థైరాయిడ్‌ ఆడవాళ్లకే ఎందుకు వస్తుంది?

 


ఈమధ్య ఏ ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకున్నా వచ్చే ప్రశ్నలలో ఒకటి- ‘మీకు థైరాయిడ్ ఉందా?’ అంతేకాదు త్వరగా ప్రెగ్నెంట్ కాకపోయినా, బాగా నీరసంగా ఉన్నా, ఒక్కసారిగా ఒళ్లు చేసినా, జుట్టు రాలిపోతున్నా... ఆఖరికి చిరుకుగా ఉన్నా డాక్టర్లు థైరాయిడ్ టెస్ట్‌ చేయించుకోమనే సూచిస్తున్నారు. ఇంతకీ థైరాయిడ్‌ సమస్య ఆడవాళ్లలోనే ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది.

 

థైరాయిడ్ సమస్య ఆటోఇమ్యూన్‌ వ్యాధి వల్ల వస్తుంది. మన శరీరమే, కొన్ని అవయవాల మీద దాడి చేసి వాటిని పాడు చేయడాన్ని ఆటోఇమ్యూన్ వ్యాధి అంటారు. ఆడవాళ్లకి నెలసరి వచ్చిన ప్రతిసారీ వాళ్ల శరీరంలోని హార్మోనులలో విపరీతమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ గ్రంధిని దెబ్బతీస్తుంది. దానివల్ల థైరాయిడ్‌ చాలా తక్కువగా పనిచేయడమో (హైపో థైరాయిడ్‌) లేదా ఎక్కువగా పనిచేయడమో (హైపర్‌ థైరాయిడ్‌) జరుగుతుంది.

 

ప్రెగ్నెన్సీ సమయంలోను, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అకస్మాత్తుగా థైరాయిడ్‌ సమస్య రావడానికి కారణం కూడా హార్మోన్‌ ఇంబాలెన్సే! అందుకనే ఆడవాళ్లు ఎప్పటికప్పుడు ఇతర పరీక్షలతో పాటు తప్పకుండా థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. లేకపోతే పిల్లలు పుట్టకపోవడం, పుట్టినా ఆరోగ్యంగా లేకపోవడం లాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

-Nirjara