అలంకరణే కాదు ఆరోగ్యం కూడా
మగువల చేతులకు అందానిచ్చేే గోరింటాకు..
స్త్రీ సౌభాగ్యం చిహ్నం
గర్భాశయబాధలను నయం చేస్తుంది
ఆషాడ మాసం వచ్చిందంటే చాలు ఆడపిల్లలు తమ చేతుల్ని గోరింటాకుతో అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారం అని పెద్దలు చెబుతారు మరి ఈ ఆచారం వెనుక అసలు కథ ఏంటో తెలుసా.... గోరింటాకులో ఉండే కొన్ని ఔషధగుణాలు ఆడవారి గర్భాశయ బాధలను నివారిస్తాయి. అరిచేతుల్లో ఎర్రగా పండే గోరింటాకు ప్రకృతి సిద్ధంగా ఆడవారిలో వచ్చే కొన్ని సమస్యలకు పరిష్కారం చెబుతుందట.
ఎండాకాలం పోయి వానాకాలం వచ్చే సంధికాలంలో ఆషాడమాసం వస్తుంది. అనేక రకాల వ్యాధులు ఈ కాలంలో పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సమయంలో ఆడవాళ్లు పెట్టుకునే గోరింటాకు వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పురాణాల్లో గోరింటాకు గురించిన ప్రస్తావన ఉంది.. ఈ మొక్క అసలు పేరు గౌరింటాకు…గౌరి ఇంటి ఆకు….వాడుకలో గోరింటాకుగా మారిందట.
ఈ మొక్క పుట్టుక వెనుక ఉన్న కథ ..
గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే
ఓమొక్క పుడుతుంది. అది గమనించి చెలులు గౌరీదేవి తండ్రి పర్వతరాజుకుచెప్పగా సతీసమేతంగా చూసేందుకు
వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నావలన లోకానికి ఏఉపయోగం ఉంది అని అడుగుతుంది. అపుడు గౌరి ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. గౌరి దేవి చేతులకు అలంకరణగా మారుతుంది. దాంతో ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుంది అని ఆ చెట్టులు వరం ఇస్తారు. రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు,స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే
అలంకారవస్తువుగా వాడబడుతుంది.
శాస్త్రపరంగా..
గోరింటాకులో ఉండే 'లాసోన్' అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కేవలం అలంకరణగానే కాదు శాస్త్రపరంగా గోరింటాకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వేడిని ఇది తొలగిస్తుంది. గర్భాశయదోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి చెందిన ప్రధాననాడు లుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి గర్భాశయ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ప్రసవం తర్వాత గోరింటాకు ముద్దగా నూరి చిన్నచిన్న గోళీలుగా చేసుకుని మింగితే ప్రసవంవలన ఏర్పడే గర్భాశయబాధలు నయమవుతాయి.
మన పురాణాల్లో ఉన్నవి కట్టుకథలు కాదు. వాటిలో ఎన్న్ ఆరోగ్యసూత్రాలు దాగి ఉన్నాయి. అయితే వీటిని మన పెద్దలు ఆచారమని చెప్పారు తప్ప వాటిల్లోనే శాస్త్రీయ పరమైన అంశాలను చెప్పలేదు. అందుకే చాలా విషయాలు మూఢాచారాలుగా మిగిలిపోతున్నాయి.