetic surgery చేయించుకుంటే సరిపోతుంది. - Nirjara

నైట్ మాస్కులతో మీ అందానికి మార్కులు!     పగలంతా పనిలో మునిగిపోతాం. ఎండలో తిరిగి అలసిపోతాం. ఇంటికొచ్చి తినేసి నిద్రపోతాం. గ్లామర్ తగ్గిపోతుందని గమనిస్తాం. స్కిన్ పాడైపోతోందని ఫీలవుతుంటాం. కానీ కేర్ తీసుకుందామంటే టైమ్ దొరకదే. ప్యాక్ వేసుకోవాలి, ఆరేవరకూ వెయిట్ చేయాలి, కడుక్కోవాలి... అంత టైమ్ ఎక్కడిది అంటారా? అలాంటప్పుడు ఈ నైట్ ప్యాకులు వేసేసుకోండి. టైమూ వేస్టవదు. అందమూ ఎక్కడికీ పోదు.   * మూడు చెంచాల తేనెలో ఓ చెంచాడు నిమ్మరసం కలిసి రాత్రి పడుకోబోయేముంది ముఖానికి రాసుకోండి. ఉదయం లేచాక ముఖం కడుక్కోంది. ఇది కమిలిన చర్మాన్ని మళ్లీ కాంతిమంతంగా చేస్తుంది. * చర్మం మరీ పొడిబారిపోయి విసిగిస్తోంటే... గంధపుపొడిలో కాసిన్ని పాలు, కొద్దిగా శనగపిండి కలిపి పడుకునే ముందు ప్యాక్ వేసుకోండి. ఉదయం లేచి గోరు వెచ్చని నీటితో కడుక్కోండి. మీ ముఖం ఎలా నిగనిగలాడుతుందో చూడండి. * ఓట్స్ ను పొడి చేసి, పాలతో కానీ పెరుగుతో కానీ కలిపి పేస్ట్ లా చేయండి. దీనితో పడుకునే ముందు ప్యాక్ వేసుకుని పడుకోండి. ఉదయం లేచాక చల్లని నీటితో కడిగేయండి. వారం రోజులు ఇలా చేస్తే చాలు... పోయిందనుకున్న గ్లామర్ మళ్లీ వచ్చి ముఖంలో చేరుతుంది. * తీరిగ్గా ఉన్నప్పుడు గులాబీ రేకుల్ని ఎండబెట్టి, పొడి చేసి ఓ డబ్బాలో దాచుకోండి. ఈ పౌడర్లో పాలు కలిపి అప్పుడప్పడూ పడుకునే ముందు ప్యాక్ వేసుకుంటే చర్మం డల్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. * పాల మీగడలో పసుపు, శనగపిండి కలిపి వేసే నైట్ ప్యాక్ కూడా చాలా మంచి ఫలితాన్నిస్తుంది. - Sameera

Natural Beauty Foods   Talk about beauty foods for natural radiance.that you can use to make your own face masks, hair masks, face scrubs, & other beauty treatments. Green tea - Full of antioxidants and helpful for reducing redness, rinsing your face in cool green tea is a great way to gently soothe skin. Avocado - An excellent moisturizer, avocado is great as a face mask, mashed up in hair, or use just about anywhere you could use a little extra hydration. Cherries - Another antioxidant superstar, these guys are also great for evening out skin tone. Oatmeal - For a fast-acting soother, look no further than oatmeal, which has major anti-inflammatory properties. You can drop it in the bath, slather it on your face, or even use it as a gentle scrub. Papaya - Want to decongest your skin fast? The papain in this fruit makes one of the best enzyme masks around. Lemon - The acid in this fruit can whiten nails, give your hair natural-looking highlights, and help slough off dry, flaky skin. Egg white - Not just for omelets anymore, egg white masks are a classic way to improve tone and texture. Olive oil - This kitchen staple is great for hydrating hair and smooth dry spots on skin. Sugar - There's no sweeter natural exfoliant. Mix this with a little olive, almond, or apricot oil for a great lip and body scrub. Honey - This natural antimicrobial also soothes and draws moisture into skin. Use it in masks or as a spot treatment.

గోల్డ్ ఫేషియల్ చేసుకోండిలా.. ఈ మధ్య కాలంలో గోల్డ్ పేషియల్ చేసుకోవడం సర్వ సాధారణమైంది. ఒకప్పుడు బంగారం కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేది మన పెద్దలు. అలాంటిది, మారుతున్న కాలంతో పాటు, బంగారం వాడకంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు ఈ గోల్డ్ పేషియల్ వల్ల మనకొచ్చే లాభం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=V9axDXVERwY

అందానికి చిట్కాలు     * మీరు బయటికి వెళ్ళేటప్పుడు బ్రషర్ నే వాడండి, లిప్ స్టిక్, కోహిల్ పెన్సిల్ తో కనుబొమ్మలను సరిదిద్దుకోండి. * మస్కారాని వాడితే మీ కనుబొమ్మలు, మీ కనురెప్పలు కూడా దట్టంగా కనిపిస్తాయి. * బ్రషర్స్ తో కంటి షాడో ను లిప స్టిక్ ను సరిదిద్దుకోవచ్చు. కంటి రెప్పలకు బంగారు రంగు గాని , వెండి రంగులు గాని పూత పూయడం, కొంత స్పెషల్ ఫంక్షన్స్ అయితే గాని బాగుండదు. మీరు గోల్డ్, సిల్వర్ కూడా మేకప్ మెటీరియల్స్ తో పాటు వాడవచ్చు. మీ ముఖంలో బంగారు ఛాయ గాని, రజిత ఛాయ గాని కనిపించి మరింత అందంగా కనిపిస్తారు. కనుక మీరు అందంగా కనిపించాలంటే మీకు వయస్సుతో పనేలేదు. ఏ వయస్సు వారైనా సరే కాస్త శ్రద్ధ తీసుకుంటే శ్రమ అనుకోకపోతే అందంగా, ఆకర్షణీయంగా , ఆహ్లాదకరంగా, ఆహ్లాదకరంగా అందరికీ ఆమోదయోగ్యంగా కనిపించి ఆనందపరచవచ్చు, ఆహ్లాదపరచవచ్చు. మేకప్ కళలోని కొన్ని కిటుకులు...మోడరన్ మేకప్ చాలా అభివృద్ధి చెందింది. స్త్రీలు తమ అందాన్ని ఎన్నో విధాలుగా మలుచుకుంటున్నారు. సహజంగా సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునే విధంగా మేకప్ ను అభివృద్ధి పరిచారు. స్త్రీ యొక్క ముఖకవళికలను ఎన్నో రీతులలో మార్పులు చేయగలుగుతున్నారు. అసలు ఫేస్ మేకప్ పై అద్భుతమయిన ప్రయోగాలు చేసి పర్సనాలిటీనే పూర్తిగా మార్చి వేస్తున్నారు. ఈ నాడు మేకప్ కళ ఎంత ఎదిగిపోయిందంటే ఆధునిక యుగ రీతులకనుగుణంగా కాలాన్ని బట్టి, వయస్సును బట్టి, వెళ్ళే అకేషన్ ని బట్టి అంతే వివాహానికి ఓ రకంగా , బర్త్ డే పార్టీకి మరో రకంగా , పిక్నిక్ కి మరో విధంగా, సాధారణ పార్టీలకో విధంగా, ఫంక్షన్ ను బట్టి తగిన మేకప్ చేసుకుంటున్నారు. దానికనువైన దుస్తులను ధరిస్తున్నారు. ఆభరణాలు కూడా తదనుగుణంగానే ధరిస్తున్నారు. మేకప్ లేకుండా ఈ ఆధునిక యుగంలో ఏ స్త్రీ బయటకు రావడం లేదు. ఫంక్షన్స్ కి మాత్రమే కాదు మామూలుగా మార్కెట్టుకు కూరగాయలు, సరుకుల నిమిత్తం వెళ్ళినా స్త్రీలు మేకప్, మ్యాచింగ్ డ్రెస్ లేనిదే బయటికి అడుగు పెట్టరు. స్త్రీని చూస్తే కేశాలంకరణ నుంచి, పాదరక్షల వరకు, తిలకం, దుస్తులు, ఆభరణాలు అన్నీ ఒకే రంగులో మ్యాచ్ అవుతూ ఉండి తీరాల్సిందే.     ఇప్పుడు మేకప్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ప్రాబ్లం కూడా కాదు. అనేక షేడ్స్ లో మ్యాచ్ ఫ్యాక్టర్స్ విదేశాలనుండి దిగుమతి అయ్యాయి. వాటి ప్రభావం అపూర్వం, మనలోని లోపాలెన్నో అత్యద్భుతంగా కప్పి పుచ్చగలుగుతున్నారు.. జబ్బు చేసి ముఖం మీద మచ్చలయినా, లేదా గుంటలు అయినా అతి సులువుగా మూసేయగలుగుతున్నారు. ముఖాన్ని మేకప్ తో పూర్తిగా మార్చి వేయాలనే పూర్వపు ఆలోచనైతే నేడు ముఖాన్ని సహజంగానే ఉంచుతూ చాలా సహజ సిద్ధంగా ఉండే లైట్ రంగుని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. పూర్వం మేకప్ డ్రైగా ఉండేది. ఇప్పటి మేకప్ లో మాయిశ్చరైజర్ వాడుతున్నారు. అందుకే మేకప్ ఎంతో ముచ్చటగా, సున్నితంగా, తెజోవంతంగా ఉంటుంది. మేకప్ లో ఉన్నప్పుడు మనలోంచి చాలా వరకు చెమట రూపంలో మనలోని తేమతనం ఇంకి పోతూ ఉంటుంది. దానిని అరికట్టి సమ శీతోష్ణతను నెలకొల్పడానికి మాయిశ్చరైజర్ ను ఇప్పుడు విరివిగా వాడుతున్నారు. మేకప్ కు ముందుగా మన శరీరం కొంత తేమతనం కలిగి ఉండాలి. అందుకోసం మనం మాయిశ్చర్ కలిగిన రసాయనిక పదార్థాలు వాడటం మంచిది. చర్మం మెత్తగా ఉంటే మేకప్ బాగా అతుకుతుంది. చర్మం బిరుసుగా ఉంటే అతకదు. చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. మాయిశ్చరైజర్ లు ఇప్పుడు అనేక విధాలుగా మార్కెట్టులో విడుదలవుతున్నాయి. ఎమెల్షన్సు గాను, ద్రావకాలగాను వస్తున్నాయి. మాయిశ్చరైజర్ ను పల్చగా ముఖానికి మెడకి పట్టించాలి. దానిపైన ఫౌండేషన్ మేకప్ చేయాలి. ఫౌండేషన్ కు ఉపయోగించే రంగును అన్వేషించడంలో కొంత టెక్నిక్ అవసరం. అది ఉపయోగించే రంగు పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఫౌండేషన్ పూర్తి చేశాక దానిపై కాంతిని కొంత వరకు సరఫరా చేయగల పౌడర్ ( Transcent powder) ను జల్లాలి. అప్పుడు గాని ఫౌండేషన్ బాగా సెట్ అవదు.

పాదాలని మెరిపించండిలా...!   అమ్మాయిల్లో చాలా మంది ముఖంపై పెట్టిన శ్రద్ధ పాదాల మీద పెట్టరు. అందంగా కనిపించడం అంటే ముఖం ఒక్కటే కాదు తల నుంచి పాదాల వరకు అందంగా ఉండాలి.. సో.. పాదాలు అందంగా ఉండాలంటే ఈ చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. మెరిసిపోయే పాదాలు మీ సొంతం. https://www.youtube.com/watch?v=vCz_CwC9x68  

కళ్ల కింద నల్లమచ్చలు పోవాలంటే..?   సాధారణంగా మగువల అందానికి మరింత అందాన్నీ తీసుకువచ్చేది కళ్లే. కళ్లతోనే ఆడవారి అందం రెట్టింపు అవుతుంది. అందంగా కనిపించే కళ్లు పలికే భావాలు ఎదుటి వారికి స్పష్టంగా అర్థమవుతాయి. అయితే విపరీతమైన పని ఒత్తిడి, నిద్రలేమి ఇలా రకరకాల సమస్యలతో నేటి తరానికి కళ్లు నిర్జీవంగా మారుతున్నాయి. మన కళ్ల అందాన్ని దెబ్బతీసే వాటిలో నల్లని వలయాలు ముఖ్యమైనవి. వీటిని పొగొట్టుకోవడానికి..బ్యూటీపార్లర్లను..రకరకాలైన వ్యాపార ప్రకటనలను వాడి మోసపోతున్నారు. దీని వల్ల సమస్య పరిష్కారం కాకపోగా..మరిన్ని చర్మ సమస్యలు తలెత్తుతున్నాయి. మరి వేరే మార్గం లేదా అనుకుంటున్నారా.. ఈ వీడియో చూడండి మంచి పరిష్కారం దొరుకుతుంది. https://www.youtube.com/watch?v=gkpw97JgsHs